కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలికమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (తొమ్మిదవ సవరణ) నిబంధనలు, 2024 జూలై 01 నుండి అమల్లోకి.

Posted On: 28 JUN 2024 8:02PM by PIB Hyderabad

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), 14 మార్చి, 2024 న టెలికమ్యూనికేషన్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ (తొమ్మిదవ సవరణ) నిబంధనలు, 2024ని జారీ చేసింది, ఇది జూలై 1, 2024 నుండి అమల్లోకి వస్తుంది.

మోసపూరితంగా సిమ్ స్వాప్/రీప్లాస్‌మెంట్ కి పాల్పడే నీతి నియమాలు లేని వ్యక్తుల ద్వారా జరిగే మొబైల్ నంబర్‌ల పోర్టింగ్‌ను అరికట్టడం ఈ సవరణ నిబంధనల ఉద్దేశం. ఈ సవరణ నిబంధనల ద్వారా, ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (యుపిసి) కేటాయింపు కోసం అభ్యర్థనను తిరస్కరించడానికి అదనపు ప్రమాణం ప్రవేశపెట్టారు. ప్రత్యేకంగా, సిమ్ స్వాప్/రీప్లేస్‌మెంట్ తేదీ నుండి ఏడు రోజుల గడువు ముగిసే లోపు యుపిసి కోసం అభ్యర్థన చేసినట్లయితే, యుపిసి కేటాయించరు. 

ఏదైనా స్పష్టత/సమాచారం కోసం, ట్రాయ్ సలహాదారు (నెట్‌వర్క్, స్పెక్ట్రమ్ & లైసెన్సింగ్) శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేదిని,,టెలిఫోన్ నంబర్ +91-11-20907758లో సంప్రదించవచ్చు.

***


(Release ID: 2029470) Visitor Counter : 138