సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణలో భాగంగా అనుబంధ/ అధీన కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలలో ఈ-ఆఫీస్ అమలు
కేంద్ర ప్రభుత్వంలో ఈ-ఆఫీస్ అమలు కోసం 133 అనుబంధ/ అధీన/ స్వయంప్రతిపత్తి సంస్థలు గుర్తించబడ్డాయి.
ఈ-ఆఫీస్ అమలు ప్రక్రియను ప్రారంభించిన 55 అనుబంధ/ అధీన కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు
Posted On:
28 JUL 2024 12:04PM by PIB Hyderabad
2019-2024 సంవత్సరాలలో, కేంద్ర కార్యాలయంలో ఈ-ఆఫీస్ అమలు గణనీయమైన స్థాయికి చేరుకుంది. 37 లక్షల ఫైళ్లు అంటే 94 శాతం కంటే ఎక్కువ ఫైళ్లు, రసీదులు, ఈ-ఫైళ్లు, ఈ-రసీదులుగా ఎలక్ట్రానిక్‌గా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని మరింత లోతుగా పరిశీలించడానికి ప్రభుత్వం ఈ-ఆఫీస్ అనలిటిక్స్ (విశ్లేషణ)ను అభివృద్ధి చేసింది. కేంద్ర కార్యాలయంలో ఈ-ఆఫీస్ ప్లాట్‌ఫాం విజయవంతంగా అమలు చేయబడిన నేపథ్యంలో, అన్ని అనుబంధ, అధీన కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలలో ఈ-ఆఫీస్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్-మంత్రివర్గ సంప్రదింపుల తర్వాత 133 అనుబంధ, అధీన కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు అమలు కోసం గుర్తించబడ్డాయి. అనుబంధ, అధీన కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలలో ఈ-ఆఫీస్ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను డి ఏ పి ఆర్ జీ 24 జూన్ 2024న జారీ చేసింది. ఆన్-బోర్డింగ్ దిశా నిర్దేశం, సాంకేతిక విధి విధానాలు అంతర్-మంత్రివర్గ సమావేశాలలో ఖరారు చేయబడ్డాయి.
రెండవ అంతర్-మంత్రివర్గ సంప్రదింపులు/ సమీక్ష సమావేశం 26 జూలై 2024న, డి ఏ పి ఆర్ జీ కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో ఎన్ ఐ సి, అన్ని మంత్రిత్వ శాఖలు/ విభాగాలు, అనుబంధ, అధీన కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 290 మందికి పైగా అధికారులు వీ సీ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. 55 అనుబంధ/ అధీన కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు ఈ-ఆఫీస్ అమలు ప్రక్రియను ప్రారంభించాయి. అన్ని అనుబంధ/ అధీన కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలు 31 జూలై 2024 నాటికి ఎన్ ఐ సి ఈ-ఆఫీస్ పి ఎం యూ కి అంచనా నమూనాలను సమర్పించాలని ఏకాభిప్రాయం కుదిరింది. అన్ని అనుబంధ/ అధీన/ స్వయంప్రతిపత్తి కార్యాలయాలలో ఈ-ఆఫీస్ విస్తరణ ప్రభుత్వ పరిపాలన సంస్కరణలు, ప్రజా పిటిషన్ల శాఖ 100 రోజుల కార్యాచరణ లో భాగంగా జరుగుతోంది.
***
(Release ID: 2038176)
Visitor Counter : 88