వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ (జిఇఎం), గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక స్థూల అమ్మకాలతో ఈ ఏడాది తొలి త్రైమాసిక స్థూల అమ్మకాలను పోల్చి చూసినపుడు 136 శాతం వృద్ధి సాధించింది.


రూ 80,500 కోట్ల రూపాయల విలువగల సేవలను అందుకోవడం జరిగింది.

లక్ష కోట్ల రూపాయల మార్కు దాటిన కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రొక్యూర్మెంట్.

చిట్టచివరి అమ్మకం దారుకు చేరడానికి, ప్రభుత్వ ప్రొక్యూర్మెంట్ ను సులభతరం చేసేందుకు నిర్దేశించిన కార్యక్రమం జిఇఎం సహాయక్.

హస్తకళా ఉత్పత్తుల ప్రొక్యూర్మెంట్ను ప్రోత్సహించేందుకు, అభార్ కలక్షన్, ఓకల్ ఫర్ లోకల్ ఔట్లెట్ మార్కెట్ ప్లేస్ ప్రారంభం.

Posted On: 11 JUL 2024 5:40PM by PIB Hyderabad

గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్(జిఇఎం), గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక స్థూల అమ్మకాలతోఈ ఏడాది తొలి త్రైమాసిక స్థూల అమ్మకాలను పోల్చిచూసినపుడు 136 శాతం వృద్ధి సాధించింది. గత ఏడాది తొలి త్రైమాసిక కాలంలో రూ 52,670 కోట్ల రూపాయల స్థూల అమ్మకాలు చేయగా,ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ స్థూల అమ్మకాలు రూ 1,24.761 కు చేరుకున్నాయి. దేశీయంగా పటిష్టమైన ఈ–ప్రొక్యూర్మెంట్ కు వీలు కల్పించేందుకు 2016లో గవర్నమెంట్ఈ  మార్కెట్ ప్లేస్ ను తీసుకువచ్చారు. గతంలో అరకొరగా ఉన్న వ్యవస్థను చక్కదిద్ది, ప్రభుత్వ కొనుగోలు సంస్థలు అన్నీ వినియోగించుకునేందుకు వీలుగా ఒక సమగ్ర ఏకీకృత వ్యవస్థగా దీనిని రూపొందించారు.  దేశవ్యాప్త నెట్ వర్క్ కలిగిన అమ్మకందారులు, సర్వీసు ప్రొవైడర్లు ఇందుకు తమ సేవలు అందిస్తున్నారు.

2024‌‌–25 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సేవల విభాగం గణనీయమైన వృద్ధిని  సాధించింది. ఇది రూ 80,500 కోట్ల రూపాయలకు పైగా స్థూల అమ్మకాలు సాధించింది . అంటే 2023–24 ఆర్దిక సంవత్సరం తొలి త్రైమాసికంతొ పోల్చిచూసినపుడు ఇది 330 శాతం వృద్ధిగా చెప్పుకోవచ్చు.

ఇక గవర్నమెంట్  ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా, కేంద్ర ప్రభుత్వ రంగ ఎంటర్ప్రైజెస్ తో పాటు కేంద్ర మంత్రిత్వశాఖల ప్రొక్యూర్మెంట్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లక్ష కోట్ల రూపాయల మైలు రాయిని దాటింది. ఇందులో బొగ్గు, రక్షణ, పెట్రోలియం, గ్యాస్ రంగాలు ఎక్కువ మొత్తంలో ప్రొక్యూర్ మెంట్ చేశాయి. లక్ష కోట్ల రూపాయల స్థూల మార్కెట్ విలువ లో సిపిఎస్ఇ ల వాటా 91,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది.

