యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఆసియా క్రీడల్లో యోగాను చేర్చాలని కోరిన ఐఓఏ(ఇండియన్ ఒలంపిక్ అసోషియేషన్) ఐఓఏ విజ్ఞప్తికి కేంద్ర క్రీడాశాఖ మంత్రి మద్దతు
Posted On:
28 JUN 2024 9:45PM by PIB Hyderabad
ఆసియా క్రీడా పోటీల్లో యోగాను చేర్చాలని భారతీయ ఒలంపిక్ సంఘం ( ఐఓఏ) అధ్యక్షురాలు డాక్టర్ పిటి ఉష అభ్యర్థించారు. ఆమె అభ్యర్థనను కేంద్ర క్రీడాశాఖ మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయా స్వాగతించారు. యోగాకు ప్రజాదరణ వుంది అని అది క్రీడాపోటీల్లో భాగం కాగలదని ఆసియా క్రీడాపోటీట్లో వుండాలని ఆయన అన్నారు.
ఆసియా క్రీడాపోటీల్లో యోగాను భాగం చేయాలని ఆసియా ఒలంపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ రాజా రణధీర్ సింగ్ కు ఈ నెల 26న ఐఓఏ అధ్యక్షురాలు ప్రతిపాదన పంపారు.
ఈ ప్రతిపాదనను సమర్థిస్తూ మాట్లాడిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి యోగా ప్రాచుర్యంకోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేసిన కృషిని వివరించారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించడంకోసం ప్రధాని గట్టిగా కృషి చేశారని అన్నారు. యోగా ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందని అది తనదైన నియమ నిబంధనలతో పోటీ క్రీడగా రాణించగలదని ఆయన అన్నారు.
యోగాకు ప్రజాదరణ పెంచడంలో బారతదేశం కీలకంగా పని చేస్తోందని, ఖేలో ఇండియాలో యోగాను చేర్చి విజయం సాధించామని ఆయన అన్నారు. యోగాను తమ జీవితంలో భాగం చేసుకున్నవారి సంఖ్య రాను రానుపెరుగుతోందని కాబట్టి ఈ అంశాన్ని జాతీయ క్రీడల నిర్వాహకులు గుర్తించి తమ పోటీల్లో భాగం చేశారని ఆయన అన్నారు.
యోగాను ప్రోత్సహించడానికిగాను కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆరోగ్యకరమైన జీవనంకోసం ప్రతి రోజూ యోగా చేయాలని చెబుతూనే దీన్ని పోటీ క్రీడగా తీర్చిదిద్దుతోంది. యోగాసనాల్ని పోటీ క్రీడగా అభివృద్ధి చేస్తున్న యోగాసన భారత్ సంస్థకు కేంద్ర క్రీడాశాఖ గుర్తింపునిచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఖేలో ఇండియా యువ క్రీడలు, ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడాల్లో పోటీ క్రీడగా చేర్చడంద్వారా యోగాను ప్రోత్సహిస్తున్నారు.
ప్రపంచ యోగాసన సంస్థ ద్వారా గుర్తింపు పొందిన ఆసియన్ యోగాసన సంస్థ ఇప్పటికే ఆసియా ఒలంపిక్ కౌన్సిల్ కు లేఖ రాసి తమ సంస్థను భాగస్వామి చేయాలని అభ్యర్థించింది. తద్వారా ఆసియా ఖండమంతా యోగాను పోటీ క్రీడగా తీర్చిదిద్దవచ్చని తన లేఖలో తెలిపింది.
***
(Release ID: 2029481)
Visitor Counter : 81