కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియా పోస్ట్ పేమెంట్స్, బ్యాంక్ రియా మనీ ట్రాన్స్‌ఫర్ భాగస్వామ్యంతో గ్రామీణ భారతదేశం అంతటా ప్రత్యేక నగదు బదిలీ సేవల వ్యవస్థ ఏర్పాటు


ఖాతాదారులకు సురక్షితమైన, సమర్థవంతమైన, సౌకర్యవంతమైన అంతర్జాతీయ అంతర్గత నగదు బదిలీ సేవను అందించడం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న ఐపీపీబీ & రియా

Posted On: 19 JUN 2024 5:56PM by PIB Hyderabad

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి)రియా మనీ ట్రాన్స్‌ఫర్ (రియా) తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది.  రియా సంస్థ  యూరోనెట్ వరల్డ్‌వైడ్ ఇన్‌కార్పోరేషన్‌ వ్యాపార విభాగానికి చెందిన సీమాంతర నగదు బదిలీ చేసే సంస్థ. ఈ రెండింటి సహకారంతో భారతదేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వినియోగదారులకు సౌకర్యవంతమైనఅందుబాటు ధరల్లో ఆర్థిక సేవలను ఇంటివద్దకే అందిస్తుంది.

 

భారతదేశ జనాభాలోని అరవై ఐదు శాతం మంది పరిమిత ఆర్థిక మౌలిక సదుపాయాలతో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ కుటుంబాలు తమకు విదేశాల నుంచి వచ్చే డబ్బును ఉపసంహరించుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీని ద్వారా వేతన నష్టంప్రయాణ ఖర్చులకు ఎక్కువ అవుతున్నాయి. వారు నగదు మొత్తాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉన్న కారణంగావారు డబ్బుతో ప్రయాణం చేయాలన్నా లేదా ఇంట్లో దాచి ఉంచాలన్నాప్రమాదంతో కూడుకున్నది. ఐపిపిబి- రియా భాగస్వామ్యం ద్వారా ప్రజల ఇంటి వద్దే బ్యాంకింగ్ సేవల వినియోగం పెరుగుతుంది. వారికి అత్యవసరమైన సమయాల్లో నగదు ఉపసంహరించుకోవడానికి సహాయపడుతుంది. ఇదివరకు ప్రజలు ఎదుర్కొన్న అవాంతరాలుప్రమాదాల నుండి వారిని రక్షిస్తుంది. తద్వారా వాస్తవిక ఆర్థిక చేరికను అనుభవిస్తారు. ఇది వారి దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది.

 

ఈ రెండింటి భాగస్వామ్యం ద్వారాతక్షణమే దేశంలోని 25 వేల పైచిలుకు తపాలా కార్యాలయాల్లో ఇంటర్నేషనల్స్ ఇన్‌వార్డ్ మనీ ట్రాన్స్‌ఫర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తపాలా కార్యాలయాల ద్వారా 100,000 ప్రాంతాలకు చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద తపాలా వ్యవస్థ అయిన ఐపిపిబి పరిధిఅదేవిధంగా రియా సంస్థ ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్ విస్తృతమైన ఉత్పత్తి సేవల ద్వారాభారతదేశంలోని వినియోగదారులందరికీ ఏ ప్రాంతంలో ఉన్నా వేగవంతమైనసౌకర్యవంతమైనసురక్షితమైన ఇంటింటి సేవలు పొందడం ద్వారా ప్రయోజనాలను అందుకుంటారు.

ఐపిపిబి ఎండిసీఈఓ శ్రీ ఆర్ విశ్వేశ్వరన్ మాట్లాడుతూ, "గ్రామీణ భారతదేశం మన దేశానికి గుండెకాయ వంటిదిఅనేక గ్రామీణ కుటుంబాలకువిద్యఆరోగ్య సంరక్షణరోజువారీ జీవన ఖర్చుల కోసం  విదేశాల నుండి నగదు బదిలీ సేవలు పొందడం వారికి ఒక జీవనాధారం. ఐపిపిబి యొక్క విస్తృతమైన నెట్ వర్క్విశ్వసనీయ సేవతోగ్రామీణ వినియోగదారులకు అంతర్జాతీయ అంతర్గత నగదు బదిలీలను మరింత అందుబాటులోవిశ్వసనీయంగా చేస్తున్నాం. ఈ సేవ ఒక కీలకమైన అంతరాన్ని తొలగిస్తుంది. దేశంలోని కుటుంబాలుకమ్యూనిటీలు విదేశాల్లోని వారి బంధువులుప్రియమైనవారితో నిరాటంకంగాసురక్షితంగా అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ లోని ఏ మారుమూల ప్రాంతమైనా వెనుకబడకుండా చూడాలనే మా అంకితభావానికి ఈ చొరవ నిదర్శనం" అని అన్నారు.

