మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎంఓఆర్డి , ఎంఓపిఆర్ సహకారంతో కొత్త క్రిమినల్ చట్టాలపై రెండవ వెబ్‌నార్‌ను నిర్వహించిన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
25 JUN 2024 10:11PM by PIB Hyderabad
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్డి), పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎంఓపిఆర్) సహకారంతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసిడి) ఈ రోజు రెండవ జాతీయ వెబ్‌నార్‌ను నిర్వహించింది. ఇటీవల అమలులోకి వచ్చిన క్రిమినల్ చట్టాలు : భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బిఎస్ఏ) పై ఈ కార్యక్రమం దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళలు, పిల్లల ప్రయోజనాల కోసం ఈ పరివర్తనాత్మక చట్టపరమైన మార్పుల గురించి దేశవ్యాప్త చైతన్యం, అవగాహన పెంచడానికి తీసుకున్న చొరవ ఇది. ఇటువంటి మొదటి వెబ్‌నార్ జూన్ 21,2024న నిర్వహించారు.

సమాజంలోని వివిధ వర్గాలలో మరింత వ్యాప్తి చెందించడానికి నేటి వెబ్‌నార్ ఉపయోగపడుతుంది. దీనిలో ఎంఓపిఆర్ కార్యదర్శి, ఎంఓడబ్ల్యూసిడి, ఎంఓఆర్డి జాయింట్ సెక్రటరీ ద్వారా ప్రారంభ ప్రసంగాలలో కొత్త చట్టాల ముఖ్య నిబంధనలను ప్రముఖంగా ప్రస్తావించారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బీపీఆర్ అండ్ డి), ఎంఓడబ్ల్యూసిడి నిపుణులు, మహిళలు, పిల్లలపై ఈ చట్టాల సానుకూల ప్రభావాలపై లోతుగా వివరాలు అందించారు. వారి రక్షణ, గౌరవం, భద్రతకు సంబంధించిన అంశాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ సంస్థల నుండి ఎన్నికైన ప్రతినిధులు, ముఖ్యంగా మహిళా ప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎంఓపిఆర్, ఎంఓడబ్ల్యూసిడి, ఎంఓఆర్డి నుండి వివిధ వాటాదారులతో సహా దాదాపు 50 లక్షల మంది వాటాదారులు పాల్గొన్నారు.

ఈ సంస్కరణ చట్టాల ఆమోదం భారతదేశంలోని మహిళలు, పిల్లల సాధికారత కోసం విధాన చట్రాన్ని బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఉంది.
***
(रिलीज़ आईडी: 2028852)
आगंतुक पटल : 135