ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

అత్యవసర పరిస్థితి ని విధించడం ప్రపంచం లో కెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని చీకటి లోకి నెట్టివేసిందన్న ఉప రాష్ట్రపతి


అత్యవసర పరిస్థితి రోజులు మరి ఎన్నటికీ తిరిగి రావు, భారతదేశం లో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం యొక్క పునాదిబలం గా ఉందని స్పష్టం చేసిన ఉప రాష్ట్రపతి

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు మిని రత్న హోదాను ఇవ్వడమైంది

నష్టాల లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ కాస్తా మిని రత్న  వ్యాపార సంస్థ గా సిఇఎల్ ఎదగడాన్ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి

అధ్యయనం చేయదగ్గ నమూనా గా సిఇఎల్ యొక్క సాఫల్యం ఉంది, ఇతరులు దీని సఫలత నుండి ప్రేరణ ను పొందదగినటువంటిఆదర్శప్రాయమైన నమూనా ఇది:  ఉప రాష్ట్రపతి

న్యూ ఇండియా కు వెన్నుముక మరియు వాస్తు శిల్పులుఎవరంటే అది శాస్త్రవేత్తలు మరియు టెక్నాలజిస్టులే: ఉప రాష్ట్రపతి

నవీకరణ యోగ్య శక్తి ఒక ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, అది భవిష్యత్తువనరు; సౌర శక్తి రంగం లో అసాధారణమైన ముందడుగుల ను వేసినందుకు గాను సిఇఎల్ నుప్రశంసించిన ఉప రాష్ట్రపతి

బ్యాటరీ సంబంధి సాంకేతికత లను మరియు చార్జింగ్ సంబంధిమౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం కోసం పరిశోధన జరగాలంటూ పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి

సెంట్రల్ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సిఇఎల్) యొక్క స్వర్ణోత్సవ వేడుకల ను ఉద్దేశించిప్రసంగించిన ఉప రాష్ట్రపతి

Posted On: 26 JUN 2024 7:38PM by PIB Hyderabad

అత్యవసర పరిస్థితి ని 1975 వ సంవత్సరం లో విధించిన కారణం గా ప్రపంచం లో అతి పెద్ద ప్రజాస్వామ్యం అంధకారం లో మునిగిపోయింది అని ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఈ రోజు న అన్నారు. అత్యవసర పరిస్థితి తాలూకు చీకటి రోజుల ను శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ గుర్తు కు తీసుకు వస్తూ ఆ రోజులు మరెన్నటికీ పునరావృత్తం కావు, దీనికి కారణం భారతదేశం లో రాజ్యాంగయుక్త ప్రజాస్వామ్యం చాలా బలం గా ఉండడమే; మరి ఇప్పుడు గ్రామ స్థాయి లో, రాష్ట్ర స్థాయి లో మరియు కేంద్రం స్థాయి లో రాజ్యాంగం పరంగా ప్రజాస్వామ్యం సుదృఢం గా ఉన్నది అని వివరించారు.

 

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సిఇఎల్) స్వర్ణోత్సవ వేడుకల లో శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ పాలుపంచుకొని సభ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, దేశం లో శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక విజ్ఞానవేత్తలు పోషిస్తున్నటువంటి పాత్ర ను ప్రస్తావించారు. వారు న్యూ ఇండియాయొక్క నిర్మాతలు అని ఆయన అభివర్ణించారు. సిఇఎల్ మునుపు నష్టాల బారిన పడ్డ ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్‌యు); పెట్టుబడుల ఉపసంహరణ కొస వరకూ వెళ్ళిపోయింది కాస్తా తాజా గా మిని రత్న స్థాయి ని అందుకొంది. ఈ మేలు మలుపు హర్షణీయం అని ఉప రాష్ట్రపతి అన్నారు. సిఇఎల్ ఇతర సంస్థల కు శక్తి ని పుంజుకోవడానికి , స్వీయ ప్రేరణ ను పొంది ఆయా సంస్థ లు కూడా ఇదే కోవ లో వృద్ధి చెందేందుకు ఆదర్శప్రాయం అయినటువంటి నమూనా గా ఉంది అని ఉప రాష్ట్రపతి చెప్పారు.

 

 

‘‘ఈ కథ ఒక్క సాంకేతిక పరమైన ముందంజ మాత్రమే కాదు, ఇది జీవనం లో పరివర్తన ను తీసుకు రావడం, సముదాయాల సశక్తీకరణ, ఇంకా వినూత్న ఆవిష్కరణలు, ఆటుపోటుల కు తట్టుకొని నిలబడగలగడం మరియు ఉత్కృష్ట సాధన ల మార్గం లో సాగిపోతూ మన దేశం యొక్క వ్యూహాత్మక హితాల ను పరిరక్షిస్తూ ఉండడానికి సంబంధించింది కూడాను’’ అని ఆయన అన్నారు.

