ఆయుష్

సీసీఆర్ఏఎస్-సీఎస్ఎంసీఏఆర్ఐ, చెన్నైలోని సీఐఎం&హెచ్ మధ్య అవగాహన ఒప్పందం


ప్రామాణీకీకరణపై పరిశోధన అధ్యయనాలు విషయంలో నైపుణ్య శిక్షణతో పాటు టెస్టింగ్ సర్వీసెస్‌కు సంబంధించి కుదిరి ఎంఓయూ

Posted On: 30 JUN 2024 2:44PM by PIB Hyderabad

ఇండియన్ మెడిసిన్, హోమియోపతి రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన పరిణామమైన భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ - చెన్నైలోని కెప్టెన్ శ్రీనివాస మూర్తి సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఏఆర్ఐ).. కమిషనరేట్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి (సీఐఎం&హెచ్) మధ్య ఈ రోజు తమిళనాడు, చెన్నైలోని ఆరుంబాక్కంలో అవగాహన ఒప్పందం (ఎంఓయు) కుదిరింది.

2024 జూన్ 29న గిండీలోని కలైంజ్ఞర్ సెంటినరీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో తమిళనాడు గౌరవ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి  ఎంఏ. సుబ్రమణియన్… ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్ అధికారి శ్రీ గగన్ దీప్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.

"ఎంచుకున్న ఉన్నత శ్రేణి ఔషధాల తయారీకి సంబంధించి విషపూరిత అధ్యయనంపై మూల్యాంకనం, ప్రామాణీకీకరణపై పరిశోధన అధ్యయనాలు” పై టెస్టింగ్ సర్వీసెస్, నైపుణ్య శిక్షణ, సహాకార ప్రాజెక్ట్‌ను అమలు చేయటానికి సహాకార ఫ్రేమ్‌వర్క్‌ను ఈ ఎంఓయూ అందిస్తుంది.

ఈ ఎంఓయూ ప్రాథమిక లక్ష్యాలు:

  • మెడిసిన్ ప్రామాణీకీకరణ చేసేందుకు ఎంపిక చేసిన ముడి ఔషధాలు, పూర్తైన ఉత్పత్తుల టెస్టింగ్ చేపట్టడం

  • సీఐఎం&హెచ్ ప్రయోగశాలకు ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ ట్రైనింగ్‌పై మార్గదర్శకత్వం(గైడెన్స్) అందించటం

  • ఎంఓయూలో భాగంగా ఆమోదించిన ప్రతిపాదన, నిబంధనలు, షరతులు, పరిశోధన విధానంపై సీసీఆర్ఓఎస్ మార్గదర్శకాలు ప్రకారం "ఎంచుకున్న ఉన్నత శ్రేణి ఔషధాల తయారీకి సంబంధించి విషపూరిత అధ్యయనంపై మూల్యాంకనం, ప్రామాణీకరణపై పరిశోధన అధ్యయనాలు” అనే అంశంపై భాగస్వామ్యంలో పరిశోధన ప్రాజెక్ట్ చేయట్టడం
     

‘సీసీఆర్ఏఎస్, సీఐఎం&హెచ్ మధ్య జరిగిన ఈ ఎంఓయూ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చింది. ఆయా రాష్ట్రాలు ముందుకు వచ్చి వివిధ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల కోసం సీసీఆర్ఏఎస్, ఆయూష్ మంత్రిత్వ శాఖతో చేతులు కలపవచ్చు’ అని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ రబీనారాయణ్ ఆచార్య తెలిపారు.  

 

ప్రముఖ సంస్థల మధ్య సహకార ప్రయత్నాలను బలోపేతం చేసే దిశగా ఈ అవగాహన ఒప్పందం ఒక ముఖ్యమైన పరిణామం. ఈ ఒప్పందం ఫలితాలుగా అంచనా వేస్తున్న వాటిలో కొన్ని:

  • మెరుగైన నాణ్యత, భద్రత: కఠినమైన టెస్టింగ్, ప్రామాణీకీకరణ ప్రోటోకాల్స్ ఆయుర్వేద, హోమియోపతి మందుల అధిక నాణ్యత, భద్రతను నిర్ధారిస్తాయి. ఇది ప్రాక్టీషనర్లు, రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

  • ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు: ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ ట్రైనింగ్ వల్ల సీఐఎం&హెచ్ ప్రయోగశాల సామర్థ్యాలు మెరుగుపడతాయి, అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది.

  • భాగస్వామ్య పరిశోధన కార్యక్రమాలు: ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులు ఎంపిక చేసిన ఉన్నత-శ్రేణి మందుల విషపూరితతను అంచనా వేయడం, శాస్త్రీయ సమాజానికి విలువైన డేటాను అందించడం.. ఈ చికిత్సల భద్రత, సామర్థ్యాన్ని నిర్ధారించడంపై దృష్టి పెడతాయి.

  • సామర్థ్య పెంపుదల, విజ్ఞాన మార్పిడి: ఈ భాగస్వామ్యం కొనసాగుతున్న విజ్ఞాన మార్పిడి, సామర్థ్య పెంపును ప్రోత్సహిస్తుంది. భారతీయ వైద్యం, హోమియోపతిలో సృజనాత్మకత, శ్రేష్టతను ప్రోత్సహించే సహకార వాతావరణాన్ని పెంపొందిస్తుంది.

***



(Release ID: 2029846) Visitor Counter : 15