శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

లండన్ లోని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో ‘ఫెలో’ గా సిఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్. శ్రీధర్

Posted On: 29 JUL 2024 1:02PM by PIB Hyderabad

హైదరాబాద్ లోని సిఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో ముఖ్య శాస్త్రవేత్తకెమికల్ ఇంజినీర్ డాక్టర్ సుందర్ గోపాల్ శ్రీధర్ కు యునైటెడ్ కింగ్ డమ్ (యుకె)లోని లండన్ లో గల ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ (ఎఫ్ఆర్ఎస్‌సి)లో మెంబర్ ఐడి: 771115 తో ‘ఫెలో’ గా ప్రవేశం లభించింది.

 

డాక్టర్ శ్రీధర్ 26 సంవత్సరాల పాటు పరిశోధక శాస్త్రవేత్తగా ఉంటూ రసాయనికసంబంధిత పరిశ్రమల కోసం అనేక సాంకేతికతలను అభివృద్ధి పరచడంబదలాయించడంతో పాటు సామాజిక సంక్షేమానికి కూడా ఎంతగానో తోడ్పడ్డారు.  ఔషధ నిర్మాణంఉక్కువస్త్రాలుఅరోమ కెమికల్స్పెట్రోకెమికల్ పరిశ్రమలలో వెలువడే రసాయనాలకు సంబంధించిన ద్రవ వ్యర్థాల నుంచి గంటకు 500 లీటర్ ల మొదలు 5000 లీటర్ ల శుద్ధ పదార్థం రికవరీ సామర్థ్యం కలిగిన మరియు వాయు శుద్ధీకరణ కోసం ఎలెక్ట్రోడయేలిసిస్నానోఫిల్ట్రేషన్,  గ్యాస్ పర్మియేషన్ ప్రక్రియల పైన ఆధారపడ్డ మెంబ్రేన్ పైలట్ ప్లాంట్ లను అనేకం రూపొందించి, అప్పగించడం ఆయన ఉద్యోగజీవనంలో ప్రధాన అంశాల్లో చెప్పుకోదగ్గవి.

 

 

భారతదేశంలో పది రాష్ట్రాలలో ఫ్లూరోసిస్టైఫాయిడ్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల బాధితులు 50 లక్షల మందికి సహాయకారిగా ఉండేందుకు గంటకు 600 లీటర్లు మొదలు 4000 లీటర్ల శుద్ధ జలం ఉత్పాదక శక్తి కలిగిన 75 కు పైగా నీటి శుద్ధి ప్లాంటులను డాక్టర్ శ్రీధర్ రూపొందించడంతో పాటు వాటి స్థాపనలోనూ ఆయన పాటుపడ్డారు.  ప్రభుత్వప్రైవేటు ఆసుపత్రులలో దీర్ఘకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న లక్షలకు పైచిలుకు రోగులకు రక్త శుద్ధికి ఉపయోగపడే మెడికల్-గ్రేడ్ అల్ట్రాప్యూర్ వాటర్ ను అందించే వినూత్నమైనచౌకైన వ్యవస్థ ఆవిష్కరణ కూడా డాక్టర్ శ్రీధర్ ఘనతలలో ఒకటి. నీటి ఎద్దడి ప్రాంతాలలోఆసుపత్రులలోరైల్వే స్టేషన్ లలో గాలిలో తేమను ఉపయోగించుకొని రోజుకు 60 లీటర్ లు మొదలుకొని 1000 లీటర్ల వరకు రీమినరలైజ్డ్ తాగునీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగివుండే అట్మాస్ఫరిక్ వాటర్ జనరేటర్ కు ఆయన రూపకల్పన చేశారు.

 

 

కోవిడ్-19 ప్రభావాన్ని తగ్గించడానికి తక్కువ ఖర్చుతో తయారు చేయగలిగే కొత్తరకానివైన బహుళ పొరలు కలిగినఉతకడానికి వీలుగా ఉండేటటువంటి మాస్కులకు డాక్టర్ శ్రీధర్ రూపురేఖలను తీర్చిదిద్దారు.  ఈ మాస్కులను బడిపిల్లలు సహా ఆరు లక్షలకు పైచిలుకు వ్యక్తులకు అందించారు.  ఈ మాస్కులు ఎన్‌జిఒ లకు 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించి పెట్టడంతో పాటు 500 మంది వయో వృద్ధులకుస్వయంసహాయ సమూహాల (ఎస్ హెచ్ జిస్)కు చెందిన మహిళలకు ఉపాధిని కల్పించాయి.

 

 

డాక్టర్ శ్రీధర్ రాసిన 181 పరిశోధన పత్రాలను ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించారు.  ఆయన 2021,2022, 2023 సంవత్సరాలలో యుఎస్ఎ లోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంఎల్సెవియర్ సైన్స్ పబ్లిషర్ లు రూపొందించిన అగ్రగామి శాతం శాస్త్రవేత్తల లో ఒకరు గా స్థానాన్ని సంపాదించుకొన్నారు.  ఆయన 15 పేటెంట్ లను సాధించారునాలుగు పుస్తకాలు వ్రాశారు; ఆయన రాసిన వ్యాసాలు 50 పుస్తకాలలో అధ్యాయాలుగా ప్రచురణకు నోచుకొన్నాయి.

 

డాక్టర్ శ్రీధర్ ప్రతిష్టాత్మకమైన డెబ్భయ్ విజ్ఞాన శాస్త్ర పురస్కారాలను అందుకొన్నారు.  వాటిలో 2007 సంవత్సరం సిఎస్ఐఆర్ యువ శాస్త్రవేత్త పురస్కారం, 2011 సంవత్సరానికి స్కోపస్ యువ శాస్త్రవేత్త పురస్కారం, 2013 సంవత్సరానికి ఎన్ఎఎస్ఐ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాటినమ్ జూబిలీ అవార్డు, 2015 సంవత్సరంలో ఐఐటి-రూడ్ కీ నుంచి అవార్డు, 2016-2020 సంవత్సరాల మధ్య కాలంలో అయిదు సిఐపిఇటి జాతీయ పురస్కారాలు, 2017 లో ఐఐటి-ఖరగ్ పుర్ నుంచి నీనా సక్సేనా సాంకేతిక విజ్ఞాన శ్రేష్ఠత్వ పురస్కారం, 2019-2021 సంవత్సరాల మధ్య కాలంలో మూడు హెచ్‌పిసిఎల్  ఎన్‌జిఐసి పురస్కారాలుగత సంవత్సరంలో ఏడు ఐఐసిహెచ్ఇ పురస్కారాలతో పాటు అసోచామ్ పురస్కారం కూడా ఉన్నాయి.

 

 

***



(Release ID: 2038609) Visitor Counter : 55