మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

తమిళనాడులోని మధురైలో మత్స్య రంగ వేసవి సమ్మేళనం –2024ను నిర్వహించిన మత్స్య శాఖ


కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్చే కెసిసి సర్టిఫికేట్లు, లబ్ధిదారులకు పిఎంఎంఎస్వై అచీవ్మెంట్ అవార్డు లేఖల పంపిణీ. ఒపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్లో చేరిన ఎఫ్.ఎఫ్.పి.ఒలకు సన్మానం.

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రూ 114 కోట్ల పెట్టుబడి తో 321 ప్రభావశీల ప్రాజెక్టులకు ఆమోదం.

పిఎంఎంఎస్వై కింద 2,195 ఎఫ్.ఎఫ్.పి.ఒల ఏర్పాటుకు ఆర్ధిక సహాయం అందించనున్న మత్స్య శాఖ. ఒ.ఎన్.డి.సి నెట్వర్క్ లో చేరిన 95 ఎఫ్.ఎఫ్.పి.ఒ లు.

Posted On: 12 JUL 2024 4:18PM by PIB Hyderabad

మత్స్య రంగ పురోగతికి సంబంధించి రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలతో వ్యూహాత్మక చర్చలు జరపడం, మత్స్యరంగ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్రప్రభుత్వం తమిళనాడులోని మధురైలో ఈరోజు ఫిషరీస్ సమ్మర్ మీట్ –2024 ను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్వై) కింద 19 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో, 114 కోట్ల  రూపాయల పెట్టుబడితో  మొత్తం 321 ప్రభావశీల ప్రాజెక్టులను కేంద్ర మత్స్య, పశుగణాభివృద్ధి,పాడిపరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ సింగ్ వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర మత్స్య, పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ శాఖల సహాయమంత్రులు ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ బఘెల్, శ్రీ జార్జి కురియన్ లను ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులు, మత్స్యకార మహిళలతో వర్చువల్ విధానంలో వారు మాట్లాడారు.

కేంద్రమంత్రి, వివిధ ఆక్వాకల్చర్ సాంకేతికతలైన ఆర్.ఎ.ఎస్, బయోఫ్లాక్, అలంకార ప్రాయంగా ఉంచుకునే చేపల పెంపకంలో వాడే సాంకేతికతలు, ముత్యాల సాగు వంటి వాటికి సంబంధించిన ఎగ్జిబిషన్ను ఈ సందర్భంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కెసిసిలను పంపిణీ చేశారు. అలాగే లబ్ధిదారులకు పిఎంఎంఎస్వై కేటాయింపు లేఖలను అందజేశారు. అలాగే ఓపెన్ నెటవర్క్ డిజిటల్ కామర్స్ (ఒఎన్డిసి) ప్లాట్ఫారంలో చేరిన ఎఫ్.ఎఫ్.పి.ఒలను సన్మానించారు. అలాగే ఎగ్జిబిషన్లో తిరుగుతూ ఆయన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలతో ముచ్చటించారు.

 భారత ప్రభుత్వానికి చెందిన ఫిషరీస్ విభాగంప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 2,195 ఎఫ్.ఎఫ్.పి.ఒల ఏర్పాటుకు ఆర్ధిక సహాయం అందించింది. అలాగే 95 ఎఫ్.ఎఫ్.పి.ఒలను ఒ.ఎన్.డి.సి నెట్ వర్క్ లో చేర్చింది. ఒ.ఎన్.డి.సితో కుదిరిన ఈ కొలాబరేషన్ వల్ల ఎఫ్.ఎఫ్.పి.ఒలకు ఎన్నో ప్రయోజనాలు ఒనగూరాయి. దీనివల్ల లావాదేవీల ఖర్చు తగ్గింది. మార్కెట్ వ్యాప్తి పెరిగింది. పారదర్శకత మెరుగుపడింది. పోటీ, సమర్ధత , ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాల కల్పన పెరిగింది. ఒ.ఎన్.డి.సి నెట్వర్క్ లోకి తీసుకున్న ఆరు కంపెనీలలో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాకు చెందిన గోరఖ్ పూర్ కిసాన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, ఛత్తీస్ఘడ్లోని కంకేర్ జిల్లాకు చెందిన కాప్సి ఫిసరీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్,  బీహార్లోని పూర్ణియా జిల్లాలో గల బన్ మన్ఖి ఫిష్ ఫార్మర్ కంపెనీ లిమిటెడ్, ఛత్తీస్ ఘడ్ లోని బస్తర్ లో గల బస్తర్ పెరల్ ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, ఉత్తర ప్రదేశ్లోని దియోరా జిల్లాలోగల లరి ఫిష్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణాలోని సిద్దిపేట జిల్లా కొండపాక ఫిషరీస్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్లు మత్స్య రంగ అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ సందర్భంగా మంత్రి సన్మానించారు.

కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ లబ్ధిదారులకు కెసిసి సర్టిఫికేట్లు, పిఎంఎంఎస్వై మంజూరు లేఖలను అందజేశారు. ఆర్నమెంటల్ ఫిషరీస్ యూనిట్లకు సంబంధించి ప్రయోజనం పొందిన లబ్ధిదారులలో  శ్రీమతి యోగేశ్వరి వైఫ్ ఆఫ్ శ్రీ కతిరీశ్ కుమార్, శ్రీమతి సుగుణ వైఫ్ ఆఫ్ శ్రీ ముతు పాండి, శ్రీమతి సింధు వైఫ్ ఆఫ్ శ్రీ సుధాకర్, శ్రీమతి కలైయరసి వైఫ్ ఆప్ శ్రీ శక్తివేల్, శ్రీమతి పచియమ్మాళ్ వైఫ్ ఆఫ్ శ్రీ మాతియలగన్లు ఉన్నారు.

డిపార్టమెంట్ ఆఫ్ ఫిషరీస్ ఏర్పడి 2024కు 5 సంవత్సరాలు అవుతుంది. ఇది ఏర్పడినప్పటి నుంచి భారతీయ మత్స్యరంగ ప్రగతి, అభివృద్ధికి సంబంధించి పలు వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. మత్స్యవనరులను నిరంతరాయంగా వృద్ధిచేసేందుకు, మత్స్య రంగ సమగ్ర అభివృద్ధికి , మత్స్య విభాగం వివిధ పథకాలను ప్రారంభించింది. అందులో  నీలి విప్లవం (బ్లూ రెవల్యూషన్), మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఎఫ్.ఐ.డి.ఎఫ్), ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్వై), కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) అలాగే పిఎంఎంఎస్వై కింద చేపట్టనున్న ఉప పథకం వంటివి ఉన్నాయి. ఈ పథకాల కింద సుమారు రూ 38,572 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టాలని ఈ విభాగం సంకల్పించింది. దీని ద్వారా ఈ రంగంలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావడంతోపాటు, వ్యవస్థాగత అంతరాన్ని తొలగించడానికి వీలు కలుగుతుంది.  

 ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సంజయ్ కుమార్ నిషాద్బీహార్ మత్స్య, పశుగణాభివృద్ధి శాఖమంత్రి శ్రీమతి రేణు దేవి, అస్సాం మత్స్యశాఖ మంత్రి శ్రీ కేశబ్ మహంత, మేఘాలయకు చెందిన మత్స్య, పశుగణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ అలెగ్జాండర్ లాలూ హెక్,అరుణాచల్ ప్రదేశ్ కు  చెందిన వ్యవసాయ, పశుగణాభివృద్ధి, మత్స్య,ఆహార,పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గాబ్రియేల్ డి వాంగ్సు, ఒడిషాకు చెందిన ఇంచార్జి సహాయ మంత్రి శ్రీ గోకుల నంద మాలిక్ లు పాల్గొన్నారు.

***



(Release ID: 2033055) Visitor Counter : 15