అణుశక్తి విభాగం

2031-32 నాటికి భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుంది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


2047 నాటికి నెట్ జీరో ట్రాన్సిషన్ కోసం 1 లక్ష మెగావాట్ అణు సామర్థ్యం భారతదేశం లక్ష్యం

గత 10 సంవత్సరాలలో భారతదేశంలో అణు విద్యుత్ సామర్థ్యంలో 70% వృద్ధి : డాక్టర్ జితేంద్ర సింగ్

15,300 మెగావాట్ సామర్థ్యంతో 21 కొత్త అణు రియాక్టర్లు నిర్మాణ దశ లో ఉన్నాయి: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 25 JUL 2024 5:36PM by PIB Hyderabad

2031-32 నాటికి భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం మూడు రెట్లు పెరుగుతుంది. "ప్రస్తుత  అణు విద్యుత్ సామర్థ్యం 2031-32 నాటికి 8180 మెగావాట్ల నుండి 22480 మెగావాట్ల కు పెరుగుతుంది" అని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  (స్వతంత్ర ఛార్జ్) సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ (స్వతంత్ర ఛార్జ్) ఎర్త్ సైన్సెస్  ఎం ఓ ఎస్ పర్సనల్, పబ్లిక్ గ్రివెన్సెస్ అండ్ పెన్షన్స్, రాజ్యసభలో ఓ ప్రశ్నకు వ్రాతపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో పేర్కొన్నారు.

2070 నాటికి నెట్ జీరో ట్రాన్సిషన్ కోసం భారతదేశ విద్యుత్ శక్తి పరివర్తనను హైలైట్ చేస్తూ,  , "వివిధ అధ్యయనాలు 2047 నాటికి 1 లక్ష మెగావాట్ల  జాతీయ అణు సామర్థ్యం అవసరం అని అంచనా వేసాయి, ఆ అధ్యయనాల సిఫార్సులను భవిష్యత్తులో అమలుచేయడానికి సానుకూలంగా పరిగణనలోనికి తీసుకుంటున్నాము." అని డాక్టర్ జితేంద్ర సింగ్అన్నారు.

అణుశక్తి సామర్థ్యం పెంపు విషయంపై సమాధానమిస్తూ మంత్రి డాక్టర్. సింగ్, గత 10 సంవత్సరాలలో భారతదేశం అణుశక్తి సామర్థ్యం 70 శాతం కంటే ఎక్కువగా పెరిగిందని తెలిపారు. 2013-14లో 4,780 మెగావాట్ల నుండి 2023-24లో 8,180 మెగావాట్లకు చేరుకుంది. అణుశక్తి ప్లాంట్ల నుండి వార్షిక విద్యుత్ ఉత్పత్తి 2013-14లో 34,228 కోట్ల యూనిట్ల నుండి 2023-24లో 47,971 కోట్ల యూనిట్లకు పెరిగిందని తెలిపారు.

దేశంలో ప్రస్తుతం 24 అణు విద్యుత్ రియాక్టర్లలు   8,180 మెగావాట్ల అణుశక్తి సామర్థ్యం తో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పిసిఐఎల్)  కి చెందిన  21 రియాక్టర్లు మొత్తం 15300 మెగావాట్ల సామర్థ్యంతో వివిధ దశల్లో అమలులో  ఉన్నాయి.భారతీయ నభికియ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (భావిని) కి చెందిన తొమ్మిది (09) రియాక్టర్లు ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తో సహా మొత్తం 7300 ఎం డబ్ల్యూ సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్నాయి, 8000 ఎం డబ్ల్యూ సామర్థ్యంతో పన్నెండు (12) రియాక్టర్లు [5000 ఎం డబ్ల్యూ 2 ఎం డబ్ల్యూ ట్విన్ యూనిట్ ఆఫ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ( ఎఫ్ బి ఆర్ ) భవిని]  ప్రాజెక్ట్ ముందస్తు కార్యకలాపాలలో ఉన్నాయని డాక్టర్. సింగ్  వ్రాతపూర్వకంగా ఇచ్చిన  సమాధానంలో పేర్కొన్నారు.

***



(Release ID: 2037226) Visitor Counter : 10


Read this release in: English , Hindi , Marathi