రక్షణ మంత్రిత్వ శాఖ
పదకొండు మంది నావికులతో కేరళ తీరం ఆవల చిక్కుకున్న భారతీయ నౌకను రక్షించిన భారతీయ తీర రక్షక దళం
Posted On:
17 JUL 2024 8:26PM by PIB Hyderabad
భారీ వర్షం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య కేరళ కొచ్చి తీరానికి 80 నాటికల్ మైళ్ళ దూరంలో, సముద్రంలో చిక్కుకున్న 11 సభ్యుల భారతీయ నౌక – ఐ ఎఫ్ బీ ‘ఆష్నీ’ ని వాయు-నౌకా మార్గాల ద్వారా చేపట్టిన సమన్వయ రక్షణ ఆపరేషన్లో భారతీయ తీర రక్షక దళం (ఐసీజీ) రక్షించింది. నౌకలోని కీలక భాగంలో ఏర్పడ్డ పగులు వల్ల మునక ప్రమాదంలో పడి, నౌక ముందుకు కదలలేని పరిస్థితి వల్ల సిబ్బందికి ముప్పు ఏర్పడింది.
తీరప్రాంత పహరాలో నిమగ్నమైన ఐసీజీ డోర్నియర్ విమానం 2024, జులై 16 రాత్రి ప్రమాదంలో చిక్కుకున్న ఐ ఎఫ్ బీ ఆచూకీ కనుగొంది. వెంటనే గస్తీ లో ఉన్న ఐసీజీ పడవ ‘సక్షం’ ను ఐసీజీ జిల్లా కేంద్రం నంబర్ 4 (కేరళలోని మాహే) నుండి సహాయక చర్య నిమిత్తం మళ్లించడమే కాక , అదనపు సహాయార్ధం మరో ఐసీజీ పడవ ‘అభినవ్’, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ను కూడా రంగంలోకి దింపారు.
***
(Release ID: 2034012)
Visitor Counter : 67