పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాయు కాలుష్యాన్ని నియంత్రించ‌డానికి వినూత్న ప‌ద్ధ‌తులు

Posted On: 29 JUL 2024 12:14PM by PIB Hyderabad

 

వాయు కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి గానూ ట్రాఫిక్ జంక్ష‌న్ల కాలుష్య నియంత్ర‌ణ‌ కోసం ఎన్ఈఈఆర్ఐ(నీరి) అభివృద్ధి చేసిన వాయు శుద్ధీక‌ర‌ణ యూనిట్లు, నిర్మాణ ప్ర‌దేశాలు, రోడ్డుపై ధూళిని నియంత్రించేందుకు ఈపీఆర్ఐ త‌యారు చేసిన డ‌స్ట్ స‌ప్రెస్సంట్, మాన‌వ్ ర‌చ‌న ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆండ్ స్ట‌డీస్‌(ఎంఆర్ఐఐఆర్ఎస్‌) అభివృద్ధి చేసిన బ‌స్సు పైక‌ప్పుపై అమ‌ర్చే శుద్ధీక‌ర‌ణ వ్య‌వ‌స్థ‌, ఐఐటీ బాంబే, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ క‌లిసి అభివృద్ధి చేసిన మ‌ధ్య త‌ర‌హా వాయు శుద్ధీక‌ర‌ణ యూనిట్‌(స్మాగ్ ట‌వ‌ర్‌), పుణెలోని ఎస్ ఆండ్ టీపీ అభివృద్ధి చేసిన అయొనీక‌ర‌ణ‌ సాంకేతిక‌త‌ల ప‌రీక్షలు జ‌రిగాయి. ఈ అన్ని సాంకేతిక‌త‌ల్లో డ‌స్ట్ స‌ప్రెస్సంట్ ఫ‌లితాలు చాలా ప్రోత్సాహ‌క‌రంగా ఉన్న‌ట్టు తేలింది. దీనిని ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వినియోగించాల‌ని ఆదేశాలు ఇవ్వ‌డ‌మైంది.

ఈ ప్రాజెక్టుల‌కు సంబంధించి ప్రాజెక్టు సారాంశం, మంజూరైన వ్య‌యం, వెచ్చించిన ఖ‌ర్చు వివ‌రాలు అనుబంధం-1లో ఉన్నాయి.

కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి(సీపీసీబీ) జాతీయ ప‌రిస‌రాల‌ వాయు నాణ్య‌తా ప్ర‌మాణాల‌(ఎన్ఏఏక్యూఎస్‌)ను 2009లో ప్ర‌క‌టించింది. అన్ని నిర్ధారిత కాలుష్యకార‌కాలను కొలిచే విధానాన్ని ఎన్ఏఏక్యూఎస్‌లో పొందిప‌రిచింది. దేశంలో ప‌రిస‌రాల వాయు నాణ్య‌త ప‌ర్య‌వేక్ష‌ణ ఈ ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే జ‌రుగుతోంది. స‌వ‌రించిన జాతీయ ప‌రిస‌రాల వాయు నాణ్య‌త ప్ర‌మాణాలు అనుబంధం-2లో ఉన్నాయి.

సీపీసీబీ 15 నిరంత‌ర ప‌రిస‌రాల వాయు నాణ్య‌త ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రాల‌(సీఏక్యూఎంఎస్‌) ద్వారా ప‌రిస‌రాల వాయు నాణ్య‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది. ఈ కేంద్రాల్లో ఢిల్లీలో 6, ల‌క్నోలో 3, బెంగ‌ళూరులో 3, చెన్నైలో 3 కేంద్రాలు రియ‌ల్ టైమ్ ప‌ద్ధ‌తిలో ప‌ని చేస్తాయి. ఢిల్లీలో మ‌రో 7 మాన్యువ‌ల్ కేంద్రాలు ఉన్నాయి. గ‌త మూడేళ్లుగా ఈ సీఏక్యూఎం కేంద్రాల కార్య‌క‌లాపాలు, నిర్వ‌హ‌ణ‌కు బ‌డ్జెట్ కేటాయింపు, చేసిన వ్య‌యం వివ‌రాలు అనుబంధం-3లో ఉన్నాయి.

 

 అనుబంధం-1

S. No.

ప్రాజెక్టు పేరు

సంస్థ‌

మంజూరైన వ్య‌యం

వెచ్చించిన ఖ‌ర్చు

 

ఢిల్లీలో ట్రాఫిక్ జంక్ష‌న్ల వ‌ద్ద కాలుష్యాన్ని త‌గ్గించే వాయు శుద్ధీక‌ర‌ణ యూనిట్ల ఏర్పాటు, మూల్యాంక‌నం

సీఎస్ఐఆర్‌-నీరి

రూ.265.22 ల‌క్ష‌లు, వ‌ర్తించే ప‌న్నులు. వీటికి అద‌నంగా భ‌ద్ర‌తా సిబ్బంది నియామ‌కం, వాస్త‌విక గ‌ణాంకాల‌కు త‌గ్గ‌ట్టుగా ఈ యూనిట్ల‌ను అమ‌ర్చేందుకు ఖ‌ర్చులు

