గనుల మంత్రిత్వ శాఖ
స్వీయ, సమాజం కోసం యోగా అనే ఇతివృత్తంతో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించిన గనుల మంత్రిత్వ శాఖ
పాల్గొన్న వారందరూ ప్రతిరోజూ యోగాభ్యాసం చేయాలని ప్రోత్సహించిన కార్యదర్శి శ్రీ వీఎల్.కాంతారావు
Posted On:
21 JUN 2024 11:43AM by PIB Hyderabad
స్వీయ, సమాజం కోసం యోగా అనే నినాదంతో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దిల్లీలో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన శ్రీ వీఎల్.కాంతారావు… జీవితాలను సుసంపన్నం చేసుకోవటానికి ప్రతిరోజూ యోగా సాధన చేయాలని హజరైన వారికి సూచించారు.
చిన్న ఆవిష్కరణ సభతో కార్యక్రమం ప్రారంభం కాగా.. అనంతరం ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా ప్రోటోకాల్‌తో కొనసాగింది. 2014లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రారంభమైన యోగా దినోత్సవం…2015 నుంచి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహించడంలో యోగా ప్రాముఖ్యతను ఇది హైలైట్ చేస్తుంది. యోగా వల్ల కలిగే ప్రయోజనాలపై తమ ఉద్యోగుల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో గనుల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించింది.
***
(Release ID: 2027735)
Visitor Counter : 67