వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలో అంకుర సంస్థలు

Posted On: 26 JUL 2024 5:12PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం నవకల్పన, అంకుర సంస్థలను ప్రోత్సహించడం, దేశంలో అంకుర వ్యవస్థలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించే లక్ష్యంతో 16 జనవరి 2016 తేదీన స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

19 ఫిబ్రవరి 2019 తేదీ నాటి జీఎస్ఆర్ నోటిఫికేషన్ 127 (E) కింద నిర్దేశించిన అర్హత నిబంధనల ప్రకారం, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి) స్టార్టప్ ఇండియా చొరవ కింద సంస్థలను 'అంకుర సంస్థలు' గా గుర్తిస్తుంది. 30 జూన్ 2024 తేదీ నాటికి 1,40,803 సంస్థలను అంకుర సంస్థలుగా డీపీఐఐటీ గుర్తించింది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) వారీగా డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్యను అనుబంధం-1 లో పేర్కొన్నారు.

దేశంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేపట్టింది. అటువంటి ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు అనుబంధం II లో పేర్కొన్నారు.
 

అనుబంధం-I


రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకుర సంస్థల సంఖ్య:

 

క్ర. సం

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకురాల సంఖ్య

1.

అండమాన్ నికోబార్ దీవులు

59

2.

ఆంధ్రప్రదేశ్

2,252

3.

అరుణాచల్ ప్రదేశ్

38

4.

అసోం

1,318

5.

బిహార్

2,786

6.

చండీగఢ్

489

7.

ఛత్తస్ గడ్

1,517

8.

దాద్రా, నగర్ హవేలీ, డామన్ డయ్యూ

53

9.

దిల్లీ

14,734

10.

గోవా

520

11.

గుజరాత్

11,436

12.

హరియాణా

7,385

13.

హిమాచల్ ప్రదేశ్

484

14.

జమ్ము కశ్మీర్

855

15.

జార్ఘంట్

1,305

16.

కర్ణాటక

15,019

17.

కేరళ

5,782

18.

లఢక్

16

19.

లక్షద్వీప్

3

20.

మధ్యప్రదేశ్

4,500

21.

మహారాష్ట్ర

25,044

22.

మణిపూర్

151

23.

మేఘాలయ

52

24.

మిజోరం

32

25.

నాగాలాండ్

66

26.

ఒడిషా

2,484

27.

పూదుచ్చేరి

152

28.

పంజాబ్

1,539

29.

రాజస్థాన్

4,960

30.

సిక్కిం

11

31.

తమిళనాడు

9,238

32.

తెలంగాణ

7,336

33.

త్రిపుర

123

34.

ఉత్తర్ ప్రదేశ్

13,299

35.

ఉత్తరాఖండ్

1,138

36.

పశ్చిమ బెంగాల్

4,627

 

మొత్తం

1,40,803

 

అనుబంధం-2

 

దేశవ్యాప్తంగా అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలు:

 

1.       స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్: స్టార్టప్ ఇండియా కోసం ఒక కార్యాచరణ ప్రణాళికను 16 జనవరి 2016 న ఆవిష్కరించారు. ఈ కార్యాచరణ ప్రణాళికలో 19 అంశాలను పొందుపరిచారు. "సరళీకరణ హ్యాండ్‌హోల్డింగ్", "నిధుల సహాయంప్రోత్సాహకాలు" "పరిశ్రమ-విద్యా భాగస్వామ్యం ఇంక్యుబేషన్" వంటివి ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ మద్దతుపథకాలు ప్రోత్సాహకాలకు ఈ కార్యాచరణ ప్రణాళిక దేశంలో శక్తివంతమైన అంకుర వ్యవస్థను సృష్టించడానికి పునాది వేసింది.

