రక్షణ మంత్రిత్వ శాఖ
గుజరాత్ తీరంలో మోటారు ట్యాంకర్ జీల్ నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన భారతీయుడిని తరలించిన ఐసీజీ
प्रविष्टि तिथि:
21 JUL 2024 4:07PM by PIB Hyderabad
భారత తీర రక్షక దళం (ఐసీజీ) 2024 జూలై 21న, గుజరాత్ లోని మంగ్రోల్ తీరానికి సుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న గాబన్ మోటార్ ట్యాంకర్ జీల్ నుంచి తీవ్ర అస్వస్థతకు గురైన భారతీయుడిని తరలించింది. తక్కువ నాడీస్పందన, శరీరం తిమ్మిరెక్కడం వంటి లక్షణాలను ఎదుర్కొంటున్న ఆ వ్యక్తిని తక్షణ వైద్యం కోసం తరలించారు.
అతితీవ్ర గాలులు, భారీ వర్షం, ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ పోరుబందర్ లోని ఐసీజీ ఎయిర్ ఎన్ క్లేవ్ వెంటనే ఒక అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ను మోటార్ ట్యాంకర్ జీల్ వద్దకు పంపింది. మోటార్ ట్యాంకర్ కు సరిగ్గా పైభాగంలోకి వచ్చిన హెలికాఫ్టర్ నుంచి ఓ రెస్క్యూ బాస్కెట్ ను పంపించి అస్వస్థతకు గురైన వ్యక్తిని తరలించారు. మెరుగైన వైద్యం కోసం అతడిని పోరుబందర్ కు తరలించారు.
సముద్ర భద్రతపై ఐసీజీకి గల అచంచల నిబద్ధత, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అత్యవసరమైతే స్పందించేందుకు దాని సంసిద్ధతను ఈ విజయవంతమైన తరలింపు స్పష్టం చేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2035069)
आगंतुक पटल : 98