సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

అడ్వాన్స్ డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీఏ) స్వర్ణోత్సవాల్లో రక్షణ, వాయు, నావిక దళాలు, సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన ఐఐపీఏ చైర్మన్ డా. జితేంద్ర సింగ్


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, పరిపాలనలో నియమ ఆధారిత విధానం నుండి పాత్ర ఆధారిత విధానానికి మారడంపై దృష్టి సారించామన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 02 JUL 2024 7:21PM by PIB Hyderabad

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ) ప్రాంగణంలో జరుగుతున్న అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీఏ) స్వర్ణోత్సవాల వేడుకల్లో రక్షణ, వాయు, నావిక దళాలు, సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులతో ఐఐపీఏ చైర్మన్ డాక్టర్ జితేంద్ర సింగ్ సమావేశమయ్యారు.

అడ్వాన్స్‌డ్ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏపీపీఏ) అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అందించే 10 నెలల కోర్సు, ఇది డాక్టర్ జితేంద్ర సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అఖిల భారత సర్వీసులు, రక్షణ రంగ అధికారులు, కేంద్ర సర్వీసులకు చెందిన ఉన్నతాధికారులు భారత ప్రభుత్వంలో ఉపకార్యదర్శి/ సంచాలకులు లేదా అంతకంటే ఎక్కువ/సమాన హోదాలో ఉన్న అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారికి పంజాబ్ విశ్వవిద్యాలయం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని ప్రదానం చేస్తుంది. ఐఐపీఏ 1975 నుంచి ఈ కోర్సును నిర్వహిస్తోంది.

ఎపిపిఎ సర్ణోత్సవాలను ఉద్దేశించి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యులు), ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యులు), పిఎంఓ, అణు శక్తి విభాగం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ సమావేశంలో భాగం కావడంపై పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశించిన విధంగా భవిష్యత్తును సిద్ధం చేయడానికి ప్రభుత్వానికి సేవలందిస్తున్న అధికారులకు అందించే అడ్వాన్స్‌డ్ కోర్సులు కీలకమని ఆయన అన్నారు. ప్రభుత్వోద్యోగుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.., సిబ్బంది పరివర్తనను, సామర్థ్యాన్ని పెంపు కోసం,  నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి 'మిషన్ కర్మయోగి' ప్రారంభించామని మంత్రి తెలిపారు. సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు నేర్చుకోవడాన్ని నిత్య విద్యార్థిగా ఉంటూ, సాధనను కొనసాగిస్తూ, తోటివారి అభ్యసనను కూడా ప్రోత్సహించాలని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా తాను కూడా ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.

డా. జితేంద్ర సింగ్ ఏపీపీఏపై మాట్లాడుతూ.. అమృత్ కాల్ లో 2047 నాటి సవాళ్లకు ప్రతిస్పందించడానికి అవసరమైన సామర్థ్యాలతో అధికారులను సన్నద్ధం చేయడానికి మిషన్ కర్మయోగి ఫ్రేమ్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. సరైన దృక్పథాన్ని, నైపుణ్యాలను, జ్ఞానాన్ని అందించడం, ప్రజా కేంద్రీకృత పాలన విధానాన్ని అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రజాసేవలో తన అనుభవాన్ని, సుపరిపాలనపై విజ్ఞతను డాక్టర్ జితేంద్ర సింగ్ సమావేశంలో పంచుకున్నారు. పౌరుల సాధికారత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పాలనలో నియమ ఆధారిత విధానం నుండి పాత్ర ఆధారిత విధానానికి మారడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కమ్యూనికేషన్, మానవ సంబంధ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పాల్గొనేవారికి ఆయన మార్గనిర్దేశం చేశారు. తీవ్రవాదం, దాని ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా పాలనాధికారి, రక్షణ శాఖ అధికారి సంయుక్త సహకారంతో ముందుకెళ్తున్న ప్రాంతాలను ప్రస్తావిస్తూ మంత్రి సమావేశంలో పాల్గొన్నవారితో పంచుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారం, భవిష్యత్తులో అవసరమైన అభివృద్ధి నమూనాలకు మార్గనిర్దేశం చేయడానికి సూచీల అభివృద్ధి ద్వారా పరిపాలన చేస్తున్నట్లు, ప్రభుత్వ విధానాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రధానంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో శరవేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారులను అభివృద్ధి చేసేందుకు పరిపాలనా సంస్కరణల శాఖ విజన్ డాక్యుమెంట్ తో పాటు సామర్థ్యాన్ని పెంపొందించే కమిషన్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉండాలని, కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఏదేమైనా, మానవ జోక్యం ఎల్లప్పుడూ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కారం తర్వాత పరిష్కరించబడిన కేసుల ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి హ్యూమన్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పరిపాలనలో దేశ నైపుణ్యం గురించి మంత్రి ప్రస్తావిస్తూ, "భూసంస్కరణల పరంగా 'స్వామిత్వ' కార్యక్రమం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది" అని అన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ భవిష్యత్తుకు ఒక గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని భవిష్యత్తులో వాటిని ప్రవేశపెడతామని డా. జితేంద్ర సింగ్ హామీ ఇచ్చారు.

ఐఐపీఏ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్.ఎన్.త్రిపాఠి మాట్లాడుతూ, మంత్రి నిరంతర మార్గదర్శకత్వం, చురుకైన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అనేక సానుకూల చర్యలకు మద్దతు ఇచ్చారని ఆయన చెప్పారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) జాయింట్ సెక్రటరీ (ట్రైనింగ్) డాక్టర్ నీలా మోహనన్ మాట్లాడుతూ, ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడానికి శాఖకు మార్గనిర్దేశం చేసినందుకు డాక్టర్ జితేంద్ర సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ. అమితాబ్ రంజన్, ఐఐపీఏ రిజిస్ట్రార్, ప్రొఫెసర్ నీతూ జైన్, డాక్టర్ సాకేత్ బిహారీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రక్షణ, వాయు, నావిక దళాలు, సివిల్ సర్వీసులకు చెందిన 30 మంది ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

***



(Release ID: 2030341) Visitor Counter : 33