2023624 తొలి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రొక్యూర్మెంట్ రూ 42,500 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం  వీటి ప్రొక్యూర్మెంట్ లో గణనీయమైన వృద్ధి కనిపించింది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ లో కీలకంగా పాల్గొంటున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రొక్యూర్మెంట్ రంగంలో సంస్కరణలను ముందుకు తీసుకువెళుతున్నాయి. అలాగే జాతీయాభివృద్ధికి వనరుల కేటాయింపు గరిష్ట స్థాయిలో ఉండేలా చూసేందుకు కట్టుబడి ఉన్నట్టు ఇవి పునరుద్ఘాటిస్తున్నాయని గవర్నమెంట్  ఈ మార్కెట్ ప్లేస్ సి.ఇ.ఒ ప్రశాంత్ కుమార్ సింగ్ తెలిపారు.చిట్టచివరి అమ్మకందారు వరకు చేరాలన్న సంస్థ దార్శనికతను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, అలాగే,పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ను మరింత సులభతరం చేసేందుకు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ , ‘జి.ఇ.ఎం సహాయక్’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తొంది.  దీని ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 6వేల నుంచి 7వేల మంది శిక్షణ ,  సర్టిఫికేట్, గుర్తింపు పొందిన వారితో ఒక నెట్ వర్క్ను  ఏర్పాటు చేయనున్నారు. వీరు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ లో గల ప్రస్తుత అమ్మకం దారులు, కొత్త అమ్మకం దారులకు సహాయపడడమే కాకుండా, వారి వ్యాపార అవకాశాలను మరింత పెంపొందేలా చేస్తారు. అలాగే కొనుగోలు దారులు కూడా వీరి ద్వారా ప్రయోజనం పొందుతారు. బిడ్ల రూపకల్పనకు, ఇతర విలువ ఆధారిత సేవలు అందించడానికి వీరు ఉపకరిస్తారు.

సులభతర వాణిజ్యానికి వీలుగా, గవర్నమెంట్  ఈ మార్కెట్ ప్లేస్ తీసుకున్న మరో ముఖ్య నిర్ణయం,అమ్మకందారులపై విధించే లావాదేవీల చార్జీలను గణనీయంగా తగ్గించడం. జి.ఇ.ఎం తీసుకున్న కొత్త  రెవిన్యూ పాలసీ ప్రకారం, అమ్మకం దారులు, సేవలు అందించేవారు రూ 5 లక్షలకు మించిన  ఆర్డర్ విలువపై కేవలం 0.30 శాతం లావాదేవీల చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది 0.45 శాతంగా ఉండేది. ఈ లావాదేవీల చార్జీని గరిష్ఠంగా 3 లక్షలకు పరిమితం చేశారు. గతంలో 72.50 లక్షల వరకు చార్జి చేసేవారు. అంతేకాదు 2023‌–24 ఆర్ధిక సంవత్సరంలో 96.5 శాతం లావాదేవీలు 5 లక్షల రూపాయల విలువకు తక్కువగా ఉండడంతో వాటిపై ఎలాంటి లావాదేవీల చార్జీని వసూలు చేయలేదని జిఇఎం వెల్లడించింది.  ఈ వివరాలను బట్టి జి.ఇ.ఎం కేవలం 3.5 శాతం లావాదేవీలు, ఆర్దర్లపై మాత్రమే లావాదేవీల చార్జిని వసూలు చేసినట్టయింది. జి.ఇ.ఎం ప్లాట్ఫారం పై లావాదేవీల చార్జీని 33 శాతం నుంచి 96 శాతం వరకు తగ్గించడం అమ్మకం దారులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల వారు తమ అమ్మకాలను మార్కెట్ లో మరింత పోటీ ధరకు అందించగలుగుతారని శ్రీ ప్రశాంత్ కుమార్ సింగ్ వెల్లడించారు.

జి.ఇ.ఎం మరో ముఖ్యమైన కీలక కార్యక్రమం ‘ ది అభార్ కలక్షన్ ’ పేరుతో ప్రారంభించింది.  ఓకల్ పర్ లోకల్ ఔట్లెట్ మార్కెట్ ప్లేస్ కార్యక్రమం కింద దీనిని ప్రారంభించింది. అభార్ కలక్షన్ కింద 120కిపైగా హస్తకళా ఉత్పత్తులు, బహుమతి వస్తువులు, ఒక జిల్లా – ఒక ఉత్పత్తి(ఒడిఒపి) కార్యక్రమం కింద గల ఎంపిక చేసిన ఉత్పత్తులను, భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫిక్ ఇండెక్స్ –జి.ఐ) విభాగం కింద గల ఉత్పత్తులను,ప్రభుత్వ వేడుకలు ఉత్సవాల సందర్భంగా వినియోగించేందుకు ఉపయోగపడే వాటిని ప్రభుత్వ కొనుగోలుదారుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఇవి 500 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకూ ధర పలికేవి ఉన్నాయి.

