ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఢిల్లీ పోలీస్ సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ అఫెన్స్, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సిఈఐబి), ఇంటెలిజెన్స్ బ్యూరో, సైబర్ సెల్, ఢిల్లీ పేర్లు, సంతకాలు, స్టాంపులు, లోగోలతో కూడిన నకిలీ, మోసపూరిత ఇ-మెయిల్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పిల్లల అశ్లీలత, పెడోఫిలియా, సైబర్ అశ్లీలత, లైంగిక అసభ్యకరమైన ప్రదర్శన, గ్రూమింగ్ మొదలైనవాటిని చూపుతూ సంభావ్య బాధితుపై అపవాదాలు, ఆరోపణలు చేస్తున్న నకిలీ లేఖ
प्रविष्टि तिथि:
04 JUL 2024 5:01PM by PIB Hyderabad
సైబర్ క్రైమ్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. సాధారణ ప్రజలను భయపించి, ఆందోళనకు గురిచేసేలా అనేక పద్ధతులు అవలంబిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. పలువురిని మోసం చేసేందుకు మోసగాళ్లు పలు నకిలీ, మోసపూరిత ఈ-మెయిల్స్‌ను సర్క్యులేట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఇటువంటి నకిలీ ఇమెయిల్‌లుకి జత చేసి ఉన్న లేఖలో శ్రీ సందీప్ ఖిర్వార్, ఏడిజి, సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ అఫెన్స్, ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, న్యూ ఢిల్లీ, అలాగే శ్రీ అనుపమ్ ప్రకాష్, జాయింట్ సెక్రటరీ (కోఫెపోసా), సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క సంతకాలు ఉన్నాయి. (సిఈఐబి),ఇంటెలిజెన్స్ బ్యూరో, సైబర్ సెల్, న్యూ ఢిల్లీ స్టాంపులు, లోగోలతో ఉన్నాయి.
ఈ లేఖలో పిల్లల అశ్లీలత, పెడోఫిలియా, సైబర్ అశ్లీలత, లైంగిక అసభ్యకరమైన ప్రదర్శన, గ్రూమింగ్ మొదలైన వాటిని ఆ ఇ-మెయిల్‌ల రిసీవర్లకు ఆపాదిస్తూ ఆరోపణలు ఉన్నాయి. అటాచ్‌మెంట్‌తో పైన పేర్కొన్న నకిలీ ఇ-మెయిల్‌లను పంపడానికి మోసగాళ్లు వేర్వేరు ఇ-మెయిల్ చిరునామాలను ఉపయోగించారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల సూచన కోసం నకిలీ లేఖ కాపీ, క్రింద ఇవ్వడం జరిగింది. అటువంటి ఇ-మెయిల్‌ను స్వీకరించేవారు ఈ మోసపూరిత ప్రయత్నాలను గమనించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటాచ్‌మెంట్‌తో కూడిన అటువంటి ఇ-మెయిల్‌లకు ప్రతిస్పందించకూడదని, అలాంటి కేసులను సమీప పోలీస్ స్టేషన్/సైబర్ పోలీస్ స్టేషన్‌లో నివేదించవచ్చని సాధారణ ప్రజలకు తెలియజేస్తున్నారు.

***
(रिलीज़ आईडी: 2030868)
आगंतुक पटल : 784