 

అదనంగానగదు బదిలీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి రెమిటెన్స్‌లను అందించేందుకు వినియోగదారుల కెవైసి (నో యువర్ కస్టమర్) కోసం వెరిఫైడ్ బయోమెట్రిక్ అథెంటికేషన్డిజిటల్ లావాదేవీ ధృవీకరణ వంటి ప్రస్తుత సాంకేతికతమౌలిక సదుపాయాలను ఎటువంటి భౌతిక ఐడి కార్డ్ చూపించాల్సిన అవసరం లేకుండానే ఐపిపిబి రియా ఉపయోగించుకుంటున్నాయి. సురక్షితమైనకాగితాన్ని ఉపయోగించకుండా రెమిటెన్స్ లను స్వీకరించే ప్రక్రియ క్రమబద్ధీకరణఅత్యున్నత నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంభద్రతా చర్యలను బలోపేతం చేయడం ద్వారా రెండు సంస్థలు వినియోగదారుల్లో అనుభూతిని పెంచుతున్నాయి.

 

"ఒక వినియోగదారుడు నగదు బదిలీ ప్రొవైడర్‌ను ఎంచుకున్నప్పుడువారు కష్టపడి సంపాదించిన డబ్బును ఆ సంస్థకు అప్పగిస్తున్నారు. గ్రామీణ సమాజంఈ ఐపిపిబిరియా సేవలను పొందడం సురక్షితమైనసౌకర్యవంతమైన పద్ధతిలో నిధులను పొందడం కన్నా ఎక్కువ" అని రియా మనీ ట్రాన్స్‌ఫర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ షాన్ ఫీల్డర్ అన్నారు. "ఐపిపిబితోరియా భాగస్వామ్యం అనేక రకాల గ్రామీణ సమాజానికి ఆర్థిక అవకాశాలను అందిస్తుంది. వారు మనందరిలాగేప్రతి రోజు జీవితంలో మెరుగైన అవకాశాన్ని పొందడానికి అర్హులు."

 

రియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ ఇగ్నాసియో రీడ్ మాట్లాడుతూ, "రియా- ఐపిపిబి మధ్య ఈ భాగస్వామ్యం భారతదేశం అంతటా ఉన్న మా వినియోగదారులకు సృజనాత్మక పరిష్కారాలను అందించడానికి మా ఉమ్మడి బలాలను ఉపయోగించుకోవడానికి మాకు అనుమతిస్తుంది."

ఈ భాగస్వామ్యం సేవల్లో శ్రేష్టతనువారి నెట్‌వర్క్ సామర్థ్యాలను పెంపొందించడంరెమిటెన్స్ వ్యవస్థ అంతటా సానుకూల మార్పును తీసుకురావడానికి ఐపిపిబిరియా భాగస్వామ్య నిబద్ధతను తెలుపుతుంది. ఈ సహకారం వాటాదారులందరికీ గణనీయమైన ప్రయోజనాలకు దారితీస్తుందని రెండు సంస్థలు విశ్వసిస్తున్నాయి.

 

 

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గురించి:

 

కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలోని తపాలా శాఖ కింద ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) 1 సెప్టెంబర్ 2018న ప్రారంభించబడిన పూర్తి భారత ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ. భారతదేశంలో సామాన్య ప్రజానికానికి అత్యంత అందుబాటులోసరసమైన విశ్వసనీయమైన బ్యాంకును నిర్మించాలనే దార్శనికతతో ఈ బ్యాంకును ఏర్పాటు చేశారు. 1,61,000 పైచిలుకు పోస్టాఫీసులు (గ్రామీణ ప్రాంతాల్లో 1,43,000) 1,90,000 పైచిలుకు తపాలా ఉద్యోగులతో కూడిన పోస్టల్ నెట్‌వర్క్ కలిగి ఉంది. ఇది బ్యాంకింగ్ లేని వారికిబ్యాంకింగ్ సేవలు పూర్తిగా వినియోగించుకోలేని వారి కోసం అడ్డంకులను తొలగిస్తూచివరి మైలుకు చేరుకోవడం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ప్రాథమిక విధి.

