ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర ప్రభుత్వ (2024-25) పద్దులపై 2024 మే నెల వరకూ నెలవారీ సమీక్ష

Posted On: 28 JUN 2024 5:17PM by PIB Hyderabad

   ‘‘కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 2024 మే నెల వరకూ నెలవారీ పద్దుల సమన్వయం, నివేదిక వెల్లడి ప్రక్రియ పూర్తయింది. ముఖ్యాంశాలు కిందివిధంగా ఉన్నాయి:-

   కేంద్ర ప్రభుత్వానికి 2024 మే నెల వరకూ రాబడి వసూళ్లు 5,72,845 కోట్లుగా (మొత్తం వసూళ్ల పరంగా 2024-25 బడ్జెట్ అంచనాల్లో 18.6 శాతం) నమోదయ్యాయి. ఇందులో 3,19,036 కోట్లు (కేంద్ర నికర) పన్ను రాబడి కాగా, పన్నేతర రాబడి 2,51,722 కోట్లు, రుణ వసూళ్ల కింద 2,087 కోట్లు బకాయేతర మూలధన రాబడి కూడా కలిసి ఉంది. ఈ మొత్తం వసూళ్ల నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రస్తుత కాలావధి వాటా కింద కేంద్ర ప్రభుత్వం 1,39,751 కోట్లు బదిలీ చేసింది. మునుపటి సంవత్సర కాలావధి మొత్తంతో పోలిస్తే ఇది 21,471 కోట్లు అధికం.

   ఇదే కాలావధికిగాను కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం 6,23,460 కోట్లుగా (2024-25 బడ్జెట్ అంచనాల్లో 13.1 శాతం) నమోదైంది. ఇందులో 4,79,835 కోట్లు రాబడి వ్యయం కాగా, 1,43,625 కోట్లు మూలధన వ్యయం. మొత్తం రాబడి వ్యయంలో, 1,23,810 కోట్ల మేర వడ్డీ చెల్లింపుల ఖాతా సంబంధితం కాగా, 54,688 కోట్లు ప్రధాన సబ్సిడీల ఖాతా కింద చెల్లించింది.

***


(Release ID: 2029479) Visitor Counter : 219