బొగ్గు మంత్రిత్వ శాఖ
థర్మల్ పవర్ ప్లాంట్లలో ఎన్నడూ లేనంత అత్యధికంగా బొగ్గు నిల్వలు
టీపీపీల వద్ద 45 మిలియన్ టన్నులు దాటిన బొగ్గు నిల్వలు
అధిక విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరిగేలా నిరంతర చర్యలు తీసుకుంటున్న బొగ్గు మంత్రిత్వ శాఖ
Posted On:
19 JUN 2024 3:00PM by PIB Hyderabad
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా అయ్యేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అహర్నిశలు శ్రమిస్తోంది. పెరిగిన ఉత్పత్తి, సమర్థవంతమైన రవాణా నిర్వహణ, ఏజెన్సీల మధ్య సరైన సమన్వయం ఫలితంగా, బొగ్గు మంత్రిత్వ శాఖ థర్మల్ పవర్ ప్లాంట్లలో అత్యధిక బొగ్గు నిల్వలను నిర్ధారించింది. ప్రస్తుత గరిష్ట అవసరాలు ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా పౌరులకు నిరంతర విద్యుత్తును పొందడం ఈ క్రియాశీల చొరవ లక్ష్యం. విద్యుత్ అధిక అవసరాలు ఉన్నప్పటికీ, థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అధికంగా ఉన్నాయి. 16 జూన్ 2024 నాటికి 45 మిలియన్ టన్నులు (ఎంటి) మించాయి, ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 34.25 మెట్రిక్ టన్నులు కాగా ప్రస్తుతం ~ 31.71% ఎక్కువ.
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఆధారిత విద్యుత్ డిమాండ్ 7.30% పెరిగింది. బొగ్గుకు అత్యధిక డిమాండ్ ఉన్నది కూడా ఇదే.
16.06.2024 నాటికి, మొత్తం బొగ్గు ఉత్పత్తి 207.48 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది గతేడాది ఉత్పత్తి అయిన 189.87 మెట్రిక్ టన్నులతో పోలిస్తే 9.27% వృద్ధిని కనబరిచింది. కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) 160.25 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 7.28% పెరిగింది. అదేవిధంగా క్యాప్టివ్, కమర్షియల్ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 33 మెట్రిక్ టన్నులకు చేరుకోగా, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 27 శాతం వృద్ధి నమోదైంది.
16 జూన్ 2024 నాటికి క్యుములేటివ్ బొగ్గు పంపిణీ 220.31 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 204.65 మెట్రిక్ టన్నులతో పోలిస్తే 7.65% వృద్ధితో ఉంది. కోల్ ఇండియా లిమిటెడ్ 166.58 మెట్రిక్ టన్నుల పంపకాలను నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 158.91ఎంటీ తో పోలిస్తే 4% పెరిగింది. క్యాప్టివ్, వాణిజ్య గనుల నుండి బొగ్గు తరలింపు 39.45 మెట్రిక్ టన్నులుగా నమోదైంది, ఇది 30% వృద్ధితో ఉంది. విద్యుత్ రంగానికి ఎగుమతులు 180.35 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి, ఇది గత సంవత్సరం 170.61 మెట్రిక్ టన్నులతో పోలిస్తే 5.71% వృద్ధిని ప్రతిబింబిస్తుంది.
బొగ్గు సజావుగా, తగినంత సరఫరా జరిగేలా సమర్థవంతమైన రవాణా సౌకర్యాలు ఏర్పాట్లు చేయడమే ఈ విజయానికి కారణం. విద్యుత్ మంత్రిత్వ శాఖ, బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, విద్యుత్ ఉత్పత్తి సంస్థల ప్రతినిధులతో కూడిన సబ్‌గ్రూప్ సమర్థవంతమైన సరఫరా వ్యవస్థ నిర్వహణలో కీలక పాత్ర పోషించింది.
దేశంలో మొత్తం బొగ్గు నిల్వలు (గనులు, రవాణా, విద్యుత్ ప్లాంట్లు) 144.68 మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నాయి, ఇది విద్యుత్ రంగానికి తగినంత బొగ్గు సరఫరాను అందిస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రేక్స్ రోజువారీ లభ్యతలో 10% సగటు వృద్ధిని కనబరిచింది. 16 జూన్ 2024 నాటికి రోజుకు సగటున 428.40 రేక్లు సరఫరా చేయబడ్డాయి. తీరప్రాంత నౌకాయానం ద్వారా బొగ్గు తరలింపు కూడా గణనీయమైన వృద్ధిని చవిచూసింది. సాంప్రదాయకంగా పారాదీప్ నౌకాశ్రయం ద్వారానే బొగ్గు రవాణా జరిగేది.., కానీ ఇప్పుడు బొగ్గు లాజిస్టిక్స్ విధానం ప్రకారం సరైన సమన్వయంతో ధమ్రా, గంగవరం పోర్టుల ద్వారా కూడా బొగ్గును తరలిస్తున్నామన్నామని తెలిపారు. రైల్వే నెట్‌వర్క్‌లో మౌలిక సదుపాయాల పెంపు ముఖ్యంగా సోన్ నగర్ నుండి దాద్రికి రేక్ల కదలికను మెరుగైంది. ఫలితంగా టర్న్అరౌండ్ సమయం 100% కంటే ఎక్కువ మెరుగుపడింది.
బొగ్గు ఉత్పత్తి, రవాణాను పెంచడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ పూర్తిగా కట్టుబడి ఉంది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి విద్యుత్ ప్లాంట్లలో పుష్కలమైన నిల్వలు ఉండేలా చూసుకుంటోంది. ఈ సమన్వయ ప్రయత్నాలు అధిక విద్యుత్ అవసరాలను తీర్చడానికి స్థిరమైన, సమర్థవంతమైన బొగ్గు సరఫరాను నిర్వహించడానికి గణనీయంగా దోహదం చేశాయి.
***
(Release ID: 2026857)
Visitor Counter : 82