ప్రధాన మంత్రి కార్యాలయం

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడాని కన్నా ముందు ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి


‘‘మూడో సారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సమర్పిస్తున్న బడ్జెటును దేశ ప్రజలు ఒక గౌరవభరిత ఘట్టంగా చూస్తున్నారు’’

‘‘ఈ బడ్జెటు ప్రస్తుత ప్రభుత్వ రాబోయే అయిదు సంవత్సరాలకు దిశను నిర్దేశించడంతో పాటు 2047 నాటికి వికసిత్ భారత్ కలను నెరవేర్చడానికి ఒక బలమైన పునాదిని కూడా వేయనుంది’’

‘‘పార్టీ రాజకీయాల కన్నా మిన్నగా ఎదిగి గౌరవప్రదమైన పార్లమెంటు వేదికను ఉపయోగించుకొంటూ దేశానికి నిబద్ధులుగా వ్యవహరించాలి’’

‘‘దేశం, దేశం లో పేదలు, రైతులు, మహిళలు, ఇంకా యువజనులు.. ఇదొక్కటే 2029 వరకు ప్రాధాన్యాంశంగా ఉండాలి’’

‘‘ఎన్నికైన ప్రభుత్వం నోరు ను, ఆ ప్రభుత్వ ప్రధాన మంత్రి నోరు ను నొక్కేసే యత్నాలకు ప్రజాస్వామిక సంప్రదాయాలలో చోటు లేనే లేదు’’

‘‘సభ్యులుగా తొలిసారిగా ఎన్నికైనవారు ముందంజ వేసి, వారి అభిప్రాయాలను తెలియజేసేందుకు అవకాశం లభించాలి’’

‘‘ఈ సభ రాజకీయ పక్షాల కోసం ఉద్దేశించింది కాదు, ఈ సభ దేశానికి ఉద్దేశించింది. ఇది పార్లమెంటు సభ్యులకు సేవ చేయడానికి కాదు, భారతదేశంలో 140 కోట్ల మంది పౌరుల కోసం ఉంది’’

Posted On: 22 JUL 2024 11:53AM by PIB Hyderabad

బడ్జెటు సమావేశాలు ఆరంభం కావడానికి కన్నా ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసార మాధ్యమాలకు ఒక ప్రకటనను చేశారు.

ఈ సందర్బంగా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, అరవై సంవత్సరాల తరువాత ఒక ప్రభుత్వం వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చిందన్న వాస్తవాన్ని గమనిస్తే గర్వంగా ఉందని పునరుద్ఘాటించారు.  మూడో సారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బడ్జెటును సమర్పించడాన్ని దేశ ప్రజలు ఒక గొప్ప సన్నివేశంగా చూస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు.  అమృత కాలంలో ఈ బడ్జెట్ ఒక మైలురాయి వంటి బడ్జెటు అని ప్రధాన మంత్రి అన్నారు.    కొంత కాలంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని ఆయన అన్నారు.  ‘‘ఈ బడ్జెటు ప్రస్తుత ప్రభుత్వానికి రాబోయే అయిదేళ్ళలో దిశానిర్దేశం చేస్తుందిఇది 2047 కల్లా వికసిత్ భారత్ కలను పండించుకోవడానికి ఒక బలమైన పునాదిని వేస్తుంది’’ అని ఆయన అన్నారు.

భారతదేశం గత మూడు వరుస సంవత్సరాలలో సుమారు శాతం వృద్ధిని సాధిస్తూ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా నిలచిందని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రకటించారు.  ప్రస్తుతం సానుకూల దృక్పథంపెట్టుబడిపనితీరుల వల్ల అవకాశాలు శిఖర స్థాయిలో ఉన్నాయని ఆయన అన్నారు.

