కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఫాక్స్‌కాన్ ఇండియా ఆపిల్ ఐఫోన్ ప్లాంట్ లో వివాహిత మహిళలను పని చేయడానికి అనుమతించడం లేదంటూ మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకున్న కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ
తమిళనాడు కార్మిక శాఖ నుంచి నివేదిక కోరిన కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ
Posted On:
26 JUN 2024 6:25PM by PIB Hyderabad
ఫాక్స్‌కాన్ ఇండియా ఆపిల్ ఐఫోన్ ప్లాంట్ లో వివాహిత మహిళలను పని చేయడానికి అనుమతించడం లేదని వివిధ మీడియా కథనాలను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుంది. ఈ నివేదికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వ కార్మిక శాఖ నుంచి సమగ్ర నివేదికను కోరింది.
సమాన వేతన చట్టం 1976లోని సెక్షన్ 5 ప్రకారం.. స్త్రీ, పురుషులను సంస్థలో నియమించుకునేటప్పుడు ఎలాంటి వివక్ష చూపరాదని స్పష్టంగా పేర్కొంది. ఈ చట్టంలోని నిబంధనల అమలు, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వమే సముచితమైన ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది.
వాస్తవ నివేదికను సమర్పించాలని స్థానిక చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయం, భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు సమర్పించాలని ఆదేశించింది.
***
(Release ID: 2028941)
Visitor Counter : 104