2.       స్టార్టప్ ఇండియా: ముందున్న మార్గం: స్టార్టప్ ఇండియా ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని 16 జనవరి 2021వ తేదీన స్టార్టప్ ఇండియా- ది వే ఎహెడ్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఇందులో అంకుర సంస్థలుకు సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి కార్యాచరణ ప్రణాళికలువివిధ సంస్కరణలను అమలు చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం అధిక పాత్రవాటాదారుల సామర్థ్యాలను పెంచడండిజిటల్ ఆత్మనిర్భర్ భారత్ లను ప్రారంభించడం జరిగింది.

3.       స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ (ఎస్ఐఎస్ఎఫ్ఎస్): ఒక సంస్థ ఎదుగుదల ప్రారంభ దశలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సులభంగా మూలధన లభ్యత అవసరం. ఈ దశలో అవసరమైన మూలధనం తరచుగా మంచి వ్యాపార ఆలోచనలు ఉన్న అంకుర సంస్థల ఏర్పాటు చేసుకునేందుకు లేదా విజయం సాధించడానికి మార్గం సుగమం చేస్తుంది. కాన్సెప్ట్ ప్రూఫ్ప్రోటోటైప్ అభివృద్ధిప్రొడక్ట్ ట్రయల్స్మార్కెట్ ఎంట్రీవాణిజ్యీకరణ కోసం అంకురాలకు ఆర్థిక సహాయం అందించడం ఈ పథక లక్ష్యం. ఎస్ఐఎస్ఎఫ్ఎస్ పథకం కింద 2021 నుంచి నాలుగేళ్ల కాలానికి రూ.945 కోట్లు మంజూరు చేశారు.

4.       ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్ (ఎఫ్ఎఫ్ఎస్) పథకం: అంకుర సంస్థలకు నిధుల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం రూ.10 వేల కోట్ల మూలనిధితో ఎఫ్ఎఫ్ఎస్ ను ఏర్పాటు చేసింది. డీపీఐఐటీ పర్యవేక్షణ ఏజెన్సీ కాగాస్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) ఎఫ్‌ఎఫ్‌ఎస్ కు కార్యనిర్వహాక ఏజెన్సీ గా పనిచేస్తుంది. పథకం పురోగతినిధుల లభ్యత ఆధారంగా 1415వ ఆర్థిక సంఘంలో మొత్తం రూ.10,000 కోట్ల నిధిని అందించాలని భావిస్తున్నారు. ప్రారంభ దశవిత్తన దశవృద్ధి దశలో అంకుర సంస్థలకు మూలధనాన్ని అందుబాటులో ఉంచడమే కాకుండా దేశీయ మూలధన సమీకరణను సులభతరం చేయడంవిదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించడంస్వదేశీకొత్త వెంచర్ క్యాపిటల్ ఫండ్లను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది.

5.       స్టార్టప్ ల కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (సీజీఎస్ఎస్): సెబీ రిజిస్టర్డ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ కింద షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులుబ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు)వెంచర్ డెట్ ఫండ్స్ (వీడీఎఫ్) ద్వారా డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకురాలకు ఇచ్చిన రుణాలకు గ్యారంటీలు ఇచ్చేందుకు ప్రభుత్వం స్టార్టప్ల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ఏర్పాటు చేసింది. డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకురాల వంటి అర్హులైన రుణగ్రహీతలకు ఫైనాన్స్ చేయడానికి మెంబర్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఐ) అందించే రుణాలపై నిర్ణీత పరిమితి వరకు రుణ గ్యారంటీని అందించడమే సీజీఎస్‌ఎస్ లక్ష్యం.

6.       నియంత్రణ సంస్కరణలు: సులభతర వాణిజ్యాన్ని పెంపొందించేందుకుమూలధన సమీకరణను సులభతరం చేయడానికిఅంకుర వ్యవస్థ సమ్మతి భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం 2016 నుండి 55 కి పైగా నియంత్రణ సంస్కరణలను చేపట్టింది.

