వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 2025 మర్చి 31 వరకు గోధుమలపై నిల్వల పరిమితిని విధించిన కేంద్రం


ట్రేడర్లు/టోకు వర్తకులకు నిల్వల పరిమితి 300 మెట్రిక్ టన్నులు; ప్రతి రిటైల్ ఔట్లెట్ రిటైలర్ పరిమితి 10 ఎంటీ; పెద్ద చైన్ మార్కెట్ రిటైలర్ కు ఒక్కో అవుట్ లెట్ కు 300 ఎంటీ, వారి అన్ని డిపోలకు పరిమితి 3000 ఎంటీ, ప్రాసెసర్‌ల కోసం నెలవారీ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ (ఎంఐసి)లో 70 శాతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలతో గుణించబడుతుంది

Posted On: 24 JUN 2024 2:33PM by PIB Hyderabad

మొత్తం ఆహార భద్రతపై దృష్టి పెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అక్రమంగా నిల్వలు చేయడం, విలువలు పాటించకుండా చేస్తున్న ఊహాగానాలను నిరోధించడానికి, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తకులు/టోకు వ్యాపారులు, రిటైలర్లు, పెద్ద చైన్ రిటైలర్లు, ప్రాసెసర్‌లకు వర్తించే విధంగా గోధుమల నిల్వల పరిమితులను విధించాలని నిర్ణయించింది. లైసెన్సింగ్ అవసరాలు, స్టాక్ పరిమితులు, నిర్దేశిత ఆహార పదార్థాలపై కదలిక పరిమితుల తొలగింపు (సవరణ) ఆర్డర్, 2024 ఈ రోజు అంటే 24 జూన్ 2024 నుండి తక్షణమే అమలులోకి వచ్చేలా జారీ చేశారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇది 31 మార్చి 2025 వరకు వర్తిస్తుంది.

వర్తకులు/టోకు వ్యాపారులు- 3000 ఎంటీ స్టాక్ పరిమితులు వ్యక్తిగతంగా వర్తిస్తాయి; రిటైలర్- ప్రతి రిటైల్ అవుట్‌లెట్‌లకు 10 ఎంటీ; పెద్ద చైన్ రిటైలర్- ప్రతి అవుట్‌లెట్‌కు 10 ఎంటీ, వారి అన్ని డిపోలు, ప్రాసెసర్‌ల వద్ద 3000 ఎంటీ పరిమితి కాగా నెలవారీ ఇన్‌స్టాల్ చేయబడిన కెపాసిటీ (ఎంఐసి)లో 70 శాతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలతో గుణించబడుతుంది. పైన పేర్కొన్న విధంగా సంబంధిత చట్టపరమైన సంస్థలు... ఆహార, ప్రజాపంపిణీ శాఖ పోర్టల్ (https://evegoils.nic.in/wsp/login)లో స్టాక్ పొజిషన్‌ను ప్రకటించి, వాటిని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి. స్టాక్ నిల్వ వారు సూచించిన పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, ఈ నోటిఫికేషన్ జారీ చేసిన 30 రోజులలోపు వారు నిర్దేశించిన స్టాక్ పరిమితులకు వాటిని తీసుకురావాలి.

***



(Release ID: 2028473) Visitor Counter : 23