బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు సాంకేతికత లో పరిశోధన అభివృద్ధి
నాడు పోస్టు చేయడమైనది:
24 JUL 2024 4:42PM by PIB Hyderabad
ప్రభుత్వం దీర్ఘకాలిక సుస్థిర వృద్ధి కోసం బొగ్గు సాంకేతికత లో పరిశోధన అభివృద్ధి (ఆర్ & డి) కి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇది అమలులో ఉన్న వినియోగాలలో మెరుగుదలకు అలాగే భవిష్యత్తు రంగాలలో వివిధీకరణకు దోహదపడుతుంది. కేంద్ర పధకం క్రింద 2023-24 లో రూ. 18.00 కోట్లు కేటాయించారు. అలాగే 2024-25 లో ఈ పధకం క్రింద రూ. 21.00 కోట్లు కేటాయించారు. ఈ పధకం తో పాటు, సి ఐ ఎల్, బొగ్గు రంగంలోని ఇతర సి ఫై ఎస్ ఈలు ఆర్ & డి కార్యకలాపాల కోసం గణనీయమైన ఖర్చులు చేస్తున్నాయి.
ప్రభుత్వం ఈ సందర్భంలో తీసుకున్న చర్యలు:
సి ఎం పి డి ఐ, రాంచిలో "నేషనల్ సెంటర్ ఫర్ కోల్ అండ్ ఎనర్జీ సెక్టార్" (ఎం ఏ సి సి ఆర్ ) స్థాపించాలని ప్రణాళిక చేసింది.
ఆర్ & డి కార్యకలాపాల కోసం గుర్తించబడిన ప్రాధాన్యత కలిగిన రంగాలు:
ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రత, అన్వేషణ.
పర్యావరణం, జీవావరణం, పర్యావరణ సంరక్షణ, సుస్థిరత.
బొగ్గు వెలికితీత వ్యర్ధాలనుంచి సంపద.
పరిశుభ్రమైన బొగ్గు సాంకేతికతలు, బొగ్గు శుద్ధీకరణ.
బొగ్గు ప్రత్యామ్నాయ వినియోగం.
పునరుత్పాదక శక్తి.
ఏ ఐ / ఎం ఎల్ / ఐ ఓ టి ఆధారిత స్మార్ట్ మైనింగ్.
నూతన సాంకేతికత ఆవిష్కరణలు దేశీయీకరణ
"హాకథాన్ ఆన్ కోల్ గ్యాసిఫికేషన్" 2024-25 లో నిర్వహించారు. ఈ ముఖ్యమైన సహజ వనరును ఉపయోగించడం ద్వారా, దేశ విద్యుత్ శక్తి, రసాయన అవసరాలను తీర్చడానికి, ఆర్థిక స్వతంత్రత, పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
"హాకథాన్స్ ఆన్ ఆర్ & డి" నిర్వహించడం ద్వారా, బొగ్గు రంగంలో "మేక్ ఇన్ ఇండియా" ప్రయత్నాలను ప్రోత్సహించడం, విస్తృత ప్రచారం చేయడం, బొగ్గు, లిగ్నైట్ రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, శ్రీ. జి. కిషన్ రెడ్డి లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2036717)
సందర్శకుల సూచీ సంఖ్య : : 69