7.       సులభతర సేకరణ: సేకరణను సులభతరం చేయడానికినాణ్యతసాంకేతిక వివరణలకు లోబడి అన్ని డిపిఐఐటి గుర్తింపు పొందిన అంకురాలకు ముందస్తు టర్నోవర్పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ లో ముందస్తు అనుభవ షరతులను సడలించాలని కేంద్ర మంత్రిత్వ శాఖలను/ విభాగాలను ఆదేశించింది. ఇంకా, 'గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్' (జిఈఎమ్) అంకురాల నుండి ప్రభుత్వం ద్వారా ఉత్పత్తులుసేవలను సేకరించడానికి కూడా వీలు కల్పిస్తుంది.

8.       కార్మికపర్యావరణ చట్టాల కింద స్వీయ సర్టిఫికేషన్: అంకుర సంస్థలు ప్రారంభించిన తేదీ నుంచి 3 నుంచి 5 సంవత్సరాల కాలానికి 9 కార్మిక చట్టాలను3 పర్యావరణ చట్టాలకు తామే స్వీయ సమ్మతిని చేసేందుకు అనుమతించబడతాయి.

9.       మూడేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు: 1 ఏప్రిల్ 2016 తేదీ లేదా ఆ తర్వాత ఏర్పాటైన అంకుర సంస్థలకు ఆదాయపు పన్ను మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ మినిస్టీరియల్ బోర్డ్ సర్టిఫికేట్ పొందిన గుర్తింపు పొందిన అంకురాలకు విలీనం అయిన పదేళ్లలో వరుసగా 3 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.

10.     అంకుర సంస్థలకు వేగవంతమైన నిష్క్రమణ విధానం: ఇతర కంపెనీలకు 180 రోజులతో పోలిస్తే 90 రోజుల్లో కార్యకలాపాలను ముగించేందుకు వీలుగా స్టార్టప్‌లను 'ఫాస్ట్ ట్రాక్ సంస్థలు'గా ప్రభుత్వం నోటిఫై చేసింది.

11.     చట్టంలోని సెక్షన్ 56 (2019)లోని సబ్ సెక్షన్ (2)లోని క్లాజ్ (7)(బి) ప్రయోజనం కోసం మినహాయింపు: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56 (2) (వీఐఐబీ) నిబంధనల నుంచి డీపీఐఐటీ గుర్తింపు పొందిన అంకుర సంస్థలకు మినహాయింపు లభిస్తుంది.

12.     మేధో సంపత్తి పరిరక్షణకు మద్దతు: అంకురాలు త్వరితగతిన పేటెంట్ దరఖాస్తు పరిశీలనడిస్పోజల్ కు అర్హులు. స్టార్టప్‌లు పేటెంట్లుడిజైన్లుట్రేడ్ మార్క్ ల కోసం రిజిస్టర్డ్ ఫెసిలిటేటర్ల ద్వారా సంబంధిత ఐపీ కార్యాలయాల్లో చట్టబద్ధమైన రుసుములు మాత్రమే చెల్లించి దరఖాస్తులు దాఖలు చేసుకునేందుకు వీలు కల్పించే స్టార్టప్స్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ (ఎస్ ఐపీపీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఫెసిలిటేటర్లు వివిధ ఐపీఆర్ లపై సాధారణ సలహాలను అందించడానికిఇతర దేశాలలో ఐపిఆర్‌లను సంరక్షించడంప్రోత్సహించడంపై సమాచారాన్ని అందించడానికి బాధ్యత వహిస్తారు. ఎన్ని పేటెంట్లుట్రేడ్ మార్క్ లు లేదా డిజైన్లకైనా నిర్వహణకు మొత్తం రుసుమును ప్రభుత్వమే భరిస్తుంది. అంకురాలు చెల్లించాల్సిన చట్టబద్ధమైన రుసుముల ఖర్చును మాత్రమే భరిస్తాయి. స్టార్టప్‌లకు పేటెంట్ల ఫైలింగ్ లో 80 శాతంట్రేడ్ మార్క్ నింపడంలో ఇతర కంపెనీలతో పోలిస్తే 50 శాతం తగ్గింపు లభిస్తుంది.