 

 

సౌర శక్తి రంగం లో సిఇఎల్ సాధించినటువంటి అసాధారణమైన పురోగతి ని గురించి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ చెప్తూ, నవీకరణ యోగ్య శక్తి కేవలం ఒక ప్రత్యామ్నాయం కాదు, అది భవిష్యత్తు వైపునకు నడిపించేది అన్నారు. ‘‘సుస్థిర శక్తి సంబంధి పరిష్కార మార్గాల పైన సిఇఎల్ తన దృష్టి ని కేంద్రీకరిస్తూ హరిత ప్రధానమైనటువంటి మరియు స్వచ్ఛమైనటువంటి భారతదేశం ఆవిష్కారాని కి తన తోడ్పాటు ను అందిస్తున్నది. సిఇఎల్ యొక్క నూతన ఆవిష్కరణలు చిరకాలం మన్నిక తో ఉండేటటువంటి శక్తి సంబంధి సమాధానాల ను సామాన్య మానవుని కి చేరువ గా తీసుకు వచ్చాయి’’ అని ఆయన అన్నారు. బ్యాటరీ సంబంధి సాంకేతికతల ను అభివృద్ధి పరచడం కోసం, మరి అలాగే దేశం లో హరిత ప్రధానమైన గతిశీలత ను ప్రోత్సహించడం కోసం చార్జింగ్ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన దిశ లో పరిశోధన లను ప్రోత్సహించాలి అని కూడా ఆయన పిలుపునిచ్చారు.

 

 

ఎలక్ట్రానిక్ యుద్ధతంత్ర మెలకువ లు, కృత్రిమ మేధ (ఎఐ), సైనిక దృష్టి లో భూపరిశీలన, మరియు నిశిత పర్యవేక్షణ ల అండదండల తో భద్రత సంబంధి ముఖచిత్రం పలుమార్పుల కు లోనవుతున్న సంగతి ని శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ నొక్కిపలుకుతూ, జాతీయ హితాల సురక్ష లో సిఇఎల్ కు ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని గురించి ప్రముఖం గా ప్రకటించారు. ‘‘ఇంతవరకు ఉన్న వ్యవస్థ లో పెను మార్పుల ను ప్రవేశపెట్టిన ఈ కోవ కు చెందిన సాంకేతికత లు అన్నిటికీ ఎలక్ట్రానిక్స్ యే గుండెకాయ లా ఉంది. ఎలక్ట్రానిక్స్ యే ఏ భావి కాలపు సాంకేతికత పరమైన అభివృద్ధి కి మరియు విస్తరణ కు మూలం, ఆధారం అవుతుంది’’ అని ఆయన అన్నారు.

 

 

ఎలక్ట్రానిక్స్ మేన్యుఫేక్చరింగ్ ఇకోసిస్టమ్ కు అండదండలను అందించేందుకు దేశం లో ఇటీవల తీసుకొన్న నిర్ణయాల ను శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ప్రశంసిస్తూ, ఆత్మనిర్భరత ను సాధించడానికి ఎలక్ట్రానిక్స్ డిజైన్ లోను, ఎలక్ట్రానిక్స్ తయారీ లోను స్వదేశీ సామర్థ్యాల ను పెంపొందింపచేసుకోవడానికి ఎనలేని ప్రాముఖ్యం ఉందన్నారు.

 

 

అంతక్రితం సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సిఇఎల్) యొక్క స్వర్ణోత్సవ అధికార చిహ్నాన్ని ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఆవిష్కరించడం తో పాటుగా బహుళోపయోగ సభా మందిరం అయినటువంటి ‘స్వర్ణ మండపమ్’ ను కూడాను ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమం లో సైన్స్ ఎండ్ టెక్నాలజీ శాఖ మాన్య మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్, డిఎస్ఐఆర్ యొక్క సెక్రట్రి మరియు సిఎస్ ఐఆర్ యొక్క డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీ ఎన్. కళైసెల్వి, సిఇఎల్ యొక్క సిఎమ్‌డి శ్రీ చేతన్ ప్రకాశ్ జైన్, సిఇఎల్ పరివారం లోని సభ్యులు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు కూడా పాలుపంచుకొన్నారు.

 

***

 



(Release ID: 2029226) Visitor Counter : 33