బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఝార్ ఖండ్ లో భూగర్భం లో బొగ్గు నుండి గ్యాస్ ను ఉత్పత్తి చేయడం కోసం ఉద్దేశించిన మొట్ట మొదటి ప్రయోగాత్మక ప్రాజెక్టు ను మొదలు పెట్టిన బొగ్గు మంత్రిత్వ శాఖ

కోల్ గేసిఫికేశన్ యొక్క ఉపయోగం అనే మాధ్యం ద్వారా దీనిని పారిశ్రమిక ఉపయోగం కోసం మీథేన్, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వంటి విలువైన గ్యాసుల వలె మార్పు చేసి, తద్ద్వారా బొగ్గు పరిశ్రమ లో క్రాంతి ని తీసుకు రావాలనేది ఈ కార్యక్రమం యొక్క ధ్యేయం గా ఉంది

Posted On: 24 JUN 2024 10:45AM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క వ్యూహాత్మక నిర్దేశకత్వం లో భాగంగా, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్‌స్ లిమిటెడ్ (ఇసిఎల్) ఝార్ ఖండ్ లోని జామ్ తాడా జిల్లా లో గల కస్తా బొగ్గు బ్లాకు లో అండర్ గ్రౌండ్ కోల్ గేసిఫికేశన్ (యుసిజి) సంబంధి వినూత్నమైన పైలట్ ప్రాజెక్టు ను మొదలుపెట్టింది. బొగ్గు రంగం లో క్రియాత్మకమైన వివిధీకరణ ప్రయాసల ను తీసుకు రావాలన్నదే మంత్రిత్వ శాఖ ఉద్దేశ్యం గా ఉంది. నిక్షేపాల లో కోల్ గేసిఫికేశన్ ప్రక్రియ ను ఉపయోగించి మీథేన్, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ల వంటి విలువైన గ్యాసుల ను ఉత్పత్తి చేయాలని, తద్ద్వారా బొగ్గు పరిశ్రమ లో విప్లవాత్మకమైన మార్పు ను తీసుకు రావాలని ఈ తొలి మార్గదర్శక కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఈ గ్యాసుల ను సింథెటిక్ నేచరల్ గ్యాస్, ఇంధనాలు, ఎరువులు, విస్ఫోటకాలు మరియు ఇతర పారిశ్రమిక వినియోగాల కోసం రాసాయనిక ఫీడ్ స్టాక్ స్ ను ఉత్పత్తి చేయడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. కోల్ గేసిఫికేశన్ ప్రాజెక్టుల ను ప్రోత్సహించడం కోసం, బొగ్గు ను విభిన్నమైన అధిక విలువ ను కలిగివుండేటటువంటి రాసాయనిక ఉత్పాదనల లోకి మార్చుతూ దీని సామర్థ్యాన్ని పూర్తి స్థాయి లో ఉపయోగం లోకి తీసుకురావడం కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ కంకణం కట్టుకొంది.

   

సాంప్రదాయక గనుల త్రవ్వకం పద్ధతుల లో బొగ్గు వనరుల వెలికితీత ఆర్థికం గా అంతగా లాభసాటి కానటువంటి స్థితి లో ఒక విశేషమైన ప్రయోజనాన్ని భూగర్భ కోల్ గ్యాసిఫికేశన్ ప్రక్రియ అందిస్తున్నది. ఈ ప్రయోగాత్మక పథకం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) కు మరియు సిఐఎల్ అనుబంధ వ్యాపార సంస్థల కు ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పాలి. అంతేకాక ఇది భారతదేశాన్ని ఉన్నత కోల్ గేసిఫికేశన్ సాంకేతికత లను అక్కున చేర్చుకోవడం లో నాయకత్వ స్థానం లో నిలబెట్టగలదు కూడాను.