₹ 2,50,74,528

 

డ‌స్ట్ సప్రెస్సంట్ వినియోగంతో ధూలి ఉద్గారాల నియంత్ర‌ణ‌

ఎన్విరో పాల‌సీ రీసెర్చ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌(ఈపీఆర్ఐ)

రూ.2.97 ల‌క్ష‌లు, అద‌నంగా ప‌న్నులు

₹ 3,02,400

 

వాయు కాలుష్యాన్ని త‌గ్గించ‌డంలో ఎంఆర్ఐఐఆర్ఎస్ - ప‌రియ‌యంత్ర శుద్ధీక‌ర‌ణ పరీక్ష‌, స‌మ‌ర్థ‌త‌పై పైల‌ట్ ప్రాజెక్టు

మాన‌వ్ ర‌చ‌న ఇంట‌ర్నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆండ్ స్ట‌డీస్‌(ఎంఆర్ఐఐఆర్ఎస్‌)

రూ.19.74 ల‌క్ష‌లు

₹ 11,84,400

 

ఔట్‌డోర్ క్లీనింగ్ సిస్ట‌మ్‌(కొన్నిసార్లు దీనినే స్మాగ్ ట‌వ‌ర్ అంటారు)ను వినియోగించి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని త‌గ్గించ‌డంపై మ‌దింపు చేసేందుకు పైల‌ట్ స్ట‌డీ

ఐఐటీ బాంబే, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌

రూ.18.52 కోట్లు, వీటికి అద‌నంగా విద్యుత్ బిల్లు, కేంద్రాల‌కు విద్యుత్ సౌక‌ర్యం కోసం ఎల‌క్ట్రిక‌ల్ కేబుళ్లు, ట్రాన్స్‌ఫార్మ‌ర్లు వేయడానికి అయ్యే ఖ‌ర్చు, అవ‌స‌ర‌మైతే శ‌బ్ధ నియంత్రిణి ఖ‌ర్చుతో పాటు క‌స్ట‌మ్ డ్యూటీలు, ఆర్ ఆండ్ సెస్‌, సాంకేతిక‌త‌కు చెల్లించే విదేశీ చెల్లింపుపై ప‌న్ను. వీటితో పాటు వాస్త‌వ ప్రాజెక్టు వ్య‌యంపై 8 శాతం ఎన్‌బీసీసీ ఏజెన్సీ పీఎంసీ చార్జీతో పాటు వ‌ర్తించే జీఎస్‌టీ

₹ 35,69,04,835

 

న్యూఢిల్లీలో కాలుష్య నియంత్ర‌ణ‌కు బ‌హుళ యాంటెన్నా క‌లిగిన అధిక సాంధ్ర‌త గ‌ల అయాన్ జెనెరేట‌ర్‌

శాస్త్ర‌, సాంకేతిక పార్కు, పుణె

రూ.18 ల‌క్ష‌లు, అద‌నంగా ప‌న్నులు, శాశ్వ‌త నిర్మాణం, విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసేందుకు అయ్యే ఖ‌ర్చు

₹ 10,80,000

 

అయ‌నీక‌ర‌ణ ఆధార వాయు శుద్ధీక‌ర‌ణ సాంకేతిక‌త ప‌ర్య‌వేక్ష‌ణ‌, మ‌దింపు

ఐఐటీ ఢిల్లీ

రూ.169.92 ల‌క్ష‌లు, అద‌న‌పు వ్యయాలు

₹ 1,12,14,720


అనుబంధం - 2

అనుబంధం - 3

సీపీసీబీ నిర్వ‌హిస్తున్న‌ నిరంత‌ర ప‌రిస‌రాల వాయు నాణ్య‌త ప‌ర్య‌వేక్ష‌ణ కేంద్రాల‌(సీఏక్యూఎంఎస్‌) కార్య‌క‌లాపాలు, నిర్వ‌హ‌ణ కోసం గ‌త మూడేళ్ల‌(2021-22, 2022-23, 2023-24 బ‌డ్జెట్ కేటాయింపు, వ్య‌యం

 

 

 

15 సీఏఏక్యూఎం కేంద్రాల మూడేళ్ల ఓ ఆండ్ ఎం నిధుల స్థితి(రూ.ల‌లో)

 

నిధుల స్థితి/ఆర్థిక సంవ‌త్స‌రం

2021-22

2022-23

2023-24

మంజూరైన నిధులు

3,85,00,000

4,75,80,990

4,00,00,000

వినియోగించిన నిధులు

2,69,19,010

4,48,51,466

2,52,33,748


ఈ స‌మాచారాన్ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ, వాతావ‌ర‌ణ మార్పుల శాఖ స‌హాయ మంత్రి శ్రీ కీర్తి వ‌ర్ధ‌న్ సింగ్ లోక్‌స‌భ‌లో సోమ‌వారం రాత‌పూర్వ‌క స‌మాధానంగా ఇచ్చారు.

 

***


(Release ID: 2038450)