కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సి - డాట్, ఐ ఐ టి రూర్కీ, ఐ ఐ టి మండి ల మధ్య 6 జి ఎక్సస్ పాయింట్స్ అభివృద్ధికి ఒప్పందం కుదిరింది.
ఇది కనెక్టివిటీ, సిగ్నల్ స్ట్రెంగ్త్, డేటా వేగాలను మెరుగుపరచడం, 6 జి ప్రమాణీకరణ, పేటెంట్లు, వాణిజ్యీకరణకు దోహదం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్ట్ ‘భారత్ 6జి విజన్’ కు అనుగుణంగా 6జి సాంకేతికత లో ఆవిష్కరణ, అనుసంధానం, డిజిటల్ సమ్మిళతను ప్రోత్సహించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది.
Posted On:
24 JUL 2024 12:45PM by PIB Hyderabad
స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా ఒక ముఖ్యమైన దశలో భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ శాఖకు చెందిన దేశం లో అగ్రగామి టెలికమ్యూనికేషన్స్ ఆర్ & డి సెంటర్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అఫ్ టెలిమాటిక్స్ (సి - డాట్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ (ఐ ఐ టి రూర్కీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మండి (ఐ ఐ టి మండి) లతో "సెల్ -ఫ్రీ " 6జి అకెస్ పాయింట్స్ అభివృద్ధి కోసం ఒప్పందం కుదిరింది. ఈ రెండు ఐ ఐ టిలు ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి సహకారం అందిస్తున్నాయి.
ఈ ఒప్పందం భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ శాఖ కు చెందిన టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీ అభివృద్ధి నిధి (టి టి డి ఎఫ్) పథకం కింద సంతకాలు చేశారు. ఈ పథకం టెలికమ్యూనికేషన్స్ ఉత్పత్తులు, సాధనాల డిజైన్, అభివృద్ధి, వాణిజ్యీకరణలో లోని స్థానిక కంపెనీలు, భారతీయ స్టార్టప్‌లు, విశ్వవిద్యాలయాలు, ఆర్ & డి సంస్థలకు నిధులను అందించడానికి రూపొందించబడింది. ఈ పథకం బ్రాడ్బ్యాండ్, మొబైల్ సేవలను అందుబాటులో ధరలలో అందించడానికి, భారతదేశంలోని డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
సంప్రదాయ 4 జి /5 జి లాంటి మొబైల్ నెట్‌వర్క్స్ తమ వినియోగదారులకు ఒక సింగిల్ బేస్ స్టేషన్ ప్రతి సెల్ కు సేవలందించే సెల్ టాపాలజీలను ఉపయోగిస్తాయి. "సెల్
-ఫ్రీ" మాసివ్ మిమో (మెమో) (మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ ఔట్పుట్ ) అనేది సెల్స్ సెల్ బౌండరీలను తొలగించడం ద్వారా అనేక అకెస్ పాయింట్స్ ( ఏ పిలు) తో విశాలమైన ప్రాంతంలో విస్తరించి, ఒకే సమయంలో పలువురు వినియోగదారులకు సేవలందించడానికి ఉపయోగపడతాయి. ప్రతి వినియోగదారుకు వారి కవరేజ్ ప్రాంతంలో అనేక ఏ పిలు అంకితం గా పనిచేస్తాయి. అంటే ఒక వినియోగదారునికి అనేక ఏ పిలు మద్దతు ఇవ్వవచ్చు. ఇది వినియోగదారులకు అన్నిచోట్ల కనెక్షన్, డెడ్ జోన్స్‌ను తొలగించడం, సిగ్నల్ స్ట్రెంగ్త్‌ను మెరుగుపరచడం, అధిక సిగ్నల్ స్పీడ్స్‌ను అందించడం ద్వారా అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో కూడా అత్యుత్తమ వినియోగదారు అనుభవం అందిస్తుంది.
ఈ 6జి ప్రాజెక్ట్ 6జి రేడియో ఎక్సెస్ నెట్‌వర్క్స్ కోసం ఏ పిలు అభివృద్ధి చేయడానికి దృష్టి పెట్టింది. 6జి ప్రమాణీకరణ కార్యకలాపాలకు దోహదం చేయడానికి, వాణిజ్యీకరణను ప్రేరేపించచడానికి, మేధో హక్కులు సృష్టించడానికి, అభివృద్ధి చెందుతున్న 6జి ఆవరణానికి మద్దుతు ఇవ్వడానికి, నైపుణ్యమైన మానవ శక్తిని అభివృద్ధి చేయడానికి కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
సి - డాట్, ఐ ఐ టి రూర్కీ, ఐ ఐ టి మండి మధ్య ఒప్పందం సంతకం.
ఈ సమావేశం లో సి - డాట్ సిఇఒ - డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్, ప్రధాన పరిశోధకుడు - డాక్టర్ అభయ్ కుమార్ సాహ్ ఐ ఐ టి రూర్కీ నుండి, సహ-పరిశోధకుడు - డాక్టర్ అదర్శ్ పటేల్ ఐ ఐ టి మండి నుండి, సి - డాట్ డైరెక్టర్, డాక్టర్ పంకజ్ కుమార్ డాలేలా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, డాక్టర్ సాహ్, డాక్టర్ పటేల్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన భారత్ 6జి విజన్‌కు అనుగుణంగా తరువాతి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి తమ నిబద్ధతను ప్రకటించారు. ఈ పరిశోధనలోభాగం పంచుకునే అవకాశం వచ్చినందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ, సి - డాట్ తమ కృతజ్ఞతలు తెలిపారు. ఇది టెలికమ్యూనికేషన్స్ రంగంలో పరిశోధన సామర్థ్యాలు, మౌలిక సదుపాయాలను పెంచడానికి సహాయపడుతుందని నొక్కి చెప్పారు.
సి - డాట్ సిఇఒ, డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్, మన దేశం యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా స్వదేశీయంగా రూపొందించబడిన, అభివృద్ధి చేయబడిన సాంకేతికతల కీలక పాత్రను నొక్కి చెప్పారు, "ఆత్మనిర్భర్ భారత్" పట్ల నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇది 6జి రంగంలో మేధో హక్కులను సృష్టించడంలో మనకు సహాయపడుతుందని ఆయన చెప్పారు.
భారతదేశ 6జి విజన్ కు ఆకృతిని ఇవ్వడానికి, అభివృద్ధి చేయడానికి జరిగే ఈ సహకార ప్రయత్నానికి తమ ఉత్సాహం,నిబద్ధతను సి - డాట్,ఐ ఐ టి రూర్కీ, ఐ ఐ టి మండి ప్రతినిధులు వ్యక్తం చేశారు.
***
(Release ID: 2036726)
Visitor Counter : 73