ఉప రాష్ట్రపతి సచివాలయం
ఆర్థిక, సామాజిక సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రతిభావంతులైన బాలికలకు అండదండలను అందించండి అంటూ ఎఫ్‌ఐసిసిఐ సభ్యులను ప్రోత్సహించిన ఉప రాష్ట్రపతి
కుటుంబం గల్లా పట్టె మీద మహిళకు నియంత్రణ ఉంది అంటే గనక ఆ కుటుంబం ఆర్థిక స్థితి, ఆ కుటుంబం వృద్ధి నిక్షేపంగా ఉంటాయి: ఉప రాష్ట్రపతి
మహిళలకు వారు ఏ మతానికి చెందిన వారన్న దానితో నిమిత్తం లేకుండా సమానమైన, ఒకే విధమైన ఆర్థిక సహాయం అనే అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రశంసించిన ఉప రాష్ట్రపతి
బాలికలకు సాధికారితను కల్పించే దృష్టితో సిఎస్ఆర్ ప్రయాసలను చేపట్టాలని సభ్యులకు విజ్ఞప్తి చేసిన శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్
వైస్ ప్రెసిడెంట్స్ ఎన్‌క్లేవ్ లో ఎఫ్ఐసిసిఐ మహిళా సంస్థ చెన్నై చాప్టర్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన ఉప రాష్ట్రపతి
Posted On:
11 JUL 2024 4:35PM by PIB Hyderabad
ఆర్థిక సవాళ్లను, సామాజిక సవాళ్ళను ఎదుర్కొంటున్న ప్రతిభామూర్తులైన అమ్మాయిలకు అండగా నిలవవలసిందంటూ ఎఫ్ఐసిసిఐ (‘ఫిక్కీ’) మహిళా సంస్థ సభ్యులకు ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఈ రోజున సూచించారు. ఈ విధమైన మద్దతు ప్రభావం ఎంతగానో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బాలికలకు వారు చదువుకోవడానికి తోడ్పడడం, బాలికల భద్రతకు పూచీ పడడం సాటి లేని సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తాయని ఆయన అన్నారు.
సమాజం నిరంతర వృద్ధి బాలికల సాధికారిత తో ముడిపడి ఉంటుంది అని శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ స్పష్టంచేస్తూ, ‘‘కుటుంబంలో గల్లాపెట్టె ఇల్లాలి అధీనంలో ఉందంటే గనక ఆ కుటుంబం ఆర్థికంగాను, ప్రగతి పరంగాను భేషుగ్గా ఉంటుంది. ఈ పనిని గత పది సంవత్సరాలలో పెద్ద ఎత్తున చేపట్టడమైంది’’ అని ఆయన అన్నారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) లో భాగం గా బాలికలకు సాధికారితను కల్పించే కృషి ని జరిపే విధం గా ఎఫ్ఐసిసిఐ మహిళ సంస్థ సభ్యులు వారి కుటుంబాలకు, ఇతర అనుబంధ కార్పొరేట్ లకు చెప్పి ఒప్పించాలని శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ కోరారు. వరుసలో చివరి లబ్ధిదారుకు సైతం ఫలాలు అందేటట్లు సిఎస్ఆర్ కార్యక్రమాలను రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. సాయాన్ని ఎంతమాత్రం అందుకోలేకపోతున్న బాలికలకు అండదండలను అందిస్తే, వారిలో ఆశను రేకెత్తించవచ్చు, వారికి అవకాశాలను అందించవచ్చు, ఇలా చేయడం వారి జీవనంలో సార్థకమైన, సకారాత్మకమైన ప్రభావాన్ని కలిగిస్తుందని ఉప రాష్ట్రపతి అన్నారు.
ఉప రాష్ట్రపతి భవన సముదాయంలో శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఒ చెన్నై చాప్టర్ సభ్యులతో సమావేశమయ్యారు. మహిళలు వారు ఏ మతానికి చెందినవారు అనే అంశానికి అతీతంగా వారికి సమానమైన, ఒకే విధమైన సహాయాన్ని అందించే అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ప్రశంసించారు.
మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను గురించి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ప్రముఖంగా ప్రస్తావిస్తూ, వారి జీవనాన్ని మెరుగుపరచేందుకు ప్రభుత్వం ప్రతి ఇంటికి టాయిలెట్, చౌకగా గృహ నిర్మాణం, ప్రతి నల్లా నుంచి నీరు, ప్రతి ఇంటికి నల్లా నీరు, ముద్ర యోజన వంటి కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు.
మహిళలకు సాధికారిత కల్పన కోసం పార్లమెంటులో తన నిబద్ధతను గురించి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ పునరుద్ఘాటించారు. మహిళలకు రిజర్వేషన్ బిల్లును రాజ్య సభ ఆమోదించిన వేళ 17 మంది మహిళా పార్లమెంట్ సభ్యులు కీలక పదవులలో ఉన్నారని శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాను, డిప్యూటీ చైర్ పర్సన్ మినహా అంతా మహిళలే ఉన్నారని ఆయన అన్నారు. రాజ్య సభ లో పురుషుల, మహిళల ప్రాతినిథ్యంలో చెప్పుకోదగిన ప్రగతి చోటుచేసుకొందని ఆయన అన్నారు. పీఠం లో ఆసీనులు అయ్యే వారిలో ఒకప్పుడు పురుషులదే పైచేయిగా ఉండగా ప్రస్తుతం 50 శాతానికి పైగా మహిళలు ఉన్నారని ఆయన అన్నారు.
మహిళల నాయకత్వంలో సాధికారిత కల్పన పరంగా భారతదేశం వేసిన ముందంజలను గురించి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ వివరించారు. ఒక సామాన్య కుటుంబంలోని ఆదివాసీ మహిళ మాన్య భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశ ప్రథమ పౌరురాలు గా ఎదగడం చూస్తే తనకు గర్వంగా అనిపించింది అని ఆయన ఆన్నారు. ‘‘భారతదేశం మహిళలకు సాధికారిత అనేది ఎలా ఉండాలో నిర్వచిస్తోంది. భారతదేశం మహిళల నాయకత్వంలో సాధికారిత ఎలా ఉండాలో నిర్వచిస్తోంది’’ అని ఆయన అన్నారు.
పూర్తి పాఠాన్ని ఈ కింద ఇచ్చిన లింక్ లో చదవండి:
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2032393
***
(Release ID: 2032689)
Visitor Counter : 63