బొగ్గు మంత్రిత్వ శాఖ
గత దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో క్షీణించిన బొగ్గు దిగుమతి
Posted On:
28 JUN 2024 7:22PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా ఐదో అతిపెద్ద బొగ్గు నిల్వలతో ఉన్న భారత్, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో బొగ్గు వినియోగం విషయంలో రెండో స్థానంలో ఉంది.
మొత్తం బొగ్గు వినియోగం విషయంలో భారత్ నిల్వల్లో కోకింగ్ బొగ్గు, హై గ్రేడ్ థర్మల్ బొగ్గు అందుబాటులో లేకపోవడం వల్ల ఉక్కు వంటి పరిశ్రమల అవసరాలను తీర్చడానికి దిగుమతులు అవసరమవుతున్నాయి. అయితే దేశీయంగా మీడియం, లో గ్రేడ్ గల థర్మల్ బొగ్గు పుష్కలంగా లభిస్తుండటంతో దేశీయ డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది.
గత దశాబ్దకాలంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ధోరణిని కనబరుస్తున్నాయి. 2004-05 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరం వరకు బొగ్గు ఉత్పత్తిలో సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) కేవలం 4.44 శాతమే కావడం గమనార్హం. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ఈ సంఖ్య 5.63 శాతానికి పెరిగింది.
2004-05 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరం వరకు బొగ్గు దిగుమతుల సీఏజీఆర్ 21.48 శాతంగా ఉండగా, 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు బొగ్గు దిగుమతుల సీఏజీఆర్ 2.49 శాతంగా ఉంది.
2004-05 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-14 వరకు దిగుమతి చేసుకున్న బొగ్గు వాటా సీఏజీఆర్ 13.94 శాతంగా ఉండగా, అదే సంఖ్య ప్రస్తుతం -2.29 శాతానికి పడిపోయింది.
భారత్, స్వదేశీ బొగ్గు వనరులను అనుకూలపరచడం, వినూత్న సాంకేతిక పరిష్కారాలను కనుకొనడంపై వ్యూహాత్మక దృష్టి పెట్టి, దేశ ఇంధన భద్రతలో స్వావలంబన లేదా ఆత్మనిర్భరత వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
***
(Release ID: 2029474)
Visitor Counter : 79