సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖాదీ యోగా వస్త్రాలు, మ్యాట్ల బంపర్ సేల్


పలు ప్రభుత్వ శాఖలకు రూ.8.67 కోట్ల విలువైన ఖాదీ యోగా వస్త్రాలు, మ్యాట్లను సరఫరా చేసిన కేవీఐసీ

55 ఖాదీ సంస్థల ద్వారా సరఫరా అయిన 63,700 యోగా వస్త్రాలు, 1,09,022 యోగా మ్యాట్లు

Posted On: 26 JUN 2024 5:55PM by PIB Hyderabad

ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది మంది ఖాదీ కళాకారులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్(కేవీఐసీ) దేశవ్యాప్తంగా 55 ఖాదీ సంస్థల ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలకు రూ.8,67,87,380 విలువైన 1,09,022 యోగా మ్యాట్లను, 63,700 యోగా దుస్తులను విక్రయించింది. ఈ గణాంకాలను విడుదల చేసిన కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ…. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'బ్రాండ్ పవర్' యోగా, ఖాదీలకు సంబంధించి భారతీయ వారసత్వాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిందన్నారు. ఈసారి మన ఖాదీ కళాకారులు తయారు చేసిన ప్రత్యేక యోగా వస్త్రాలు, మ్యాట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోవటం ఖాదీ కుటుంబానికి సంతోషకరమైన విషయం. ఈసారి యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్‌లో, కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అహ్మదాబాద్‌లో ఖాదీ యోగా వస్త్రాలు ధరించి యోగా చేశారని గుర్తు చేశారు. ఇది ఖాదీ కళాకారులకు గర్వకారణం.

కేవీఐసీ చైర్మన్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ రసాయనాలు లేకుండా, తక్కువ నీటిని ఉపయోగించి ఖాదీతో తయారు చేసిన యోగా వస్త్రాలు, మ్యాట్లు ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన ఖాదీ యోగా వస్త్రాలు, మ్యాట్ల అమ్మకాలు వారసత్వంగా వస్తోన్న ఖాదీ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్న విషయాన్ని తెలియజేస్తుందని తెలిపారు. ఇది వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌కు కొత్త బలాన్ని ఇస్తుంది.   

 


ఆయుష్ మంత్రిత్వ శాఖ డిమాండ్ మేరకు ఈసారి కేవీఐసీ ప్రత్యేక ఖాదీ యోగా కుర్తాలను (టీషర్టు తరహాలో) తయారు చేసినట్లు విడుదలైన గణాంకాలు తెలియజేస్తున్నాయి. యువతను దృష్టిలో ఉంచుకుని వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న కేవీఐసీ ఖాదీ భవన్.. ఆయుష్ మంత్రిత్వ శాఖకు 50,000 యోగా మ్యాట్లను, 50,000 యోగా దుస్తులను సరఫరా చేసింది. ఇందులో 300 ప్రీమియం క్వాలిటీ యోగా మ్యాట్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు మంత్రిత్వ శాఖ డిమాండ్ మేరకు శ్రీనగర్‌లో 25,000 ఖాదీ యోగా మ్యాట్లు, వస్త్రాలు… శ్రీనగర్‌లో 10,000 మ్యాట్లు, యోగా వస్త్రాలను సరఫరా చేశారు. శ్రీనగర్‌లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో వేలాది మంది ప్రజలు ఖాదీ వస్త్రాలు ధరించి యోగాభ్యాసంలో పాల్గొన్నారు.

ఆయుష్ మంత్రిత్వ శాఖతో పాటు, కేవీఐసీ ప్రధానంగా మొరార్జీ దేశాయ్ నేషనల్ యోగా ఇన్‌స్టిట్యూట్, జైపూర్, పంచకులలోని నేషనల్ ఆయుర్వేద ఇన్స్టిట్యూట్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఓఎన్‌జీసీ, నాల్కోలకు యోగాభ్యాసం కోసం ఖాదీతో తయారు చేసిన యోగా వస్త్రాలు, మ్యాట్లను సరఫరా చేసింది. మొత్తం రూ.8,67,87,380ల అమ్మకాల్లో ఖాదీ యోగా వస్త్రాల అమ్మకాలు రూ.3,86,65,900 కాగా మ్యాట్ల అమ్మకాలు రూ.4,81,21,480గా ఉన్నాయి. డిమాండ్ ప్రకారం, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీలతో సహా దేశ వ్యాప్తంగా ఉన్న 55 ఖాదీ సంస్థలకు సరఫరా కోసం కేవీఐసీ ఇప్పటికే సమాచారం అందించింది. దీని ద్వారా ఖాదీ సంస్థల్లో పనిచేసే చేనేత కార్మికులు, నేత కార్మికులు, ఖాదీ కార్మికులకు అదనపు వేతనాలతో పాటు అదనపు ఉపాధి అవకాశాలు లభించాయి.

***



(Release ID: 2028938) Visitor Counter : 20