ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాబోయే 2024-25 కేంద్ర బడ్జెట్ పై న్యూఢిల్లీలో ముగిసిన ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశాలు
Posted On:
07 JUL 2024 11:18AM by PIB Hyderabad
కేంద్రం త్వరలో ప్రతిపాదించనున్న 2024-25 కేంద్ర బడ్జెట్ కు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 2024 జూన్ 19వ తేదీన ప్రారంభమైన ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశాలు 2024 జూలై 5వ తేదీన ముగిశాయి.
వ్యక్తిగత సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా 10 బృందాల నుంచి 120 మంది పైగా నిపుణులను ఆహ్వానించారు. వ్యవసాయదారుల సంఘాల ప్రతినిధులు & వ్యవసాయ ఆర్థికవేత్తలు; వాణిజ్య సంఘాలు; విద్య & ఆరోగ్య రంగాలు; ఉపాధి & నైపుణ్య రంగాలు; ఎంఎస్ఎంఇలు; వాణిజ్యం & సర్వీసులు; పారిశ్రామిక రంగం; ఆర్థిక రంగం & పెట్టుబడి మార్కెట్లు; మౌలిక వసతులు, ఇంధన, అర్బన్ రంగాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి; ఆర్థిక శాఖ కార్యదర్శి, వ్యయ శాఖ కార్యదర్శి డాక్టర్ టి.వి.సోమనాథన్; ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ శేఠ్; పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి శ్రీ తుహిన్ కె.పాండే; ఆర్థిక సర్వీసుల శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ జోషి; రెవిన్యూ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ మల్హోత్రా; కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ గోవిల్; సంబంధిత మంత్రిత్వ శాఖల కార్యదర్శులు; ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు డాక్టర్ వి.అనంత నాగేశ్వరన్; ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో పాటు ఏ శాఖపై సంప్రదింపులు జరుగుతుంటే ఆయా సంబంధిత శాఖల సీనియర్ అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొ్న్నారు.
ఈ సంప్రదింపుల ప్రకియలో భాగంగా నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని విలువైన సూచనలు అందించిందుకు ప్రతినిధులందరికీ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్ కృతజ్ఞతలు తెలియచేశారు. వారందరి సూచనలను జాగ్రత్తగా పరిశీలించి 2024-25 సంవత్సరానికి బడ్జెట్ తయారుచేసే సమయంలో పరిగణనలోకి తీసుకుంటానని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు.
ఫొటో క్యాప్షన్ :
త్వరలో ప్రవేశపెట్టబోతున్న 2024-25 కేంద్ర బడ్జెట్ పై 2024 జూన్ 25వ తేదీన న్యూఢిల్లీలో వాణిజ్య, సేవల రంగాల ప్రతినిధులతో నిర్వహించిన ఏడవ ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
***
(Release ID: 2031759)
Visitor Counter : 76
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada