గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విద్యపై పీఎం - జన్ మన్ పథకం ప్రభావం

Posted On: 25 JUL 2024 3:05PM by PIB Hyderabad

ఎన్ఐఈఎస్బియుడి, ఐఐఈ ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ (ఎంఎస్డిఈ) పీవీటీజీ ల లబ్ధిదారులకు విడివికేల ఏర్పాటు కోసం  ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నైపుణ్య శిక్షణను అందించింది. వీటితో పాటు తగు మార్గదర్శకం, చేయూత ను అందించింది. స్థిరమైన జీవనోపాధి, మార్కెట్ అభివృద్ధి, ఉత్పత్తులకు సరసమైన ధర, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ (ఎంఈపి) విలువ జోడింపు, పీవీటీజీ ల సామర్థ్యం పెంపుపై దృష్టి కేంద్రీకరించింది. ఎంఎఫ్పి, ఇతర ఉత్పత్తులకు విలువ జోడింపును పెంపొందించడం ద్వారా  పీవీటీజీ వన్ ధన్ వికాస్ కేంద్రాలను (విడివికే) స్థాపించడం అంతిమ లక్ష్యం. ఎంఎస్డిఈ ప్రకారం, 2024-25కి పీఎం-జన్ మన్ కింద లబ్ధిదారుల వివరాలు సంవత్సర వారీగా ఇలా ఉన్నాయి:

 

క్రమ సంఖ్య

రాష్ట్రం 

శిక్షణ పొందిన లబ్ధిదారుల 

1.

ఆంధ్ర ప్రదేశ్

5312

2.

ఛత్తీస్గఢ్ 

1362

3.

గుజరాత్ 

835

4.

ఝార్ఖండ్ 

1561

5.

కర్ణాటక 

551

6.

కేరళ 

119

7.

మధ్యప్రదేశ్ 

5075

8.

మహారాష్ట్ర 

3553

9.

ఒడిశా 

1009

10.

రాజస్థాన్ 

2271

11.

తమిళనాడు 

611

12.

తెలంగాణ 

49

13.

ఉత్తర ప్రదేశ్ 

299

14.

ఉత్తరాఖండ్ 

263

15.

త్రిపుర 

2551

మొత్తం 

25421

 

ఇంకా, పీఎం-జన్ మన్ కి సంబంధించి సమగ్ర శిక్ష కింద, విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం పీవీటీజీ విద్యార్థుల విద్య లక్ష్యంగా 100 హాస్టళ్లను మంజూరు చేసింది.

కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ యూకే ఈరోజు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

 

***


(Release ID: 2037068) Visitor Counter : 66