ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలోని 50 నగరాల్లోని 71 కేంద్రాల్లో 35,819 మంది అభ్యర్థుల కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షను నిర్వహించిన ఎన్‌బీఈఎంఎస్

Posted On: 06 JUL 2024 6:15PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్తి సంస్థ, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) 35,819 మంది అభ్యర్థులకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్షను (ఎఫ్ఎంజీఈ) నిర్వహించింది.


21 రాష్ట్రాల్లోని, 50 నగరాలలో 71 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్ష భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ఎన్‌బీఈఎంఎస్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు 250 మంది అప్రైజర్లను నియమించింది. 45 మంది అధ్యాపకులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్), కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఇతర సంస్థలు కూడా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఒక ఉన్నతాధికారిని నియమించాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, ఎన్‌బీఈఎంఎస్ నేడు నిర్వహించిన ఎఫ్‌ఎంజీఈ ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది.

***


(Release ID: 2031436) Visitor Counter : 71