“అభార్ కలక్షన్స్ను అందుబాటులోకి తీసుకురావడం జి.ఇ.ఎం సాధించిన కీలక మైలు రాయిగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా దేశీయ అద్భుత హస్తకళాకృతులు, కళాఖండాలను , భారత దేశ గొప్ప సంస్కృతి వారసత్వాన్ని తెలియజెప్పడానికి, అలాగే కేంద్ర , రాష్ట్ర హస్తకళా, చేనేత ఎంపోరియంల నెట్ వర్క్ ద్వారా వీటి అమ్మకం దారులకు మార్కెట్ చేయూతనిచ్చి వారికి సాధికారత కల్పించడానికి ఇది ఉపకరిస్తుందని గవర్నమెంట్ ఈ మార్కెట్ సి.ఇ.ఒ శ్రీ ప్రశాంత్ కుమార్ సింగ్ తెలిపారు.

       జి.ఇ.ఎం తన కార్యకలాపాలను ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా , ఈ సంస్థ దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( డిఐసిసిఐ), అస్సాం స్టార్టప్ నెస్ట్, ఈశాన్య అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్.ఇ.డి.ఎఫ్.ఐ) వంటి సంస్థలతో ఎం.ఓ.యులు కుదుర్చుకుంది. అలాగే దేశవ్యాప్తంగా అమ్మకం దారులు, కొనుగోలుదారులకు 320 కి పైగా  శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం జిరిగింది. అలాగే జి.ఇ.ఎం బహు బాషలలో ఏర్పాటు  చేస్తున్న ఇంటరాక్టివ్ శిక్షణ కార్యక్రమాలు అనతి కాలంలోనే బహుళ ప్రచారం పొందాయి. ఈ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించిన నాలుగు నెలల  వ్యవధిలోనే 1172 మంది కొనుగోలుదారులు, 3,393 మంది అమ్మకం దారులు శిక్షణకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ రంగంలో తన కీలక స్థానాన్ని పదిలం చేసుకునేందుకు జి.ఇ.ఎం కృత్రిమ మేథ ఆధారిత చాట్ బాట్ ‘‘జి.ఇ.ఎం.ఎ.ఐ”ని   వచ్చే త్రైమాసికంలో అందుబాటులోకి తేనుంది. ఈ కృత్రిమ మేథ ఉపకరణం, అమ్మకం దారులు, కొనుగోలుదారులు వివిధ ఫిర్యాదుల ద్వారా సంధించే ప్రశ్నలను, వారి స్పందనలను విశ్లేషించి తగిన పరిష్కారాలను సూచించనుంది. కృత్రిమ మేథ ద్వారా శక్తిమంతమైన చాట్బాట్ను తీర్చిదిద్దేందుకు  సంభాషణల విశ్లేషణ, బిజినెస్ ఇంటెలిజెన్స్ ను వాడుకుంటారు.  జి.ఇ.ఎం ప్లాట్ఫారం సంపూర్ణ పనితీరు ను తెలియజేసే విధంగా సమగ్ర పర్యవేక్షక ఉపకరణాన్ని కూడా తీసుకువస్తున్నారు. దీనికితోడు, జిఇఎం ను ఉపయోగించుకుంటున్న వారి చిరునామాలను జియో ట్యాగింగ్ చేసే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ ప్రాజెక్టు వల్ల ఎం.ఎస్.ఇలు, ఒడిఒపి సంస్థల అమ్మకాలు, ఏయే ఉత్పత్తుల అమ్మకాలు ఎలా ఉన్నాయన్నదానిని ఆయా భౌగోళిక ప్రాంతాల ఆధారంగా పరిశీలించడానికి వీలు కలుగుతుంది.

    జిఇఎం గణనీయమైన ఫలితాలను సాధించడంతోపాటు, తన కార్యకలాపాలను నాణ్యతపరంగా మరింత మెరుగు పరుచుకుంది. పారదర్శకత పెంపు, అవినీతికి అవకాశం లేకుండా చూడడం, చిన్న తరహా అమ్మకం దారులు మార్కెట్ ప్లేస్లో ఎక్కువమంది పాల్గొనేట్టు చూడడం,  సమయం, సామర్ధ్యాల పెంపు వంటి వాటి విషయంలో జిఎంఇ మంచి పనితీరు కనబరుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం ఏర్పరచిన గట్టి పునాదితొ  2024–25 ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జి.ఇ.ఎం పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ మార్కెట్ లో సమర్ధత, పారదర్శకత, సమ్మిళితత్వంలో కీలక శక్తిగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది.

***


(Release ID: 2033052) Visitor Counter : 57