బొగ్గు మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి దార్శనికత వల్ల మన ప్రాచీన యోగా ప్రపంచ సంపూర్ణ శ్రేయస్సుకు శక్తిమంతమైన ఉపకరణమైంది: కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి
10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించిన కేంద్ర బొగ్గు-గనుల మంత్రిత్వశాఖ
Posted On:
21 JUN 2024 2:41PM by PIB Hyderabad
పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఇవాళ ‘ఎబివి ఫౌండేషన్-నిజాం కాలేజి’ సంయుక్తంగా నిర్వహించిన వేడుకలలో కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాదుతూ- ‘‘ప్రజలు... ముఖ్యంగా యువతరం యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ప్రధాని దార్శనికత ఫలితంగా మన ప్రాచీన యోగా ప్రపంచమంతటా సంపూర్ణ శ్రేయస్సు సాధనకు ఒక శక్తిమంతమైన ఉపకరణంగా మారింది’’ అని శ్రీ రెడ్డి అన్నారు.
కాగా, బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో 'మన కోసం... సమాజం కోసం యోగా' ఇతివృత్తంగా 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. అదనపు కార్యదర్శులు శ్రీమతి విస్మితా తేజ్, శ్రీమతి రూపిందర్ బ్రార్; సంయుక్త కార్యదర్శులు శ్రీ బి.పి.పతి, శ్రీ సంజీవ్‌కుమార్ కాస్సీ తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యం గురించి శ్రీమతి విస్మిత తేజ్ వివరించారు. ఈ మేరకు నిత్యం యోగాభ్యాసం చేయాల్సిందిగా కార్యక్రమంలో పాల్గొన్నవారికి సూచించారు. నేటి వేడుకల్లో భాగంగా బ్రహ్మ కుమారీ యోగా శిక్షకుడు సాధారణ యోగా కసరత్తులతోపాటు ధ్యాన యోగాభ్యాసాలను ప్రదర్శించారు. మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల నుంచి 100 మందికిపైగా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో తొలిసారి 2014లో శ్రీకారం చుట్టుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 నుంచి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతోంది.
****
(Release ID: 2027600)
Visitor Counter : 73