 

ఐపిపిబి అందుబాటుదాని నిర్వహణ మోడల్ ఇండియా స్టాక్ యొక్క కీలక స్తంభాలపై నిర్మించబడింది. సిబిఎస్-ఇంటిగ్రేటెడ్ స్మార్ట్‌ ఫోన్బయోమెట్రిక్ పరికరం ద్వారా కాగిత రహితనగదు రహితఉనికి అవసరం లేని బ్యాంకింగ్ సేవలు వినియోగదారుల ఇంటి వద్దకే సరళమైనసురక్షితమైన సేవలను అందిస్తుంది. పొదుపుతో కూడిన సృజనాత్మకతను అందిపుచ్చుకొనిసామాన్యులకు బ్యాంకింగ్ సౌలభ్యంపై అధిక దృష్టి సారించిన ఐపిపిబి 13 భాషల్లో అందుబాటులో సులభతర వినిమయం ద్వారా సరళమైనసరసమైన బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది.

 

తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకుడిజిటల్ ఇండియా దార్శనికతకు దోహదం చేయడానికి ఐపీపీబీ కట్టుబడి ఉంది. ప్రతి పౌరుడు ఆర్థికంగా సురక్షితంగాసాధికారత పొందడానికి సమాన అవకాశం లభించినప్పుడే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. మా నినాదం ప్రతీ వినియోగదారుడు ముఖ్యం- వాస్తవంప్రతి లావాదేవీ ముఖ్యమైనదిప్రతి డిపాజిట్ విలువైనది.

 

 

రియా మనీ ట్రాన్స్ ఫర్ గురించి:

 

యూరోనెట్ (ఎన్ఏఎస్‌డిఏక్యూ: ఇఇఎఫ్‌టీ) యొక్క వ్యాపార విభాగమైన రియా మనీ ట్రాన్స్‌ఫర్ వేగవంతమైనసురక్షితమైనసరసమైన ప్రపంచ నగదు బదిలీలతో సహా వినూత్న ఆర్థిక సేవలను అందిస్తుంది. రెండవ అత్యంత విస్తృతమైన క్యాష్ సెటిల్మెంట్ నెట్వర్క్ప్రపంచంలోనే అతిపెద్ద డైరెక్ట్ బ్యాంక్ డిపాజిట్ నెట్వర్క్‌ని రియా కలిగి ఉంది.

 

డిజిటల్భౌతిక లావాదేవీల మధ్య అంతరాన్ని పూడ్చడానికిరియా యొక్క అన్ని రంగాల ఉత్పత్తులు సేవలను అందిస్తుందిసంస్థ వేగంగా విస్తరిస్తున్న ప్రత్యామ్నాయ గ్లోబల్ పే-అవుట్ సామర్థ్యాలతో పాటుఏజెంట్లుభాగస్వాములురియల్-టైమ్ చెల్లింపులుఇంటివద్దకే సేవలుమొబైల్ వాలెట్లుఎటిఎం కార్డు లేకుండానే చెల్లింపులు (ప్రత్యేకంగా రియాతో) ఈ సంస్థ అందిస్తుంది. డాండెలైన్ రియల్-టైమ్దేశాంతర చెల్లింపు నెట్వర్క్ ద్వారా నడిచే రియా గ్లోబల్ మౌలిక వసతులువినియోగదారులు భాగస్వాములకు ఆర్థిక ప్రాప్యతను సులభతరం చేస్తుంది. కొత్త మార్కెట్ అవకాశాలను తెరవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. మెరుగైన రోజువారీ జీవితానికి మార్గాలను రియా అందిస్తుంది.

***


(Release ID: 2026858) Visitor Counter : 110


Read this release in: English , Urdu , Hindi , Tamil