కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023: కనెక్టివిటీలో కొత్త యుగానికి నాంది
చారిత్రాత్మకమైన మార్పు: శతాబ్దం నాటి వలసవాద పాలన చట్టాలకు స్వస్తి
ప్రగతి స్తంభాలు: సమావేశ్, సురక్ష, వృద్ధి మరియు త్వరిత్
Posted On:
05 JUL 2024 6:05PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం జూలై 04, 2024న టెలికమ్యూనికేషన్స్ చట్టం-2023లోని సెక్షన్ 6-8, 48 మరియు 59(బి)ని అమలు చేయడానికి గెజిటెడ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈరోజు అంటే, జూలై 05, 2024న అమలులోకి వస్తాయి.
టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 టెలికమ్యూనికేషన్ సేవలు, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల అభివృద్ధి, విస్తరణ, ఆపరేషన్‌కు సంబంధించిన చట్టాన్ని సవరించడం, ఏకీకృతం చేయడం, స్పెక్ట్రమ్ కేటాయింపు; దానితో అనుసంధానించిన విషయాల కోసం లక్ష్యంగా పెట్టుకుంది. టెలికమ్యూనికేషన్ చట్టం 2023 టెలికాం రంగం, సాంకేతికతలలో భారీ సాంకేతిక పురోగమనాల కారణంగా ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం 1885, ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం 1933 వంటి ప్రస్తుత శాసన విధాన చట్రాలను రద్దుకు కూడా అవకాశం కలుగుతుంది.
సమావేశ్ (చేర్పులు), సురక్ష (భద్రత), వృద్ధి (వృద్ధి), మరియు త్వరిత్ (స్పందనశీలత) సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఈ చట్టం వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) విజన్‌ను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది.
టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023, డిసెంబర్ 2023లో పార్లమెంట్ ఆమోదం పొందగా, డిసెంబర్ 24, 2023న భారత రాష్ట్రపతి ఆమోదం పొందింది. అదే రోజు అధికారిక గెజిట్‌లో ప్రచురితమైంది. చట్టంలోని సెక్షన్లు 1, 2, 10-30, 42-44, 46, 47, 50-58 , 61, 62 ఇప్పటికే జూన్ 26, 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఈ సవరణ భారత గెజిట్‌లో జూన్ 21, 2024 నాటి నోటిఫికేషన్ నెం.2408(ఈ)లో చూడవచ్చు.
జూలై 05, 2024 (ఈరోజు) నుండి అమలులోకి వచ్చిన సెక్షన్‌ల ముఖ్య విషయాలు:
- స్పెక్ట్రమ్ సరైన వినియోగం: సెకండరీ అసైన్‌మెంట్, షేరింగ్, ట్రేడింగ్, లీజింగ్, స్పెక్ట్రమ్ సరెండర్ వంటి ప్రక్రియల ద్వారా అరుదైన స్పెక్ట్రమ్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి శాసనం ఒక చట్టపరమైన విధాన నిర్దేశాన్ని అందిస్తుంది. ఇది అనువైన, సరళీకృత, సాంకేతిక తటస్థ పద్ధతిలో స్పెక్ట్రమ్ వినియోగాన్ని కూడా అనుమతిస్తుంది. ఇది నిర్దిష్ట ప్రయోజనం కోసం అమలు, పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది.
- టెలికమ్యూనికేషన్‌లను నిరోధించే పరికరాల వినియోగ నిషేధం: కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే టెలికమ్యూనికేషన్‌ను నిరోధించే ఏదైనా పరికరాలను ఉపయోగించరాదని చట్టాలు సూచిస్తున్నాయి.
- ట్రాయ్ చైర్‌పర్సన్, సభ్యులుగా నియామకం కోసం ప్రమాణాలు: చట్టంలోని సెక్షన్ 59(బి) ట్రాయ్ చట్టం 1997లోని సెక్షన్ 4 ను సవరిస్తుంది. ట్రాయ్ చైర్‌పర్సన్,సభ్యుల నియామకానికి సంబంధించిన ప్రమాణాలను నిర్దేశిస్తుంది.
తాజా నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఒక ప్రధాన అంశం ఏమిటంటే, స్పెక్ట్రమ్ వినియోగంలో సామర్థ్యాన్ని పెంచడం, సెకండరీ అసైన్‌మెంట్, షేరింగ్/ట్రేడింగ్ మొదలైన వాటిని సాధించే వివిధ పద్ధతులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడం ముఖ్యం.
***
(Release ID: 2031277)
Visitor Counter : 138