శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్)కు 'మినీ రత్న' హోదా (కేటగిరీ-1) కల్పిస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

సీఈఎల్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ జితేంద్ర సింగ్


గత కొన్నేళ్లుగా సీఈఎల్ ఆర్థిక స్థిరత్వం, లాభదాయకత, నిర్వహణ సమర్థత వంటి విషయాల్లో నూతన శిఖరాలను నమోదు చేశాయని తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో తయారు చేసిన స్మార్ట్ బోర్డులు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో స్మార్ట్ విద్యను ప్రోత్సహిస్తున్నాయి: డాక్టర్ సింగ్


రక్షణ, రైల్వే, భద్రత, నిఘా, సౌర శక్తి రంగాలలో సిఇఎల్ యొక్క సహకారం స్వదేశీ సాంకేతికతలు, తయారీ సామర్థ్యాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

Posted On: 26 JUN 2024 6:35PM by PIB Hyderabad

ఘజియాబాద్ ప్రాంగణంలో జరిగిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఇఎల్) స్వర్ణోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సీఈఎల్ కు 'మినీ రత్నహోదా (కేటగిరీ-1) ఇవ్వనున్నట్లు  ప్రకటించారు.

 

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దేశ సేవలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని.. ఈ ఏడాది జూన్ 26న స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖఎర్త్ సైన్సెస్పీఎంవోఅణుశక్తి శాఖఅంతరిక్షసిబ్బందిప్రజా ఫిర్యాదులుపింఛన్ల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డా. జితేంద్ర సింగ్  అభినందనలు తెలిపారు.

 

ఈ సందర్భంగా డా. జితేంద్ర సింగ్ మాట్లాడుతూసిఇఎల్ స్వర్ణోత్సవ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖర్ గారు ముఖ్య అథితిగా రావడం గర్వంగా ఉందని తెలిపారు. గౌరవ ఉపరాష్ట్రపతి మార్గదర్శకత్వంప్రేరణ దేశ శ్రేయస్సు కోసం మరింత దోహదం చేసేందుకు ప్రేరేపిస్తాయన్నారు. యాభై ఏళ్ల పాటు అంకితభావంపట్టుదలవిజయం ఈ మహోన్నత ప్రయాణాన్ని నడిపించిన సీఈఎల్ కృషినిబద్ధతదార్శనికతకు నిదర్శనమని కేంద్ర మంత్రి అన్నారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్సిఇఎల్ పనితీరును ప్రస్తావిస్తూగత కొన్నేళ్లుగాముఖ్యంగా గత 5 సంవత్సరాలలోసిఇఎల్ ఆర్థిక స్థిరత్వంలాభదాయకత, , నిర్వహణ సమర్థత కొత్త శిఖరాలను చేరుకుందని తెలిపారు. టర్నోవర్నికర విలువనిల్వలునికర లాభం మొదలైన వాటి పరంగా కూడా సీఇఎల్ పనితీరు చెప్పుకోదగినదని మంత్రి పేర్కొన్నారు.

మధ్యలో గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ. జగ్‌దీప్ ధన్‌ఖర్ఎడమవైపు 1. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 2. చేతన్ జైన్ సీఎండీసీఇఎల్. కుడివైపు 1. శ్రీ సునీల్ శర్మ కేబినెట్ మంత్రిఉత్తర ప్రదేశ్ 2. డాక్టర్ ఎన్.కలైసెల్విడీజీ సీఎస్ఐఆర్

 

సీఇఎల్ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ నుంచి డివిడెండ్ చెల్లించే పీఎస్‌యూగా సీఈఎల్ రూపాంతరం చెందిందని మంత్రి ప్రశంసించారు. భారత ప్రభుత్వానికి సీఇఎల్ డివిడెండ్‌లు చెల్లించడం ఇది వరుసగా మూడో సంవత్సరం అని.. అది కూడా ప్రతి ఏడాది డివిడెండ్ రేటు పెంచుతూ చెల్లిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఈ యాభై ఏళ్లలో దాదాపు రూ. 58 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

 

ప్రధాని నరేంద్ర మోదీ అమృత్ కాల్ భావనను గుర్తు చేస్తూస్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంనైపుణ్యాభివృద్ధి ద్వారా తయారీసామర్థ్యాన్ని పెంచడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రక్షణరైల్వేభద్రతనిఘాసౌరశక్తి రంగాల్లో సీఇఎల్ కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. స్మార్ట్ బోర్డుల ఉత్పత్తిని ప్రారంభించడం వల్ల సీఇఎల్ ఉత్పత్తులను వైవిధ్యపరచడమే కాకుండా దేశంలోని పాఠశాలల్లో స్మార్ట్ విద్య అమలును గణనీయంగా ప్రభావితం చేస్తుందన్నారు.

 

సిఇఎల్ యాజమాన్యం ఉద్యోగుల నియామకాలను బలోపేతం చేయడానికి తీసుకున్న కొత్త కార్యక్రమాలపై డా. జితేంద్ర సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది గత కొన్ని ఏళ్లుగా అద్భుతమైన పనితీరు కనబరిచిగత ఆర్థిక సంవత్సరంలో సరికొత్త గరిష్ట విజయానికి దారితీసిందన్నారు. మినీ రత్న (కేటగిరీ-1) హోదా ఇవ్వడానికి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పనితీరు పారమితులన్నింటిని చేరుకుందని మంత్రి ధృవీకరించారు.

 

ఉత్తర ప్రదేశ్ కేబినెట్ మంత్రి శ్రీ సునీల్ కుమార్ శర్మకౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ డా. ఎన్ కలైసెల్విసీఇఎల్ చైర్మన్మేనేజింగ్ డైరెక్టర్ చేతన్ జైన్భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 2028943) Visitor Counter : 59