శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు చెందిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) 73వ వ్యవస్థాపక దినోత్సవం

Posted On: 16 JUL 2024 8:36PM by PIB Hyderabad

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) 73వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దిల్లీలోని సీఆర్ఆర్ఐ ప్రాంగంణంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎన్ కలైసెల్వికార్యదర్శిడీఎస్ఐఆర్డైరెక్టర్ జనరల్ సీఎస్ఐఆర్ఇతర ప్రముఖుల హాజరయ్యారు.

 

ఈ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికిసీఎస్ఐఆర్ 26వ డైరెక్టర్ జనరల్, 80 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థకు తొలి మహిళ డీజీ డా. ఎన్ కలైసెల్వి హాజరయ్యారు. ఈ సమావేశంలో భాగంగా 'ఏసీఎస్‌ఐఆర్ పీహెచ్‌డీ స్కాలర్ ల్యాబ్'ను డాక్టర్ కలైసెల్వి ప్రారంభించారు. అనంతరం ఆమె కీలక ఉపన్యాసం చేస్తూతన విలువైన మార్గదర్శకత్వాన్ని సభలో పాల్గొన్నవారితో పంచుకున్నారు. సీఆర్ఆర్ఐ సాంకేతిక ప్రయోజనాలనుస్థానికమానవ వనరులను ఉపయోగించి రాబోయే రెండుమూడేళ్లలో భారత భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని ఆమె తెలిపారు. ఏసీఎ్సఐఆర్ ప్రైవేట్పూర్వ విద్యార్థుల సహకారం అవసరాన్ని డా. కలైసెల్వి సమావేశంలో పేర్కొన్నారు.

 

సీఆర్ఆర్ఐ డైరెక్టర్ప్రొఫెసర్ మనోరంజన్ పరిదా మాట్లాడుతూఎడ్లబండిలో సాంకేతికత నుంచి మొదలు బయో బైండర్ వరకు అనేక అంశాల్లో సీఎస్ఐఆర్ఐ-సీఆర్ఆర్ఐ సంస్థ పాత్రను కొనియాడారు. కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్ఐఆర్‌టీఈవ్యర్థాల నుంచి సంపద సృష్టివివిధ రంగాల్లో ఆటో ఫ్యూయల్ విధానాల వంటి వాటిల్లో సంస్థ పాత్రను ఆమె కొనియాడారు.

 

సిఆర్ఆర్ఐ మొదటి డైరెక్టర్ ఎర్నెస్ట్ జిప్కేస్ ఈ సంస్థ స్థాపనకు దోహదపడిన తీరును డాక్టర్ రవీంద్ర కుమార్ గుర్తు చేశారు. 1943లో నాగ్‌పూర్ లో జరిగిన చీఫ్ ఇంజినీర్ల సదస్సులో సీఆర్‌ఆర్‌ఐ ఏర్పాటు ఆలోచనను తొలిసారిగా చర్చించారు. 1952 జూలై 16లో  సీఎస్ఐఆర్ తొలి డైరెక్టర్ జనరల్ అయిన శ్రీ శాంతి స్వరూప్ భట్నాగర్ మార్గదర్శకత్వంలో 1950 మార్చిలో సీఎస్ఐఆర్ కార్యవర్గ సంఘం ఆమోదించింది.

 

73వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికిరోడ్డురవాణా పరిశోధన రంగంలో రేపటి తరం శాస్త్రవేత్తలను ప్రేరేపించడానికి ఒక వేదికగా నిలిచాయి. ఈ వేడుకల్లో పాల్గొన్నవారందరిలో ఉత్సాహాంఅంకితభావాన్ని గుర్తిస్తూకృతజ్ఞతలతో కార్యక్రమం ముగిసింది. సీఎస్ఐఆర్ జిగ్యాస పథకం కింద 200 మందికి పైగా పాఠశాల విద్యార్థులు సీఆర్ఆర్ఐ ఓపెన్ డే కార్యక్రమానికి హాజరయ్యారు. దిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయ ఉపకులపతిప్రొఫెసర్ ప్రతీక్ శర్మసుస్థిరాభివృద్ధి సవాళ్లకు ఇంజినీరింగ్ సమాధానాలు అనే అంశంపై కీలక ఉపన్యాసం చేశారు. వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా పరిశ్రమలతో పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వివ్డస్ 2024లో విద్యార్థులు తమ పరిశోధనలను పోస్టర్ల రూపంలో ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారు. డాక్టర్ వినోద్ క్రార్ ఈ కార్యక్రమాలను నిర్వహించారు. శాస్త్రీయ పరిశోధనవిద్యలో సమర్థతను ప్రేరేపించడానికి కారకులైన వారి సేవలు చిరస్మరణీయమనిఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సిఎస్ఐఆర్-సిఆర్ఆర్ఐ కృతజ్ఞతలు తెలియజేసింది.

***


(Release ID: 2033924) Visitor Counter : 87