అంతరిక్ష విభాగం

గ్రామీణ భూ రికార్డుల కోసం 'భువన్ పంచాయత్ (వెర్షన్ 4.0)' పోర్టల్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసిన "నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ (ఎన్డిఇఎం వెర్షన్ 5.0)" అనే రెండు జియోపోర్టల్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్


గత దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన సంస్కరణలకు కొనసాగింపుగా ఈ పోర్టల్స్ ను ప్రారంభించినట్లు తెలిపిన కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్

"వికేంద్రీకృత ప్రణాళిక కోసం అంతరిక్ష ఆధారిత సమాచార మద్దతు (ఎస్ఐఎస్డిపి)" కు ఆలంబన ఇవ్వడానికి, పంచాయతీల్లో అట్టడుగు స్థాయిలో పౌరులకు సాధికారత కల్పించడానికి భువన్ పంచాయతీ పోర్టల్ ప్రారంభించడం జరిగింది.

భారత్‌తో పాటు పొరుగు దేశాలలో ప్రకృతి వైపరీత్యాలపై అంతరిక్ష ఆధారిత సమాచారాన్ని అందించడానికి, విపత్తు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడేందుకు నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ (ఎన్డిఇఎం వెర్షన్ 5.0) ఉపయోగపడుతుంది.

Posted On: 28 JUN 2024 7:51PM by PIB Hyderabad

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసిన 'భువన్ పంచాయత్ (వెర్షన్ 4.0)' పోర్టల్, 'నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ (ఎన్డీఈఎం వెర్షన్ 5.0)' అనే రెండు జియోపోర్టల్లను కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ నేడు పృథ్వీ భవన్‌లో ప్రారంభించారు.

ఈ తాజా జియోస్పేషియల్ సాధనాలు విజువలైజేషన్, ప్రణాళిక కోసం ఉద్దేశించినవి. ఇవి దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల 1:10 కె స్కేల్ హై రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలను అందించనున్నాయి.

"గత దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంస్కరణలకు కొనసాగింపుగానే ఈ పోర్టల్స్ ప్రారంభం" అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), పిఎంఓ, అణు శక్తి విభాగం, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి మరియు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల సహాయ మంత్రి డా. జితేంద్ర సింగ్ తెలిపారు. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రారంభమైన ఈ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ..., 2015-16 ప్రారంభంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రణాళిక, విపత్తు ప్రమాదాల తగ్గింపు, భూ రికార్డుల నిర్వహణ, వాతావరణ అంచనా, వ్యవసాయాభివృద్ధి కోసం అంతరిక్ష సాంకేతిక అనువర్తనాలపై మేధోమథనం జరిగింది.

జియోపోర్టల్స్ ప్రారంభిస్తున్న సందర్భంగా ఇస్రో బృందాన్ని అభినందించిన మంత్రి "మనం రాకెట్లతో ఆకాశానికి చేరుకోవడమే కాదు.., ఆకాశం నుండి భూమిని మ్యాపింగ్ చేస్తున్నాం" అని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి మాట్లాడుతూ "అంతరిక్ష సాంకేతికత దాదాపు ప్రతి ఇంట్లోకి ప్రవేశించింది. అంతరిక్ష సాంకేతికత పితామహుడు శ్రీ విక్రమ్ సారాభాయ్ దార్శనికతను మనం సక్రమంగా ముందుకు తీసుకెళ్తున్నాం. టెలీ మెడిసిన్, డిజిటల్ ఇండియా, మానవ రహిత రైల్వే క్రాసింగ్‌లను గుర్తించడం వంటి అంశాల్లో అంతరిక్ష అభివృద్ధి సామాన్యుల జీవితంపై బహుముఖ ప్రభావాన్ని చూపుతోంది" అని మంత్రి తెలిపారు.

వివిధ సేవల ఏకీకృతం, తద్వారా దాని నుండి సాధారణ పౌరులు ప్రయోజనం పొందడానికి అనుమతించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని డా. జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. గత కొన్నేళ్లలో మోదీ ప్రభుత్వ విధాన నిర్ణయాల ఫలితంగా అంతరిక్ష రంగం ప్రైవేటు భాగస్వామ్యానికి తెరతీసిందని, 2022లో ఒక అంకుర సంస్థ నుంచి 2024 నాటికి 200కు పైగా అంకుర సంస్థల ఏర్పాటుకు సానుకూల ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్ ప్రయోగ సమయంలో, అంతరిక్ష రంగంలో భారత్ సత్తాను ప్రజలు వీక్షించేందుకు శ్రీహరికోటకు అనుమతించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. అంతరిక్ష రంగంలో దాదాపు రూ.1000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయని మంత్రి చెప్పారు.

'స్పేస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఫర్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ (ఎస్ఐఎస్డీపీ)'కు మద్దతు ఇవ్వడానికి, పంచాయతీల్లో అట్టడుగు స్థాయిలో పౌరులకు సాధికారత కల్పించడానికి 'భువన్ పంచాయతీ పోర్టల్' ప్రాముఖ్యతను మంత్రి తెలిపారు. భూ రికార్డుల కోసం స్థానిక పరిపాలనపై ఆధారపడాల్సిన అవసరాన్ని తగ్గించడం ద్వారా జీవన సౌలభ్యాన్ని పొందేందుకు, డిజిటలైజేషన్, ల్యాండ్ రెవెన్యూ నిర్వహణ ద్వారా భూ రికార్డులలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, క్షేత్రస్థాయిలో పౌరులకు సాధికారత కల్పించడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సాధనాల ద్వారా పౌరులకు రియల్ టైమ్ డేటాను అందించడంతో పాటు క్షేత్రస్థాయిలో అవినీతిని తగ్గిస్తాయి.

నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ (ఎన్డిఇఎం వెర్షన్ 5.0) ప్రయోజనాల గురించి మాట్లాడుతూ.., భారతదేశంతో పాటు పొరుగు దేశాలలో ప్రకృతి వైపరీత్యాలపై అంతరిక్ష ఆధారిత సమాచారాన్ని అందించడం విపత్తు ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుండి పౌరులను కాపాడటం, విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనడం, భూ వినియోగ భూమార్పు (ఎల్‌యూఎల్‌సీ) గురించి తెలియజేయడానికి సమర్థవంతమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడానికి, విలువైన సమాచారం అందించడానికి కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భూరికార్డులు, ల్యాండ్ రెవెన్యూ నిర్వహణ పరంగా అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచే స్వామిత్వ పోర్టల్ లాగానే ఈ పోర్టల్స్ కూడా ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ నిరంతర మార్గదర్శకత్వం, నాయకత్వానికి ఇస్రో చైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి శ్రీ. ఎస్ సోమనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ వివేక్ భరద్వాజ్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, శ్రీ రవి చంద్రన్ ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి, శ్రీ ఎస్‌కే జిందాల్ అదనపు కార్యదర్శి, హోం మంత్రిత్వ శాఖ, ఎస్. రాజేష్, ఫారెస్ట్ ఐజీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, మనీష్ కే. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జీఎస్ఐ మైన్స్, డాక్టర్ ప్రకాశ్ చౌహాన్, డైరెక్టర్ ఎన్ఆర్ఎస్‌సీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***



(Release ID: 2029472) Visitor Counter : 36