శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

‘‘ఇంధన టెక్నాలజీల్లో టిఆర్ఎల్ అసెస్ మెంట్ అండ్ పేటెంట్ లాండ్ స్కేపింగ్’’ అనే అంశంపై ఓడబ్ల్యుఓటి ప్రచారం నిర్వహించిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ర్టియల్ రీసెర్చ్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్); నేషనల్ కెమికల్ లేబరేటరీ (ఎన్ సిఎల్)

Posted On: 26 JUN 2024 8:30PM by PIB Hyderabad

సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని శాస్ర్తీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) దేశంలోని 37 లాబ్  లలో 2024 జూన్ 24వ తేదీన ‘‘ఒక వారం ఒక థీమ్’’  (ఓడబ్ల్యుఓటి) కార్యక్రమం నిర్వహించింది.

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సుల శాఖ; పిఎంఓలో సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖ; అణు ఇంధన, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ లో సిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్.కలైసెల్వి సమక్షంలో ఒక వారం ఒక థీమ్ (ఓడబ్ల్యుఓటి) కార్యక్రమం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఓడబ్ల్యుఓటి లోగోను, సిఎస్ఐఆర్ త్పత్తులను డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారు. 12 థీమాటిక్ టెక్నాలజీ బదిలీ ఒప్పందాలు, ఎంఓయులపై సంతకాలు చేసే కార్యక్రమాన్ని వీక్షించారు. సిఎస్ఐఆర్ కు చెందిన వివిధ ప్రయోగశాలల్లో విభిన్న థీమ్ లపై పరిశోధన, నవకల్పనలకు ఓడబ్ల్యుఓటి దోహదపడుతుంది. దేశంలో శాస్ర్తీయ, పారిశ్రామిక పురోగతికి సిఎస్ఐఆర్ అందిస్తున్న విభిన్న సేవలను ప్రాచుర్యంలోకి తేవడంతో పాటు విభినన సామాజిక రంగాలను వాటిలో భాగస్వాములను చేసేందుకు  ఈ కార్యక్రమం దోహదకారి అవుతుంది.

ఒక్కో వారం ఒక్కో రంగంపై ఫోకస్ పెట్టేందుకు వీలుగా నిర్దిష్ట థీమ్ లకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. జూన్ 24వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం 2024 డిసెంబరు 17వ తేదన ముగుస్తుంది. ఆరు నెలల కాలం పాటు సాగే ఈ కార్యక్రమంలో సిఎస్ఐఆర్ కు చెందిన ఎనిమిది ప్రధాన అంశాలను కవర్ చేస్తారు.

ఇంధనం, ఇంధన డివైస్ లు (ఇఇడి) తొలి థీమ్ గా గుర్తించారు. ఈ థీమ్ ఆధారిత ఓడబ్ల్యుఓటి కార్యక్రమం 2024 జూన్ 24న సిఎస్ఐఆర్-నేషనల్ కెమికల్ లేబరేటరీ, పూణెలో నిర్వహించారు. ఇఇడి థీమ్ లో భాగంగా ‘‘ఇంధన టెక్నాలజీల్లో టిఆర్ఎల్ అసెస్ మెంట్ అండ్ పేటెంట్ లాండ్ స్కేపింగ్ : వాణిజ్యీకరణ మార్గాలు’’ అనే అంశంపై డాక్టర్ హోమి భాభా రోడ్, పూనెలోని సిఎస్ఐఆర్-ఎన్ సిఎల్ లో 2024 జూన్ 25వ తేదీన సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్), సిఎస్ఐఆర్ నేషనల్ కెమికల్ లేబరేటరీ (ఎన్ సిఎల్) ఉమ్మడిగా నిర్వహించాయి.  

ఇంధన టెక్నాలజీల్లో టెక్నాలజీ సంసిద్ధత స్థాయి (టిఆర్ఎల్) అంచనా, పేటెంట్ లాండ్ స్కేపింగ్ లోని క్లిష్టమైన అంశాలు, వాణిజ్యీకరణకు గల మార్గాలు అనే అంశంపై సిఎస్ఐఆర్-ఎన్ సిఎల్, పుణె డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ లెలే సవివరంగా ప్రసంగించారు.

ముఖ్యఅతిథిగా హాజరైన ఐసిటి ముంబై మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ ప్రొఫెసర్ జి.డి.యాదవ్ టిఆర్ఎల్ అంచనా, పేటెంట్ లాండ్ స్కేపింగ్ లో సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్ సిపిఆర్ నిర్వహించిన ప్రశంసనీయమైన కృషిని ప్రశంసించారు. భవిష్యత్ ఇంధన టెక్నాలజీలను తీర్చి దిద్దడంలో ఇన్ స్టిట్యూట్ పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.   

ఈ కార్యక్రమంలో భాగంగా రెండు టెక్నికల్ సెషన్లు జరిగాయి. టెక్నాలజీ సంసిద్ధత స్థాయి మదింపు అనే అంశంపై జరిగిన మొదటి సెషన్ కు టిసిటి-క్రెస్ట్,  కోల్కతాలోని రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ ఎనర్జీ డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్ చంద్ర ఓగేల్ అధ్యక్షత వహించారు.

ఇంధన టెక్నాలజీల్లో టెక్నాలజీ మ్యాపింగ్ అనే అంశంపై జరిగిన రెండో సెషన్ కు విశ్వకర్మ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ జబాదే అధ్యక్షత వహించారు.

‘‘ఇంధన డివైస్ లు-వాణిజ్యీకరణ మార్గాలు’’ అనే అంశంపై ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ రెజీ మథాయ్ అధ్యక్షత వహించారు. వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది విద్యార్థులు, బోధనా సిబ్బంది, పరిశోధనా సంస్థలు, స్టార్టప్ లు, పారిశ్రామిక ప్రతినిధులు హాజరయ్యారు.

***



(Release ID: 2029221) Visitor Counter : 11