ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
44వ ఫుడ్ అథారిటీ సమావేశంలో, ఎఫ్ఎస్ఎస్ఎఐ ఆహార పదార్థాలపై మొత్తం చక్కెర స్థాయి, ఉప్పు, సంతృప్త కొవ్వులు యొక్క పోషక సమాచారాన్ని బోల్డ్ అక్షరాలు, పెద్ద ఫాంట్ పరిమాణంలో ప్రదర్శించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది
వినియోగదారులు తాము వినియోగించే ఉత్పత్తుల పోషక విలువను బాగా అర్థం చేసుకోవడానికి, ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వారికి సాధికారత కల్పించడం ఈ సవరణ లక్ష్యం.
అసాంక్రమిత వ్యాధుల పెరుగుదలను ఎదుర్కోవడానికి, ప్రజారోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది.
Posted On:
06 JUL 2024 6:14PM by PIB Hyderabad
ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై పోషక సమాచారంలో మొత్తం చక్కెర స్థాయి, ఉప్పు, సంతృప్త కొవ్వుకు సంబంధించి బోల్డ్, పెద్ద అక్షరాలలో ముద్రణకు పెద్ద పరిమాణాన్ని ప్రదర్శించే ప్రతిపాదనకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) ఆమోదం తెలిపింది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ అధ్యక్షుడు శ్రీ అపూర్వ చంద్ర నేతృత్వంలో జరిగిన ఫుడ్ అథారిటీ 44వ సమావేశంలో పౌష్టికాహార సమాచార లేబులింగ్ సంబంధించి ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ (లేబులింగ్, డిస్ప్లే) రెగ్యులేషన్స్, 2020 సవరణను ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారులు తాము వినియోగించే ఉత్పత్తుల పోషక విలువలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి, ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సవరణ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సవరణకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్ ను సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.
ఒక వడ్డింపు (పర్ సర్వ్) శాతానికి, రికమండెట్ డైటరీ అలవెన్సెస్ (సిఫార్సు చేయబడిన ఆహార మొత్తాలు) (ఆర్డిఎ) సంబంధించిన సమాచారంలో మొత్తం చక్కెర, మొత్తం సంతృప్త కొవ్వు, సోడియం స్థాయి పెద్ద అక్షరాలలో ఇవ్వబడుతుంది. ఎఫ్ఎస్ఎస్ (లేబులింగ్, డిస్ప్లే) రెగ్యులేషన్, 2020 లో పొందుపర్చిన రెగ్యులేషన్ 2 (వి), 5 (3) వరుసగా ఆహార ఉత్పత్తుల లేబుళ్లపై వడ్డించే పరిమాణం, పోషక సమాచారాన్ని పేర్కొనాల్సిన ఆవశ్యకతలను నిర్దేశిస్తాయి.
వినియోగదారులు తాము ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకునేందుకు సాధికారత కల్పించడంతో పాటు, అసాంక్రమిత వ్యాధుల(ఎన్సిడి) పెరుగుదలను ఎదుర్కునేందుకు, ప్రజారోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహించే దిశగా ఈ సవరణ దోహదం చేస్తుంది. స్పష్టమైన, ప్రత్యేకమైన లేబులింగ్ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం అసాంక్రమిత వ్యాధులను ఎదుర్కోవటానికి చేస్తున్న ప్రపంచ దేశాల ప్రయత్నాలకు ఇది తోడ్పాటును అందిస్తుంది.
తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే క్లెయిము లను నిరోధించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తోంది. ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006 లేదా దాని కింద చేసిన నియమ నిబంధనల ప్రకారం 'హెల్త్ డ్రింక్' అనే పదాన్ని ఎక్కడా నిర్వచించనందున లేదా ప్రామాణీకరించనందున తొలగించాలని ఈ-కామర్స్ వెబ్‌సైట్లకు సలహాలు ఇస్తుంది. పునర్నిమించిన పండ్ల రసాల లేబుల్స్, ప్రకటనల నుండి '100% పండ్ల రసాల' క్లెయిమ్ ను తొలగించాలని అన్ని ఆహార వ్యాపార నిర్వాహకులను (ఎఫ్బిఓలు) ఆదేశిస్తుంది. గోధుమ పిండి/ శుద్ధి చేసిన గోధుమ పిండి అనే పదాన్ని ఉపయోగించడం, ఓఆర్ఎస్ ల ప్రకటన, మార్కెటింగ్ తో పాటు, పూర్వపదం లేదా అనుబంధాన్ని చేర్చడం, బహుళ-మూల వంట నూనెల కోసం పోషక పనితీరు క్లెయిమ్ లు మొదలైనవి. ఆహార వ్యాపార నిర్వాహకులు తప్పుదోవ పట్టించే క్లెయిమ్లను నిరోధించడానికి ఈ సలహాలు, ఆదేశాలు జారీ చేస్తారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు హాజరయ్యాయి. ఈ సమావేశంలో పారిశ్రామిక సంఘాలు, వినియోగదారు సంస్థలు, పరిశోధన సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(Release ID: 2031440)
Visitor Counter : 109