ఉక్కు మంత్రిత్వ శాఖ
2023-24 సంవత్సరానికి గాను 'రాజభాషా గౌరవ్ సమ్మాన్'ను విశాఖపట్నంలోని ప్రభుత్వ రంగ సంస్థలకు పట్టణ అధికార భాషా అమలు కమిటీ (టోలిక్) ప్రదానం చేసింది.
Posted On:
25 JUL 2024 5:18PM by PIB Hyderabad
పట్టణ అధికార భాషా అమలు కమిటీ-టోలిక్ (పీఎస్ యూ), విశాఖపట్నం సమావేశం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఈరోజు జరిగింది.
శ్రీ అతుల్ భట్, చైర్మన్ , పట్టణ అధికార భాషా అమలు కమిటీ-టోలిక్ (పీఎస్ యూ), విశాఖపట్నం మరియు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ , రాష్ట్రియ్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ ఐఎన్ ఎల్), అధికార భాషా అమలు రంగంలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన విశాఖపట్నంలోని పీఎస్ యూలకు 2023-24 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక 'రాజభాషా గౌరవ్ సమ్మాన్'ను, ఆయా సంస్థల హిందీ అధికారులు, సమన్వయకర్తలకు 'నగర్ రాజ్భాషా సమ్మాన్'ను ప్రదానం చేశారు.
ప్రతి '3' కేటగిరీల్లో మూడు కార్యాలయాలు అత్యుత్తమ ప్రదర్శనకు గాను 1, 2, 3 మరియు కన్సొలేషన్ స్థానాలకుగాను గుర్తింపు పొందాయి. కేటగిరీ-1లో హెచ్పీసీఎల్-విశాఖ రిఫైనరీ, ఎన్టీపీసీ సింహాద్రి, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందుకోగా, కేటగిరీ-2లో గెయిల్, హెచ్పీసీఎల్-విశాఖ ప్రాంతీయ కార్యాలయం, సెయిల్- బ్రాంచ్ ట్రాన్స్పోర్ట్ & షిప్పింగ్ ఆఫీస్, ఎఫ్సీఐ-రీజినల్ ఆఫీస్ లు, అలాగే కేటగిరీ-3లో ఎంఎస్టీసీ, హెచ్పీసీఎల్ ఎల్పీజీ, ఈసీజీసీ (ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ అతుల్ భట్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చే ప్రాంతీయ అధికార భాషా అవార్డును2022-23 సంవత్సరానికి సాధించినందుకు టోలిక్ (పిఎస్ యు) ను అభినందించారు. అవార్డు గెలుచుకున్న స్థానిక పిఎస్ యులకు అభినందనలు తెలుపుతూ, విశాఖపట్నంలో హిందీని ప్రగతిశీలంగా ఉపయోగించడంలో టోలిక్ (అండర్ టేకింగ్) కృషిని మరియు అన్ని సభ్య సంస్థల మద్దతును శ్రీ అతుల్ భట్ అభినందించారు.
బెంగళూరులోని హోం మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (ఇంప్లిమెంటేషన్) శ్రీ అనిర్బన్ కుమార్ బిశ్వాస్ ఈ సమావేశంలో అధికార భాషా అమలు విషయంలో సభ్య సంస్థలు (పిఎస్ యులు) సాధించిన పురోగతిని సమీక్షించారు, సభ్య కార్యాలయాల మొత్తం పనితీరును ప్రశంసించారు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం జారీ చేసిన వివిధ మార్గదర్శకాలను శ్రీ అనిర్బన్ కుమార్ బిశ్వాస్ వివరించారు.
హోం మంత్రిత్వ శాఖ హిందీ టీచింగ్ స్కీమ్ అసిస్టెంట్ డైరెక్టర్ విశాఖపట్నం-ఇన్చార్జి డాక్టర్ రీటా త్రివేది విశాఖపట్నంలో అందుబాటులో ఉన్న హిందీ శిక్షణ సౌకర్యాల గురించి వివరించి, వాటిని ఉపయోగించుకోవాలని సభ్య కార్యాలయాలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎన్ టిపిసి సింహాద్రి ప్రాజెక్ట్ హెడ్ శ్రీ సంజయ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, స్థానిక పిఎస్ యులలో హిందీని ప్రచారం చేయడంలో ఆర్ ఐఎన్ ఎల్ సిఎండి శ్రీ అతుల్ భట్ నేతృత్వాన్ని అభినందించారు, వారి విలువైన మార్గాదర్శనానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో విశాఖపట్నంలోని వివిధ పీఎస్ యూ ల (పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్) అధిపతులు, ఆర్ఐఎన్ఎల్ సీజీఎం (హెచ్ఆర్) జి.గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ అతుల్ భట్, శ్రీ సంజయ్ కుమార్ సిన్హా, శ్రీ అనిర్బన్ కుమార్ బిశ్వాస్, డాక్టర్ రీటా త్రివేది, శ్రీ జి గాంధీ మరియు డాక్టర్ లలన్ కుమార్ లు, టోలిక్ హిందీ పత్రిక 'విశాఖ ధార' 8వ సంచికను విడుదల చేశారు.
ఆర్ఐఎన్ఎల్ జీఎం (అధికార భాష, ఆతిథ్యం) మెంబర్ సెక్రటరీ (టోలిక్) డాక్టర్ లలన్ కుమార్, ఆర్ఐఎన్ఎల్ ఏజీఎం (అధికార భాష) డాక్టర్ టి హైమావతి ఈ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీమతి వి.సుగుణ, సీనియర్ మేనేజర్(అధికారభాష) ఆర్.ఐ.ఎన్.ఎల్ ధన్యవాదాలు తెలిపారు.
***
(Release ID: 2037228)
Visitor Counter : 89