13. స్టార్టప్ ఇండియా హబ్: ప్రభుత్వం స్టార్టప్ ఇండియా ఆన్‌లైన్ హబ్‌ను 19 జూన్ 2017 న ప్రారంభించింది. ఇది దేశంలోని వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థలోని భాగస్వాములందరికీ ఒకరినొకరు సహకరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ వేదిక. అంకురాలుపెట్టుబడిదారులుఫండ్స్మెంటర్స్విద్యాసంస్థలుఇంక్యుబేటర్లుయాక్సిలరేటర్లుకార్పొరేట్ సంస్థలుప్రభుత్వ సంస్థలుఈ హబ్ ఆతిథ్యం వహిస్తాయి.

14.భారతీయ అంకురాలకు అందుబాటులో అంతర్జాతీయ మార్కెట్: వివిధ మాధ్యమాల ద్వారా భారతీయ అంకుర వ్యవస్థను గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లతో అనుసంధానించడంలో సహాయపడటం స్టార్టప్ ఇండియా చొరవలోని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. వివిధ దేశ ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యంఅంతర్జాతీయ వేదికలలో పాల్గొనడం అంతర్జాతీయ సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఇది ఏర్పాటైంది. భాగస్వామ్య దేశాలకు చెందిన అంకురాలకు సాఫ్ట్ ల్యాండింగ్ వేదికను అందించడంతో పాటు క్రాస్ కోఆపరేషన్ ను ప్రోత్సహించడంలో సహాయపడే 20 దేశాలతో స్టార్టప్ ఇండియా భాగస్వామ్యం కలిగి ఉంది.

15.     స్టార్టప్ ఇండియా షోకేస్: వర్చువల్ ప్రొఫైల్ల రూపంలో ప్రదర్శించే అంకుర సంస్థల కోసం వివిధ కార్యక్రమాల ద్వారా ఎంపిక చేసిన ఆన్‌లైన్ డిస్కవరీ వేదికే ఈ స్టార్టప్ ఇండియా షోకేస్. ఈ వేదికలో ప్రదర్శించిన స్టార్టప్ లు తమ రంగాల్లో అత్యుత్తమమైనవిగా నిలిచాయి. ఫిన్‌టెక్ఎంటర్ ప్రైజ్ టెక్సోషల్ ఇంపాక్ట్హెల్త్ టెక్ఎడ్‌టెక్ వంటి వివిధ అత్యాధునిక రంగాల్లో ఈ ఆవిష్కరణలు విస్తరించాయి. ఈ అంకురాలు క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తూ ఆయా రంగాల్లో అసాధారణ ఆవిష్కరణలను కనబరుస్తున్నాయి. ఇందులోని వాటాదారులు ఈ అంకురాలను పెంచి పోషించారుమద్దతు ఇచ్చారుతద్వారా ఈ వేదికపై వారి ఉనికిని చాటుకున్నారు.

 

16.నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్: సుస్థిర ఆర్థిక వృద్ధి కోసంపెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడానికి దేశంలో ఆవిష్కరణలుఅంకుర సంస్థలను ప్రోత్సహించడానికి బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన చర్యలపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి జనవరి 2020లో నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌అఫీషియో సభ్యులతో పాటుస్టార్టప్ ఎకోసిస్టమ్ నుండి వివిధ వాటాదారులకు ప్రాతినిధ్యం వహించే అనేక మంది నాన్-అఫిషియో సభ్యులు కౌన్సిల్లో ఉన్నారు.

