ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

265వ రాజ్యసభ సమావేశాల్లో చైర్మన్ ప్రారంభోపన్యాస పాఠం

Posted On: 22 JUL 2024 12:22PM by PIB Hyderabad

ఆరు దశాబ్దాల తర్వాత వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న, కొత్తగా ఎన్నికైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ నేపథ్యంలో ఈ 265వ రాజ్యసభ సమావేశాలు ముఖ్య ఘట్టంగా నిలవబోతున్నాయి.

గౌరవనీయ సభ్యులారా, పక్షపాత ప్రయోజనాలకు అతీతంగా దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో శాంతియుత చర్చలతో రాజకీయ పంథా ప్రామాణికతకు నిదర్శనంగా నిలవడం ద్వారా ఈ ఆగష్టు సభ ఆశించిన స్థాయిలో దేశానికి నేతృత్వం మహిస్తుందన్న విశ్వాసం నాకుంది.

మన రాజకీయాల్లో వేడిని తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందన్నది కాదనలేని అంశం. ఈ సభ పార్లమెంటరీ సంప్రదాయాల అత్యున్నత ప్రమాణాలు, ఔచిత్యం, ప్రొటోకాల్ ను ప్రతిబింబించాలి. అతిపెద్ద మన ప్రజాస్వామ్యంలో, బయట కూడా చట్టసభలకు అది ప్రేరణగా ఉంటుంది. ప్రపంచం మనవైపు చూస్తోంది. ఆ అంచనాలను అందుకుందాం.

గౌరనీయ సభ్యులారా, జాతి ప్రయోజనాల కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సభా వ్యవహారాలు ఉన్నతమైన, నిశ్చితమైన చర్చలతో సాగుతాయని నేను ఆశిస్తున్నాను.


బలమైన పార్లమెంటరీ చర్చలకు సానుకూలమైన వాతావరణాన్ని పెంపొందిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలిచేలా ‘సంభాషణ, చర్చ, ఆలోచన, వాదన’ సూత్రాలను నిలబెట్టుకుందాం.

గౌరవనీయ సభ్యులారా, మరో ముఖ్యమైన, సంబంధిత అంశాన్ని మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను – చైర్మన్ కు సభ్యుల సూచనలు చాలా సార్లు; ఒక్కోసారి చైర్మన్ కన్నా ముందే ప్రజల్లోకి వెళ్తాయి. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి అనుచిత పద్ధతులు అవలంభించకపోవడం మంచిది.

గౌరవనీయ సభ్యులారా, భారత్ కు అతీతంగా మనం సాధించగలిగేది ఏదీ లేదు. పక్షపాత ప్రయోజనాలను పక్కనపెట్టి, జాతి ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యమివ్వడానికి కట్టుబడి ఉందాం. అందుకోసం ఈ ప్రజాస్వామ్య దేవాలయానికి మించిన ప్రదేశం ఏదీ లేదు. ప్రజాసంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేయడానికి అందరం కట్టుబడి ఉందాం.

***



(Release ID: 2035031) Visitor Counter : 24