బొగ్గు మంత్రిత్వ శాఖ
మూడు బొగ్గు గనుల కోసం ఒప్పందాలపై బొగ్గు మంత్రిత్వ శాఖ సంతకాలు
Posted On:
15 JUL 2024 3:32PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ ఇవాళ ఏడో విడతలో రెండో ప్రయత్నం లో భాగంగా వేలం వేసిన మూడు బొగ్గు గనుల నుంచి బొగ్గు తవ్వకం, అభివృద్ధి, ఉత్పత్తి సంబంధిత ఒప్పందాలను కుదుర్చుకోవడం లో విజయవంతమైంది. ఈ ఘట్టం వాణిజ్య సరళిలో బొగ్గు గనుల తవ్వకం లో ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడాన్ని సూచిస్తున్నది. మూడు గనులలోను రెండింటిని పాక్షికంగా అన్వేషించడం జరగగా, ఒక గనిని పూర్తి స్థాయిలో అన్వేషించడమైంది.
ఒప్పందాలు కుదిరిన గనులలో మచ్ఛకట బొగ్గుగని (సవరించింది), కుడనాలీ లూబ్రీ బొగ్గు గని, సఖీగోపాల్-బి కాకుర్‌హీ బొగ్గు గని ఉన్నాయి. వేలంలో సఫలం అయిన సంస్థలలో వరుసగా ఎన్ఎల్‌సి ఇండియా లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పరేషన్ లిమిటెడ్, ఇంకా తమిళ నాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉన్నాయి.
ఈ మూడు గనుల నుంచి వాణిజ్య పరమైన వేలంపాట ప్రక్రియలో భాగంగా ఏటా ఆదాయం సుమారు 2,991.20 కోట్ల రూపాయల మేరకు ఉండవచ్చు. ఇది దాదాపుగా 30.00 ఎమ్ టిపిఎ మొత్తం పీక్ రేట్ సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరగడం పైన ఆధారపడి ఉంటుంది. ఈ గనులలో కార్యకలాపాలు మొదలైతే సుమారుగా 40,560 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు అందివస్తాయి. దీనికి అదనంగా, ఈ బొగ్గు గనులలో కార్యకలాపాలను ప్రారంభించడం కోసం ఇంచుమించు 4,500 కోట్ల రూపాయల మొత్తం పెట్టుబడిని కేటాయించనున్నారు.
ఈ కార్యక్రమం బొగ్గు రంగంలో స్వయం సమృద్ధికి, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతూ, దేశ ఇంధన భద్రతకు పూచీపడే దిశలో ఒక ముఖ్యమైన ముందంజ గా ఉంటుందని చెప్పాలి.
***
(Release ID: 2033538)