యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష (II) 2023 ఫలితాలు ప్రకటించిన యుపిఎస్ సి

Posted On: 20 JUN 2024 5:45PM by PIB Hyderabad

2024 అక్టోబరు నుంచి ప్రారంభం కానున్న చెన్నైకి చెందిన ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ 120వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్స్ (ఎన్ టి) (పురుషులు); మహిళల 34వ షార్ట్ సర్వీస్ కమిషన్ (నాన్-టెక్నికల్) కోర్సుల్లో ప్రవేశానికి రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నిర్వహించిన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష (II) 2023 ఫలితాల ఆధారంగా ప్రతిభాపరంగా అర్హులైన 271 (204+67) మంది జాబితా ఇది. 120వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్స్ (ఎన్ టి) (పురుషులు) విభాగంలో ఎంపికైన 120 మందిలో గతంలో డెహ్రాడూన్ కు చెందిన ఇండియన్ మిలిటరీ అకాడమీ; కేరళలోని ఎజిమలకు చెందిన నేవల్ అకాడమీ; హైదరాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ప్రీ-ఫ్లయింగ్) శిక్షణ కోర్స్ కు సిఫారసు చేసిన అభ్యర్థులు కూడా ఉన్నారు.

2. ప్రభుత్వం తెలియచేసిన ప్రకారం (I) 120వ షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్స్ (పురుషులు) విభాగంలో 169 ఖాళీలుండగా (I I) మహిళల 34వ షార్ట్ సర్వీస్ కమిషన్ (నాన్-టెక్నికల్) విభాగంలో 16 ఖాళీలున్నాయి.

3. మెరిట్ జాబితాను తయారుచేసే సమయంలో అభ్యర్థుల వైద్య పరీక్షా ఫలితాలు పరిగణనలోకి తీసుకోలేదు. అందరి అభ్యర్థిత్వం ప్రావిజనల్ గానే భావించాలి. అభ్యర్థుల జనన తేదీ, విద్యార్హతల వెరిఫికేషన్ సైనిక దళాల ప్రధాన కార్యాలయం నిర్వహిస్తుంది.

4. అభ్యర్థులు ఈ ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని యుపిఎస్ సికి చెందిన వెబ్ సైట్  http://www.upsc.gov.in నుంచి కూడా పొందవచ్చును. అయితే అభ్యర్థులు సాధించిన మార్కులను కమిషన్ వెబ్ సైట్ లో తుది ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 15 రోజుల్లోగా పొందుపరచడం జరుగుతుంది. 30 రోజుల పాటు అవి కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.

5. సిఫారసు సాధించని అభ్యర్థుల స్కోర్, ఇతర వివరాలను ప్రకటించే పథకం కింద వారి వివరాలు కూడా కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరచడం జరుగుతుంది.  ఇలాంటి అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి మార్కులు డౌన్ లోడ్ చేసుకునే సమయంలో తమ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.

6. యుపిఎస్ సి క్యాంపస్ లో ఉన్న పరీక్షల హాలులో యుపిఎస్ సి ఫెసిలిటేషన్ కౌంటర్ కూడా ఉంది. అభ్యర్థులకు ఏదైనా సమాచారం కావాలన్నా లేదా వివరణ కావాలన్నా అన్ని పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యన ఈ కేంద్రానికి వ్యక్తిగతంగా వచ్చి తెలుసుకోవచ్చును లేదా ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చును.

టెలిఫోన్ నంబర్లు : 011-23385271, 011-23381125 and 011-23098543.

Veiw Result in PDF (English)

Veiw Result in PDF (Hindi)

***


(Release ID: 2027332)