17.     నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ (ఎన్ఎస్ఏ): అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అంకుర సంస్థలనువ్యవస్థను ఏర్పాటు చేసే సంస్థలను గుర్తిస్తూ ఈ జాతీయ స్టార్టప్ పురస్కారాలను అందిస్తారు. వినూత్న ఆవిష్కరణలుపరిష్కారాలను చేస్తూఉద్యోగితను కల్పిస్తూ సంపద సృష్టిలో పాలుపంచుకునే సంస్థలను ఎంపిక చేస్తారు. ఇన్వెస్టర్ కనెక్ట్మెంటార్షిప్కార్పొరేట్ కనెక్ట్గవర్నమెంట్ కనెక్ట్ఇంటర్నేషనల్ మార్కెట్ యాక్సెస్రెగ్యులేటరీ సపోర్ట్దూరదర్శన్లో స్టార్టప్ చాంపియన్స్స్టార్టప్ ఇండియా షోకేస్ వంటి వివిధ అంశాల్లో ఫైనలిస్టులందరికీ మద్దతు లభిస్తుంది.

18.     32. రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎస్ఆర్ఎఫ్): రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ దేశంలో  సమాఖ్య శక్తిని ఉపయోగించుకోవడానికిరాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ వ్యవస్థలను సృష్టించడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక చొరవ. మంచి పద్ధతులను గుర్తించడానికినేర్చుకోవడానికిభర్తీ చేయడానికి రాష్ట్రాలకు వెసులుబాటు కల్పనస్టార్టప్ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించడానికి రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడం ర్యాంకింగ్ ప్రక్రియ ప్రధాన లక్ష్యాలు.

19 దూరదర్శన్ లో స్టార్టప్ ఛాంపియన్స్: స్టార్టప్ ఛాంపియన్స్ కార్యక్రమం దూరదర్శన్‌లో గంట పాటు ప్రసారం చేసే కార్యక్రమం.  అవార్డు పొందిన/ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అంకుర సంస్థల విజయగాథను ఇందులో వివరిస్తారు. ఇది దూరదర్శన్ నెట్వర్క్ ఛానెళ్లలో హిందీఇంగ్లీష్ భాషల్లో ప్రసారం చేయబడుతుంది.

20. స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వీక్: ప్రభుత్వం దేశంలోని కీలక అంకురాలుఔత్సాహిక పారిశ్రామికవేత్తలుపెట్టుబడిదారులుఇంక్యుబేటర్లుఫండింగ్ సంస్థలుబ్యాంకులువిధాన నిర్ణేతలుఇతర జాతీయ/అంతర్జాతీయ భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకువచ్చి వ్యవస్థాపకత్వాన్ని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా జాతీయ అంకుర దినోత్సవం జనవరి 16 సమయంలో స్టార్టప్ ఇండియా ఇన్నోవేషన్ వారోత్సవలను నిర్వహిస్తుంది.

21. అసెండ్: అసెండ్ (యాక్సిలరేటింగ్ స్టార్టప్ క్యాలిబర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డ్రైవ్) కిందమొత్తం ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు అంకురాలువ్యవస్థాపనలపై అవగాహన వర్క్‌షాప్ లు నిర్వహించారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క కీలక అంశాలపై పరిజ్ఞానాన్ని పెంపొందించడం ఈశాన్య భారతంలో బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ ను సృష్టించే దిశగా ప్రయత్నాలను కొనసాగించడం దీని లక్ష్యం.

22. స్టార్టప్ ఇండియా ఇన్వెస్టర్ కనెక్ట్ పోర్టల్ ను స్టార్టప్ ఇండియా సిడ్బీ సహకారంతో వివిధ పరిశ్రమలువిధులుదశలుప్రాంతాలునేపథ్యాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మూలధన సమీకరణలో సహాయపడేందుకు అంకురాలుఇన్వెస్టర్లను అనుసంధానిస్తోంది. దేశంలో వివిధ ప్రాంతాల్లోని అంకుర సంస్థలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు/ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కు అనుసంధానిస్తూ ఈ పోర్టల్ సహాయపడుతుంది.