 

బొగ్గు మరియు లిగ్నైట్ నిక్షేపాలు ఉన్న ప్రాంతాల లో అండర్ గ్రౌండ్ కోల్ గేసిఫికేశన్ ప్రక్రియ ను చేపట్టడం కోసం ఒక సమగ్రమైన పాలిసీ ఫ్రేమ్ వర్కు కు బొగ్గు మంత్రిత్వ శాఖ 2015 వ సంవత్సరం డిసెంబరు లో ఆమోదాన్ని తెలియజేసింది. ఈ విధానాని కి అనుగుణం గా, భారతదేశం లో గనుల త్రవ్వకం సంబంధి స్థితుల కు సరిపడే విధం గా యుసిజి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణ లోకి తీసుకు రావడానికి గాను కస్తా కోల్ బ్లాకు ను కోల్ ఇండియా ఎంపిక చేసింది. రాంచీ లోని సిఎమ్ పిడిఐ మరియు కెనడా కు చెందిన ఎర్గో ఎక్సర్జీ టెక్నాలజీస్ ఇంక్ (ఇఇటిఐ) ల సహకారం తో ఇసిఎల్ ఆధ్వర్యం లో ఈ ప్రాజెక్టు ను రెండు సంవత్సరాల పాటు నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలో రెండు దశలు భాగం గా ఉన్నాయి.

      

ఒకటో దశ ను 2024 జూన్ 22 వ తేదీ నాడు ప్రారంభించడమైంది. బోర్ హోల్ డ్రిలింగ్ ద్వారా మరియు కీలకమైన పరీక్షల ను చేయడం ద్వారా సాంకేతిక సాధ్యత్వం సంబంధి నివేదిక ను రూపొందించవలసి ఉంటుంది. రెండో దశ లో ప్రయోగాత్మక ప్రాతిపదిక న కోల్ గేసిఫికేశన్ పైన దృష్టి ని కేంద్రీకరించడం జరుగుతుంది. సిఐఎల్ కు చెందిన ఆర్&డి బోర్డ్ ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి ఈ మహత్వాకాంక్ష యుక్తమైన ఆర్&డి ప్రాజెక్టు కు ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ స్ లిమిటెడ్ మరియు ఎర్గో ఎక్సర్జీ లు ఉప కార్యనిర్వహణ ఏజెన్సీలు గా ఉంటాయి. ఈ పైలట్ ప్రాజెక్టు ను విజయవంతం గా అమలు పరచిన పక్షం లో ఇది భారతదేశం యొక్క శక్తి రంగం లో పరివర్తనకారి అవకాశాలు అందివస్తాయన్న ఆశ ఉంది. ఇది దేశం లో బొగ్గు వనరుల ను దీర్ఘకాల ప్రాతిపదిక న మరింత సమర్థం గా ఉపయోగించగలిగే సామర్థ్యాన్ని చాటి చెబుతుంది.

ఈ మార్గదర్శక ప్రాయమైన కార్యక్రమం విజయవంతం గా అమలు కావడం కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ సంపూర్ణ సమర్థన ను అందించాలని భావిస్తున్నది. ఈ పరిణామం భారతదేశం లో శక్తి రంగ ముఖచిత్రం పైన సకారాత్మక ప్రభావాన్ని ప్రసరింప చేయగలదని ఆశ పడుతున్నది. ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ స్ లిమిటెడ్ (ఇసిఎల్) నాయకత్వం లో సాగనున్న ఈ వ్యూహాత్మక కార్యక్రమం కోల్ గేసిఫికేశన్ సంబంధి సాంకేతికత లో ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పాలి. ఇది శక్తి రంగం సురక్ష ను వృద్ధి చెందింప చేయడం తో పాటు సతత వికాసాని కి ఊతాన్ని ఇస్తుంది. ఈ ప్రయోగాత్మక పథకం ముందుకు సాగి పోయే క్రమం లో బొగ్గు వనరుల వినియోగం లో ఒక క్రొత్త ప్రమాణాల ను స్థాపించాలన్న లక్ష్యం తో భారతదేశం శక్తి రంగం లో స్వయం సమృద్ధి దిశ లో మహత్వపూర్ణమైన తోడ్పాటు ను అందించనుంది. బొగ్గు రంగం లో నూతన ఆవిష్కరణల కు మరియు సామర్థ్యం వినియోగాని కి అండదండల ను అందించాలనే, దేశ ప్రజల కు రాబోయే కాలం లో పర్యావరణ పరం గా చిరకాలికమైన శక్తి వనరుల ను మరియు ఆటుపోటుల కు తట్టుకొని నిలచే తరహా శక్తి వనరుల ను అందించడాని కి బాట ను పరచాలనే లక్ష్యాల కు బొగ్గు మంత్రిత్వ శాఖ తనను తాను అంకితం చేసుకొంది.

 

 ***

 


(Release ID: 2028208) Visitor Counter : 194