గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
పది కోట్ల నాలుగు లక్షల మంది మహిళలను తొంభై లక్షల డెబ్భయ్ ఆరు వేలకు పైగా స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జిల)లో సంఘటిత పరచిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – నేషనల్ రూరల్ లైవ్ లీ హుడ్ మిషన్ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) : శ్రీ చరణ్ జీత్ సింగ్
పేదరికాన్ని నిర్మూలించడం కోసం ఆఖరి అంచె లోని వారి వరకు చేరుకోవడానికి బహుళ స్టేక్ హోల్డర్ లు అవసరమూ, ముఖ్యమూను అని నొక్కిపలికిన శ్రీ చరణ్ జీత్ సింగ్
అందరినీ కలుపుకొని పోయే జీవనాధారాలు ముఖ్యం అని పేదరిక నిర్మూలన అంశంపై నిర్వహించిన ఒక ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశంలో స్పష్టం చేసిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
Posted On:
12 JUL 2024 1:45PM by PIB Hyderabad
ఆఖరు అంచె లో ఉన్న వ్యక్తులకు కూడా సమ్మిళిత జీవనాధారాన్ని సమకూర్చి, పేదరికం, వాతావరణ మార్పు అనే జోడు సవాళ్ళను ఎదుర్కొని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో గ్రామీణ జీవనాధారాల అదనపు కార్యదర్శి శ్రీ చరణ్‌జీత్ సింగ్ పునరుద్ఘాటించారు. న్యూ ఢిల్లీ లో నిన్న అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ లేబ్ (జె-పిఎఎల్) దక్షిణ ఆసియా నిర్వహించిన ‘రీఇమాజనింగ్ పావర్టీ అలీవియేషన్ ఇన్ ఇండియా రౌండ్ టేబుల్ సమావేశం’లో శ్రీ చరణ్ జీత్ సింగ్ పాల్గొని మాట్లాడారు.
భారతదేశాన్ని 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్ ను సాకారం చేసే దిశలో ప్రభుత్వం పాటుపడుతోందని, ఈ క్రమంలో ‘‘అభివృద్ధి ఫలాలను అందజేయడం లో ఏ ఒక్కరినీ విస్మరించ కూడదు’’ అని శ్రీ చరణ్‌జీత్ సింగ్ అన్నారు. పేద మహిళలు రక రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నారని, ఆ సవాళ్ల ను పరిష్కరించవలసిన తక్షణావసరం ఉందని ఆయన అన్నారు. ఈ సవాళ్ళు రాష్ట్రానికి రాష్ట్రానికి వేరు వేరు తరహా లో ఉండవచ్చన్నారు. ఆ యా సవాళ్ళను గుర్తించడానికి, వాటిని పరిష్కరించడానికి స్థానిక సముదాయం గురించి అవగాహన కీలకమని ఆయన అన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన - నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) పరిధిలో గ్రామీణాభివృద్ధి శాఖ అమలు పరుస్తున్న వినూత్న కార్యకలాపాలను గురించి శ్రీ చరణ్‌జీత్ సింగ్ వివరిస్తూ, పేదరికాన్ని అంతం చేయడానికి ఆఖరి అంచె వ్యక్తుల వద్దకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడం కోసం అందరు స్టేక్-హోల్డర్ ల సహకారం కావాలి అని స్పష్టం చేశారు. ‘‘మనం కలసి పని చేస్తే, గణనీయమైనటువంటి మార్పును తీసుకురావచ్చు’’ అని శ్రీ చరణ్‌జీత్ సింగ్ అన్నారు.
డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్ 10.04 కోట్ల మందికి పైగా మహిళల తో 90.76 లక్షల కు పైగా స్వయం సహాయ సమూహాలను ఏర్పరచిందని శ్రీ చరణ్ జీత్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమం అందరికీ ఆర్థిక సేవల అందజేత, డిజిటల్ మాధ్యమం వినియోగం, స్థిరమైన బ్రతుకుతెరువు, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. మహిళల కోసం జీవనోపాధి మార్గాలను అభివృద్ధి పరచడంలో సమగ్రమైన, అందరినీ కలుపుకొని పోయే విధానాన్ని అనుసరించాలనేది డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్ లో ముఖ్య లక్షణంగా ఉందని ఆయన అన్నారు.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లో గ్రామీణ జీవనాధారాల సంయుక్త కార్యదర్శి స్మృతి శరణ్ ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, మంత్రిత్వ శాఖ ఈ రంగంలో వినూత్న పథకాలను పక్కాగా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పని చేస్తోందన్నారు. ఈ పథకాలు గ్రాడ్యుయేషన్ అప్రోచ్ కు తగినవి గా ఉన్నాయి. గ్రామీణ మహిళలు ఆత్మనిర్భరత మార్గంలో నడచి వెళ్ళేటట్లుగా ఈ పథకాలను రూపొందించడమైందని ఆమె తెలిపారు. రాష్ట్రాలు వాటి ప్రాధాన్య రంగాలను లెక్క లోకి తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలుపరుస్తున్నాయని ఆమె అన్నారు. పేద కుటుంబాలను ఇతర సామాజిక రక్షణ కార్యక్రమాల పరిధిలో కూడా చేర్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. పేదరికం తాలూకు బహుళ పార్శ్వాలను పరిష్కరించడం కోసం శాస్త్రీయమైన రుజువులు, డేటా తో పాటు సాంకేతికత కూడా ఎంతైనా అవసరం అని స్మృతి శరణ్ స్పష్టం చేశారు. ధన సంబంధమైన పేదరికం నిర్వచనానికి అతీతంగా మనం ముందుకు పోవలసి ఉందని ఆమె అన్నారు.
పేదలను సంరక్షించడంలో ఒక ముఖ్య పాత్రను గ్రాడ్యుయేషన్ అప్రోచ్ నమూనా పోషించగలుగుతుందని జె-పిఎఎల్ సహ వ్యవస్థాపకుడు, నోబెల్ బహుమతి గ్రహీత శ్రీ అభిజిత్ బెనర్జీ అన్నారు. ఈ ప్రజలు దీని పరిధికి బయల ఉన్నారు, అయితే వారికి అవకాశం లభించిందా అంటే వారు వారి బతుకు పగ్గాలను వారి చేతులలోకే తీసుకోవడం మొదలు పెడతారు అని ఆయన అన్నారు.
ఎన్‌జిఒ బిఆర్ఎసి రూపొందించిన ఒక విస్తృతమైన బ్రతుకుతెరువు కార్యక్రమమే గ్రాడ్యుయేషన్ అప్రోచ్. ఇది నేటి ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షలకు లోనైన సామాజిక సంరక్షణ కార్యక్రమాలలో ఒకటి. పేద కుటుంబాలను పేదరికం వలయంలో నుంచి బయటకు తీసుకురావడంలో గ్రాడ్యుయేషన్ అప్రోచ్ సమర్థంగా పని చేసిందని జె-పిఎఎల్, ఇన్నోవేషన్స్ ఫర్ పావర్టీ యాక్షన్ లతో అనుబంధాన్ని కలిగి ఉన్న పరిశోధకులు వారు జరిపిన ఏడు విధాలైన యాదృచ్చిక మూల్యాంకనాల ద్వారా తేల్చిచెప్పారు. ఇది 15 దేశాలలోని 30 లక్షలకు పైగా కుటుంబాల వరకు చేరుకొంది.
రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, జీవిక, బిఆర్ఎసి, బిఎమ్ జిఎఫ్, ప్రపంచ బ్యాంకు, ది/నడ్జ్ ఇన్‌స్టిట్యూట్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జె-పిఎఎల్ సహ వ్యవస్థాపకుడు, నోబెల్ బహుమతి గ్రహీత శ్రీ అభిజిత్ బెనర్జీ కూడా దాదాసేగా ఇరవై ఏళ్ళ పాటు గ్రాడ్యుయేషన్ అప్రోచ్ ప్రభావాన్ని అధ్యయనం చేయడం వల్ల తనకు కలిగిన ఆలోచనలను, అనుభవాలను వివరించారు.
***
(Release ID: 2032787)
Visitor Counter : 81