23. నేషనల్ మెంటార్ షిప్ పోర్టల్ (మార్గ్): దేశంలోని ప్రతి ప్రాంతంలోని స్టార్టప్ లకు మెంటార్‌షిప్అడ్వైజరీఅసిస్టెన్స్రెసిస్టెన్స్ అండ్ గ్రోత్ (మార్గ్) కార్యక్రమాన్ని స్టార్టప్ ఇండియా కింద అభివృద్ధి చేసి ప్రారంభించారు.

24. ఎంఈఐటీవై స్టార్టప్ హబ్ (ఎంఎస్‌హెచ్): దేశవ్యాప్తంగా డీప్‌టెక్ స్టార్టప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అనుసంధానం చేసేందుకు నోడల్ సంస్థగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ఆధ్వర్యంలో 'ఎంఈఐటీవై స్టార్టప్ హబ్ ' (ఎంఎస్ హెచ్ ) ఏర్పాటైంది. ఎంఎస్‌హెచ్ ఇంక్యుబేటర్లు స్టార్టప్లకు వారి స్కేలబిలిటీమార్కెట్ అవుట్‌రీచ్ మొదలైన వాటిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వివిధ భాగస్వాములతో భాగస్వామ్యాలను కూడా స్థాపించిందిఇది సృజనాత్మకత మరియు సాంకేతిక పురోగతిపై నిర్మించబడిన ఆర్థిక వ్యవస్థకు మార్గం సుగమం చేస్తుంది.

25. టైడ్ 2.0 పథకం: ఐఓటీఏఐబ్లాక్ చైన్రోబోటిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించి ఐసిటి స్టార్టప్ లకు మద్దతు ఇవ్వడంలో నిమగ్నమైన ఇంక్యుబేటర్లకు ఆర్థికసాంకేతిక మద్దతు ద్వారా టెక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ను ప్రోత్సహించడానికి టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్ మెంట్ ఆఫ్ ఎంటర్ ప్రెన్యూర్స్ (టైడ్ 2.0) పథకాన్ని 2019 సంవత్సరంలో ప్రారంభించారు. ఉన్నత విద్యా సంస్థలుప్రముఖ పరిశోధనాభివృద్ధి సంస్థల్లో ఇంక్యుబేషన్ కార్యకలాపాలను ప్రోత్సహించే లక్ష్యంతో మూడంచెల నిర్మాణం ద్వారా ఇంక్యుబేటర్ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

26. డొమైన్ స్పెసిఫిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్: స్వయం సమృద్ధిని పెంపొందించడానికికొత్తగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలను అందిపుచ్చుకోవడానికి సామర్థ్యాలను సృష్టించడానికి జాతీయ ఆసక్తి ఉన్న వివిధ రంగాలలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఇ) ను ఎంఇఐటివై అమలు చేసింది. ఈ డొమైన్ స్పెసిఫిక్ సీఓఈలు సృజనాత్మకతను ప్రజాస్వామ్యీకరించడంప్రోటోటైప్‌ల సాకారం ద్వారా భారతదేశాన్ని ఇన్నోవేషన్ హబ్ గా మార్చడంలో సహాయపడతాయి.

27. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్ఎసి): శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన ఇండస్ట్రీ - అకాడెమియా ఇంటర్ఫేస్ ఏజెన్సీ క్లీన్ ఎనర్జీఎమర్జింగ్ టెక్నాలజీలతో సహా అన్ని బయోటెక్ రంగాలలో బయోటెక్ అంకుర సంస్థలకు మద్దతు ఇస్తోంది. బయోటెక్ ఇగ్నిషన్ గ్రాంట్ (బిగ్)స్మాల్ బిజినెస్ ఇన్నోవేషన్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (ఎస్బిఐఆర్ఐ),

 
***

(Release ID: 2038108) Visitor Counter : 87


Read this release in: English , Hindi , Hindi_MP , Tamil