సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్‌లో వాయిస్-ఓవర్ కళాకారుల నైపుణ్యాభివృద్ధి కోసం "ది వాయిస్ బాక్స్" కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఎన్ఎఫ్‌డీసీ- నెట్‌ఫ్లిక్స్

Posted On: 18 JUL 2024 6:38PM by PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్‌డీసీ)- నెట్‌ఫ్లిక్స్ ఇండియా సంయుక్తంగా దేశంలోని వాయిస్-ఓవర్ కళాకారుల కోసం "ది వాయిస్ బాక్స్" అనే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది.

 

 

 

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు, సంయుక్త కార్యదర్శి (చిత్రాలు) శ్రీమతి బృందా దేశాయ్, నెట్‌ఫ్లిక్స్ లీగల్ డైరెక్టర్ శ్రీ ఆదిత్య కుట్టి, నెట్‌ఫ్లిక్స్ కాంపిటీషన్ పాలసీ అధికారి ఫ్రెడ్డీ సోమ్స్, పెరల్ అకాడమీ చైర్మన్ శరద్ మెహ్రా తదితరులు పాల్గొన్నారు.

 

 

 

నేడు దిల్లీలోని శాస్తి భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) ఎండీ, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (బ్రాడ్‌కాస్టింగ్ 2) ప్రీతుల్ కుమార్, నెట్‌ఫ్లిక్స్ ఇండియాకు చెందిన జనరల్ కౌన్సిల్, బిజినెస్, లీగల్ అఫైర్స్ సీనియర్ డైరెక్టర్ శ్రీ కిరణ్ దేశాయ్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది భారతీయ సినిమాను ప్రోత్సహించడానికి అదేవిధంగా మీడియా, వినోద పరిశ్రమలో ప్రతిభను పెంపొందించడానికి ఎన్ఎఫ్‌డీసీ- నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి.

 

 

 

ఈ వాయిస్ బాక్స్ కార్యక్రమం వాయిస్ ఓవర్ కళాకారులకు ఆర్‌పీఎల్ (రికగ్నిషన్ ఆఫ్ ప్రయర్ లెర్నింగ్) శిక్షణను అందించనున్నారు. ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, గుజరాతీ భాషలలో శిక్షణ ఉంటుంది. ఈ వర్క్‌షాప్‌లో శిక్షణ (అతిథి ఉపన్యాసాలు, మార్గదర్శక సెషన్లు), మూల్యాంకనం ఉండనున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాలు- న్యూఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై కొచ్చిలలో శిక్షణ ఉంటుంది. ప్రాథమిక స్క్రీనింగ్‌లో 210 మందిని ఎంపిక చేసి, ఒక్కో బ్యాచ్‌లో 30 మందికి శిక్షణ ఇస్తారు. ఇందులో పాల్గొనే వారిలో కనీసం 50 శాతం మంది మహిళలను ఎంపిక చేయనున్నారు.

 

 

 

భారతదేశంలోని ప్రముఖ డిజైన్ సంస్థ పర్ల్ అకాడమీ ఈ కార్యక్రమానికి శిక్షణ భాగస్వామిగా ఉంటుంది. ప్రతి బ్యాచ్ నుండి ఏడుగురు అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన వారిని ఎంపిక చేసి నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక ప్రాజెక్ట్ అయిన "ఆజాదీ కి అమృత్ కహానియా" లో పాలుపంచుకునేందుకు ఎంపిక చేస్తారు. వారు భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రతిబింబించే కథలను వివరించడానికి తమ స్వరాలను అందిస్తారు.

 

 

 

మీడియా, వినోద రంగాల్లో రెండేళ్లకు పైగా అనుభవం ఉన్న వృత్తినిపుణులను, ముఖ్యంగా మహిళలు వాయిస్ ఓవర్ లో తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఆసక్తి కనబరిచేవారికి ఈ కార్యక్రమం ఉపయుక్తంగా ఉంటుంది.

 

 

 

ఈ 'వాయిస్ బాక్స్' నెట్‌ఫ్లిక్స్ ఫండ్ ఫర్ క్రియేటివ్ ఈక్విటీ ప్రాయోజిత కార్యక్రమం. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల ద్వారా తక్కువ ప్రాతినిధ్యం కలిగిన వారిని టీవీ, చలనచిత్ర రంగాల్లో విజయం సాధించేందుకు ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేశారు. దీనికోసం ఐదేళ్లలో ప్రతి ఏడాది వంద మిలియన్ డాలర్లను కేటాయించింది.

 

 

 

దరఖాస్తు చేసేందుకు, మరింత సమాచారం కోసం ఎన్ఎఫ్‌డీసీ వెబ్‌సైట్ సందర్శించండి. ఎన్ఎఫ్‌డీసీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ని సందర్శించండి.

 

 

 

***


(Release ID: 2034195) Visitor Counter : 122