విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి - ఉద్గారాలు
Posted On:
25 JUL 2024 4:59PM by PIB Hyderabad
గత ఐదేళ్లలో దేశంలో బొగ్గు ఆధారంగా చేసిన విద్యుత్ ఉత్పత్తి, ఉద్గారాలకు సంబంధించిన సమాచారం:
సంవత్సరం
|
బొగ్గు ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ (బిలియన్లలో)
|
CO2 ఉద్గారాలు (మిలియన్ మెట్రిక్ టన్నులలో)
|
2018-19
|
987.68
|
897.28
|
2019-20
|
988.72
|
897.28
|
2020-21
|
959.72
|
867.92
|
2021-22
|
951.88
|
853.82
|
2022-23
|
1043.83
|
943.04
|
వేగవంతమైన విస్తరణ, వృద్ధితో దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థకు, విద్యుత్ డిమాండ్ లో కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో దేశంలో విద్యుత్ డిమాండ్ సుమారు 9% వృద్ధిని సాధించింది. విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలకు అనుగుణంగా మొత్తం ఉద్గారాలు పెరిగాయి.
అయితే, గ్రిడ్ లో పునరుత్పాదక శక్తి వాటా పెరగడం వల్ల, గ్రిడ్ యొక్క కర్బన తీవ్రత తగ్గుతోంది. 2013-14 నుండి 2022-23 వరకు భారతదేశంలో గ్రిడ్ విద్యుత్ యొక్క సగటు కర్బన ఉద్గార కారకంలో సుమారు 9 శాతం తగ్గుదల నమోదైంది.
థర్మల్ పవర్ ప్లాంట్ల (టిపిపి) ఉద్గారాల స్థాయి తగ్గించడానికి, ప్రభుత్వం క్రింది చర్యలు తీసుకుంది:
- సమర్థవంతమైన అల్ట్రా సూపర్ క్రిటికల్/సూపర్ క్రిటికల్ యూనిట్ల ఏర్పాటు - ప్రభుత్వం సబ్ క్రిటికల్ థర్మల్ యూనిట్లపై సమర్థవంతమైన అల్ట్రా సూపర్ క్రిటికల్/సూపర్ క్రిటికల్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఎందుకంటే ఈ యూనిట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేస్తాయి. విద్యుత్ ఉత్పత్తి యొక్క యూనిట్ కు విడుదల అయ్యే ఉద్గారాలు సబ్ క్రిటికల్ యూనిట్ల కన్నా తక్కువగా ఉంటాయి. 30.06.2024 వరకు వరుసగా 65,290 మెగావాట్ల (94 యూనిట్లు), 4,240 మెగావాట్ల (06 యూనిట్లు) సూపర్ క్రిటికల్/ అల్ట్రా సూపర్ క్రిటికల్ యూనిట్లను ప్రారంభించారు.
- బయోమాస్ కో-ఫైరింగ్ - బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో కో-ఫైరింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం బయోమాస్ వినియోగంపై విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని జారీ చేసింది. సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేసిన తర్వాత బయోమాస్ ను ప్రధానంగా బొగ్గుతో 5-7% కో-ఫైరింగ్ చేయాలని ఈ విధానం నిర్దేశిస్తుంది. జూన్ 2024 నాటికి, దేశవ్యాప్తంగా 8.14 లక్షల టన్నుల సంచిత బయోమాస్ కో-ఫైరింగ్ చేయడం జరిగింది. దీని ఫలితంగా థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి 0.97 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు తగ్గాయి.
- స్టాక్ ఉద్గారాల తగ్గింపు - కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ 07.12.2015 తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్, దాని తదుపరి సవరణలు ద్వారా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి స్టాక్ ఉద్గారాలైన..., సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ (ఎస్పీఎం), ఎస్ఓఎక్స్, ఎన్ఓఎక్స్ వంటి వాటికి తగ్గించడానికి సంబంధించిన నిబంధనలను పేర్కొన్నారు. ఈ ప్రమాణాలను చేరుకోవడానికి, థర్మల్ పవర్ ప్లాంట్లు ఎలక్ట్రో స్టాటిక్ ప్రిసిపిటేటర్ (ఈఎస్పీ), ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ (ఎఫ్డీజీ), ఎన్ఓఎక్స్ కంబషన్ మోడిఫికేషన్ మొదలైన పద్ధతులను ఉపయోగిస్తున్నాయి.
- 267 యూనిట్లతో కూడిన 18,802.24 మెగావాట్ల తక్కువ సామర్థ్యం కలిగిన, పాత థర్మల్ విద్యుత్ ప్లాంట్లు 30.06.2024 నాటికే మూతపడ్డాయి.
- ఎన్టీపీసీ లిమిటెడ్ వింధ్యాచల్ థర్మల్ పవర్ స్టేషన్ లో రోజుకు 20 టన్నుల (టిపిడి) సామర్థ్యం గల పైలట్ కార్బన్ క్యాప్చర్ ప్రాజెక్టును ప్రారంభించింది.
2030 నాటికి శిలాజేతర ఇంధన ఆధారిత ఇంధన వనరుల నుంచి 50 శాతం విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని సాధించడానికి భారత్ 'ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్‌మైన్డ్ కాంట్రిబ్యూషన్స్(ఐఎన్డిసి)'కు కట్టుబడి ఉంది. ప్రస్తుతం భారతదేశం శిలాజేతర ఇంధన ఆధారిత వనరుల నుండి 45.5% స్థాపిత సామర్థ్యాన్ని సాధించింది.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
***
(Release ID: 2037219)
Visitor Counter : 113