రాజకీయ పక్షాలన్నిటి మధ్య సమరాలు పూర్తి అయిన తరువాత, పౌరులు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి లోక్ సభ ఎన్నికలు ముగియడంతోనే ఇక పార్లమెంటు సభ్యులంతా కలసికట్టుగా రాబోయే అయిదు సంవత్సరాలలో దేశం కోసం పోరాడాలని ప్రధాన మంత్రి కోరారు.  రాజకీయ పక్షాలు వాటి రాజకీయాల కన్నా మిన్నగా ఎదగాలనిగౌరవనీయమైన పార్లమెంటు వేదికను ఉపయోగించుకొంటూ రాబోయే నాలుగున్నర ఏళ్ళ లో దేశ ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  ‘‘జనవరి 2029 లో ఎన్నికల సమరాంగణానికి వెళ్ళండిఅప్పటివరకు దేశందేశంలో పేదలురైతులుమహిళలుఇంకా యువజనులు.. వీరికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాల’’ని ఆయన ఉద్భోదించారు.  వికసిత్ భారత్ ను 2047 నాటికి ఆవిష్కరించాలన్న కలలనుసంకల్పాలను నెరవేర్చుకోవడానికి సర్వశక్తులొడ్డి కృషి చేయడం జరుగుతుందని కూడా ఆయన అన్నారు.

కొన్ని రాజకీయ పక్షాల నకారాత్మక దృక్పథం కారణంగా పార్లమెంటు సభ్యులలో అనేక మందికి వారి అభిప్రాయాలనువారి నియోజక వర్గాలకు సంబంధించిన అంశాలను సభలో వెల్లడించేందుకు ఎలాంటి అవకాశం దొరకకపోవడం శోచనీయమని ప్రధాన మంత్రి అన్నారు.  సభ్యులందరికీప్రత్యేకించి మొట్టమొదటి సారిగా సభ్యులుగా వచ్చిన వారికి వారి వారి ఆలోచనలను తెలియజేసే అవకాశాలను ఇవ్వండంటూ అన్ని రాజకీయ పక్షాలకు ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  ఎన్నికైన ప్రభుత్వంతో పాటు పార్లమెంటులో ప్రధాన మంత్రి చేసే ప్రసంగానికి అడ్డు పడేందుకు జరుగుతున్న ప్రయత్నాలను గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు గుర్తు చేశారు.  ‘‘ప్రజాస్వామిక సంప్రదాయాలలో ఈ ధోరణికి తావు లేద’’ని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు.

దేశానికి సేవ చేయడం కోసం ప్రజలు వారి తీర్పును ఇచ్చారే గాని రాజకీయ పక్షాల కార్యాచరణ కోసం కాదు అని పార్లమెంటు సభ్యులకు ప్రధాన మంత్రి గుర్తు చేశారు.  ‘‘ఈ సభ రాజకీయ పక్షాల కోసం ఉద్దేశించింది కాదుఈ సభ దేశం కోసం ఏర్పాటైంది.  ఇది పార్లమెంటు సభ్యులకు సేవ చేయడం కోసం ఉద్దేశించింది కాదుఈ సభ భారతదేశంలో 140 కోట్ల మంది పౌరులకు సేవ చేయడానికి ఏర్పడింది’’ అని ఆయన నొక్కి చెప్పారు.  పార్లమెంటు సభ్యులు అందరూ ఫలప్రదమైన చర్చలకు వారి వంతుగా తోడ్పడుతారన్న నమ్మకాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేస్తూతన ప్రసంగాన్ని ముగించారు.  దేశానికి దానిని ముందుకు తీసుకుపోయేటటువంటి సకారాత్మకమైన ఆలోచనలు కావాలి అని ప్రధాన మంత్రి అన్నారు.  ‘‘భిన్నమైన వైఖరితో కూడిన ఆలోచనలు చెడ్డవి కాదుకానీ ప్రతికూలమైన ఆలోచనలు అభివృద్ధికి అడ్డు నిలుస్తాయి’’ అని ఆయన అన్నారు.  సామాన్య పౌరుల స్వప్నాలనుమహత్వాకాంక్షలను పండించడానికి ఈ ప్రజాస్వామ్య దేవాలయాన్ని వినియోగించుకొంటారన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేస్తూతన ప్రసంగాన్ని ముగించారు.

 

 

 

***

DS/TS



(Release ID: 2034959) Visitor Counter : 23