అణుశక్తి విభాగం
అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో కర్ణాటకలోని మాండ్య, యాదగిరి జిల్లాల్లో లిథియం వనరుల అన్వేషణ
చిన్నమాడ్యులర్ రియాక్టర్ సాంకేతికతలో ప్రపంచ దోరణిని పరిశీలించిన భారత్
అణుశక్తిని శాంతియుత వినియోగంలో భారత్, రష్యాల మధ్య సహకార విస్తరణ
Posted On:
25 JUL 2024 5:38PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యులు), పీఎంవో, అణు ఇంధన విభాగం, అంతరిక్ష శాఖ, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అణు ఇంధన శాఖకు చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ) కర్ణాటకలోని మాండ్య, యాదగిరి జిల్లాల్లో లిథియం వనరుల ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. లిథియం వనరులను గుర్తించడానికి, అంచనా వేయడానికి కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ప్రాథమిక సర్వేలు, పరిమిత ఉపరితల అన్వేషణ జరిగింది. కర్ణాటకలోని మాండ్య జిల్లా మర్లగళ్ల ప్రాంతంలో 1,600 టన్నుల (జీ3 స్టేజ్) లిథియం వనరులను ఏఎండీ ఏర్పాటు చేసిందని నేడు రాజ్య సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాతపూర్వక సమాధానమిచ్చారు.
ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ లోని కోర్బా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సంభావ్యత కలిగిన ప్రాంతాల్లో లిథియం కోసం ఏఎండీ అన్వేషణ చేస్తోందని డా. జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఏదేమైనా, రాజస్థాన్, బిహార్, ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న ప్రధాన మైకా బెల్టులు, ఒడిశా, చత్తీస్ గఢ్, కర్ణాటకలోని పెగ్మటైట్ బెల్టులు లిథియం వనరులకు దేశంలో సంభావ్యత కలిగిన భౌగోళిక ప్రాంతాలు.
హిమాచల్ ప్రదేశ్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ)కు చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ) ఇటీవల నిర్వహించిన ప్రాథమిక సర్వేలో హమీర్ పూర్ జిల్లాలోని మసాన్‌బల్ లో ఉపరితల యురేనియం ఆనవాళ్లను గుర్తించినట్లు కేంద్రమంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లో అటామిక్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు అటామిక్ ఎనర్జీ కమిషన్ ఎలాంటి అధ్యయనం చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
అణు ఇంధన విభాగం చిన్న మాడ్యులర్ రియాక్టర్ల రంగంలో ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు, ఇటీవలి ధోరణులను గమనిస్తోందని డా. జితేంద్ర సింగ్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. వివిధ దేశాలు, విదేశీ ఆధారిత విక్రేతలు ప్రచురించిన చిన్న మాడ్యులర్ రియాక్టర్ల వివిధ సాంకేతికతలు, నమూనాల సాంకేతిక వివరాల సేకరణ కోసం అధ్యయనం చేస్తున్నప్పటికీ, విదేశీ విక్రేతలు/ దేశాలతో కలిసి పనిచేసే ప్రతిపాదన ప్రస్తుతం పరిశీలనలో లేదు. చిన్న మాడ్యులర్ రియాక్టర్ ఉత్పత్తికి ప్రస్తుతం ఏ ప్రైవేటు సంస్థ ఆసక్తి చూపలేదని ఆయన తెలిపారు. అయితే, కొన్ని ప్రైవేట్ సంస్థలు చిన్న రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆయన తెలిపారు.
చిన్న మాడ్యులర్ రియాక్టర్ రంగంలో సహకారంతో పాటు శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఇంధనాన్ని ఉపయోగించే రంగంలో సహకారాన్ని విస్తరించడానికి భారత ప్రభుత్వం, రష్యా ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నాయని కేంద్రమంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు.
***
(Release ID: 2037388)
Visitor Counter : 182