కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
క్వాంటమ్ ప్రమాణీకరణ, పరీక్షల ప్రయోగశాలలకోసం ప్రతిపాదనల్ని ఆహ్వానించిన కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ
పౌరులందరి లబ్ధి కోసం పూర్తి స్థాయిలో క్వాంటమ్ సాంకేతికతల్ని వెలికి తీయడానికి, నిర్వహించడానికి వీలుగా ఆవిష్కరణ కేంద్రాలుగా ఉపయోగపడే ప్రయోగశాలలు
క్వాంటమ్ కమ్యూనికేషన్ అంశాలను ఎలాంటి అవరోధాలు లేకుండా అనుసంధానించడానికిగాను అవసరమైన ప్రమాణాలను ఏర్పాటు చేడమే లక్ష్యం
క్వాంటమ్ భావనల్ని, ప్రక్రియల్ని, వస్తువుల్ని, అనువర్తనాల్ని ఆమోదించడానికి నమ్మకమైన పరీక్షల సదుపాయాల్ని ప్రయోగశౄలలు అభివృద్ధి చేస్తాయి
క్వాంటమ్ సాంకేతికతల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడానికి వేసిన గణనీయమైన కార్యక్రమంగా ఈ కార్యక్రమానికి గుర్తింపు. ఈ అత్యాధునిక రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడం జరుగుతుంది.
Posted On:
07 JUL 2024 10:34AM by PIB Hyderabad
క్వాంటమ్ ప్రమాణీకరణ, పరీక్షల ప్రయోగశాలలకోసం ప్రతిపాదనల్ని ఆహ్వానిస్తూ కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ ప్రకటన చేసింది. భారతదేశ విద్యాసంస్థలు లేదా ఆర్ అండ్ డి సంస్థలు, ఎవరికివారుగానీ లేదా భాగస్వామ్యంతోగానీ ప్రతిపాదనలు పంపాలని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. క్వాంటమ్ సాంకేతికతల రంగంలో పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేయడమనేది ప్రధానమైన లక్ష్యం. తద్వారా క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థల విశ్వసనీయతను, భద్రతను, అంతర్గత నిర్వహణను నిర్ధారించవచ్చు. ఈ ప్రయోగశాలలు ఆవిష్కరణ కేంద్రాలుగా పని చేస్తాయి. అంతే కాదు క్వాంటమ్ సాంకేతికత అభివృద్ధిదారులను, పరీక్షా పరికరాల తయారీదారులను, విద్యారంగ పరిశోధకలనే ఒక తాటిమీదకు తీసుకొస్తాయి. తద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూర్చేలా క్వాంటమ్ సాంకేతికతల పూర్తి సమర్థతను వెలికితీసి నిర్వహించడం జరుగుతుంది.
క్వాంటమ్ సాంకేతికతలద్వారా నిత్య జీవితాన్ని మెరుగుపరచడం జరుగుతుంది.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతైన జై అనుసంధాన్ ప్రకారం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. భారతయ పౌరుల జీవితాలను నేరుగా మెరుగుపరచచేలా టెలికమ్యూనికేషన్ ఉత్పత్తులు, సాంకేతికతల విషయంలో జరిగే పరిశోధనలకు, అభివృద్ధికి ఈ కార్యక్రమం మద్దతునిస్తుంది.
క్వాంటమ్ సాంకేతికతల్లో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడానికి వేసిన గణనీయమైన కార్యక్రమంగా దీన్ని పేర్కొనడం జరుగుతోంది. తద్వారా ఈ ఆధునిక రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడం జరుగుతుంది. ఈ కృషి అనేది భద్రమైన, నమ్మకమైన, సమర్థవంతమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థల అభివృద్ధికి మద్దతుగా నిలుస్తుంది. అంతే కాదు నిత్యజీవిత కమ్యూనికేషన్, సమాచార భద్రత, ఆ మాటకొస్తే మొత్తం డిజిటల్ రంగం అభివృద్ధికి పనికొచ్చే అత్యాధునిక సాంకేతికతల్ని భారతీయ పౌరులకు అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.
ప్రతిపాదిత ప్రయోగశాలల లక్ష్యాలు
క్వాంటమ్ ప్రమాణీకరణ ద్వారా ప్రమానాణలను విధివిధానాలను నెలకొల్పుతారు. ఇవి క్వాంటమ్ కీలక పంపిణీ, క్వాంటమ్ స్టేట్ అనలైజర్స్, ఆప్టికల్ ఫైబర్స్, కాంపొనెంట్స్ ను కమ్యూనికేషన్ నెటవర్క్ లకు ఎలాంటి అవరోధాలు లేని అనుసంధానం చేయడానికి ముఖ్యం.
పరీక్షల సదుపాయాలు: స్టార్టప్ సంస్థలు, ఆర్ అండ్ డి సంస్థలు, విద్యాసంస్థలతోపాటు భారతీయ పరిశ్రమల సభ్యులు తయారు చేసిన క్వాంటమ్ భావనలు, ప్రక్రియలు, వస్తువులు, అనువర్తనాలకు ఆమోదం తెలపడానికి నమ్మకమైన పరీక్షా సదుపాయాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది.
వాటి పనితీరును వివిధ పరిస్థితుల మధ్యన పరీక్షించడం, జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయేలా వుంటే ధృవీకరణ చేయడం ఇందులో భాగం. ఈ సదుపాయాలనేవి క్వాంటమ్ సాంకేతికతల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. దాంతో వివిధరంగాలకు చెందిన ప్రజలు వాటిని భద్రంగా, సమర్థవంతంగా వినియోగిస్తారు. వీరిలో ఆరోగ్య భద్రత, విద్య, ఆర్థిక రంగాలకు చెందినవారు వున్నారు.
ప్రతిపాదనలు పంపడానికి చివరితేదీ ఆగస్ట్ 5, 2024. మరింత సమాచారం కొరకు
టెలికమ్యూనికేషన్ విభాగ వెబ్ సైట్ website https://dot.gov.in సందర్శించండి. లేదా TTDF program office వారిని https://ttdf.usof.gov.in అడ్రస్ లో సంప్రదించగలరు.
...
(Release ID: 2031773)
Visitor Counter : 103