బొగ్గు మంత్రిత్వ శాఖ
60 బొగ్గు బ్లాకుల కోసం 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని జూన్ 21న ప్రారంభించనున్న శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
19 JUN 2024 4:44PM by PIB Hyderabad
దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి, దేశానికి ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ తదుపరి విడత బొగ్గు బ్లాక్ వేలాన్ని ప్రారంభించనుంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి 21 జూన్ 2024 న హైదరాబాద్‌లో 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు మైనింగ్ వేలాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా తదితరులు పాల్గొంటారు.
ఈ చొరవ బొగ్గు రంగంలో పారదర్శకత, పోటీతత్వం, సుస్థిరతను పెంపొందించడానికి దోహదపడుతుంది. ఈ వేలంలో 60 బొగ్గు బ్లాక్‌లను వేలం వేయనున్నారు. ఇందులో వివిధ రకాల కోకింగ్, నాన్-కోకింగ్ బొగ్గు గనులు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు/ ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ బ్లాక్‌లు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయి.
ఈ విడత వేలం, బొగ్గు రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యం లో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. పారదర్శక, పోటీ బిడ్డింగ్ కోసం మరిన్ని బ్లాక్‌లను తెరవడం ద్వారా, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రతను పెంచడానికి భారత ప్రభుత్వం దేశంలోని విస్తారమైన బొగ్గు నిల్వలను అందుబాటులో ఉంచుతుంది. పర్యావరణ నిర్వహణతో ఆర్థికాభివృద్ధిని సమతుల్యం చేసే సుస్థిర మైనింగ్ పద్ధతులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
మునుపటి విజయవంతమైన వేలం నేపథ్యంలో రాబోయే 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు మైనింగ్ వేలం, ఈ రంగాన్ని ముందుకు నడిపించడానికి మంత్రిత్వ శాఖ ధృఢమైన నిబద్ధతను సూచిస్తుంది. రాబోయే రౌండ్‌లో మొత్తం 60 బొగ్గు గనులు ఉంటాయి. వీటిలో 24 బొగ్గు గనులను పూర్తిగా అన్వేషించగా, 36 గనులలో పాక్షిక అన్వేషణ జరిగింది.
అదనంగా, కమర్షియల్ కోల్ 9వ రౌండ్, 2వ ప్రయత్నం కింద 5 బొగ్గు గనులు వేలానికి వచ్చాయి. వీటిలో, నాలుగింటిలో పూర్తి అన్వేషణ జరగగా, 1 పాక్షికంగా అన్వేషించారు. అలాగే, రౌండ్ 8 కి సంబంధించి 2వ ప్రయత్నం కింద 2 బొగ్గు గనులు వేలానికి వచ్చాయి. వీటిలో 1 పూర్తిగానూ , ఇంకొకటి పాక్షికంగాను అన్వేషించారు.
రాష్ట్రాల వారీ వేలం జరిగే బొగ్గు గనులు:
రాష్ట్రం
|
మొత్తం గనులు
|
బొగ్గు రకం
|
అన్వేషణ స్థితి
|
కోకింగ్
|
నాన్ -కోకింగ్
|
లిగ్నైట్
|
పూర్తి అన్వేషణ జరిగినవి
|
పాక్షికంగా అన్వేషించినవి
|
బీహార్
|
3
|
0
|
3
|
0
|
2
|
1
|
ఛత్తీస్గఢ్
|
15
|
0
|
15
|
0
|
6
|
9
|
ఝార్ఖండ్
|
6
|
0
|
6
|
0
|
2
|
4
|
మధ్యప్రదేశ్
|
15
|
2
|
13
|
0
|
3
|
12
|
మహారాష్ట్ర
|
1
|
0
|
1
|
0
|
0
|
1
|
ఒడిశా
|
16
|
0
|
16
|
0
|
7
|
9
|
తెలంగాణ
|
1
|
0
|
1
|
0
|
1
|
0
|
పశ్చిమబెంగాల్
|
3
|
0
|
3
|
0
|
3
|
0
|
మొత్తం
|
60
|
2
|
58
|
0
|
24
|
36
|
బొగ్గు అమ్మకం లేదా వినియోగంపై ఎలాంటి పరిమితులు లేవు. ముఖ్యంగా, అర్హత ప్రమాణాలు తొలగించారు. పాల్గొనడానికి ఏవైనా సాంకేతిక లేదా ఆర్థిక అడ్డంకులు కూడా తొలగించారు. అలాగే, నోటిఫైడ్ ధర నుండి జాతీయ బొగ్గు సూచికకు వ్యూహాత్మక మార్పుతో పారదర్శకత, నిష్పాక్షికతను సూచిస్తుంది, మార్కెట్ ఆధారిత ధరల విధానాన్ని ఏర్పాటు చేస్తుంది. ఖనిజ చట్టాల సవరణ బొగ్గు రంగాన్ని అందుబాటులోకి తేవడంలో కీలకపాత్ర పోషించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం వారికి సమానమైన అవకాశాన్ని అందించడం, సొంత వినియోగం, అమ్మకంతో సహా వివిధ ప్రయోజనాల కోసం వేలాన్ని అనుమతించడం జరుగుతుంది.
సులభతర వాణిజ్యం కోసం, బొగ్గు గనుల సత్వర నిర్వహణకు వివిధ అనుమతులను పొందేందుకు ఒక వేదికను రూపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ (ఎస్డబ్ల్యూసిఎస్) పోర్టల్‌ను రూపొందించింది. దీని ఫలితంగా దేశంలో బొగ్గు ఉత్పత్తి ఒకే గేట్ వే ద్వారా వృద్ధి చెందుతుంది. ఈ సంస్కరణలు బొగ్గు రంగంలో పురోగతికి, స్థితిస్థాపకతకు మూలస్తంభాలుగా పనిచేస్తాయి.
అంతే కాకుండా, జరగబోయే కమర్షియల్ బొగ్గు గనుల వేలం ఆర్థిక వృద్ధిని పెంచడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, సుస్థిరాభివృద్ధికి దోహదపడే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇంధన రంగంలో వృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణాన్ని పెంపొందించడానికి మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
గనులు, వేలం నిబంధనలు, కాలపరిమితి మొదలైన వాటికి సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని ఎంఎస్‌టీసీ వేలం ప్లాట్‌ఫారమ్‌లో పొందవచ్చు. పర్సంటేజ్ రెవెన్యూ షేర్ మోడల్ ఆధారంగా పారదర్శక ప్రక్రియ ద్వారా ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించనున్నారు.
***
(Release ID: 2026660)
Visitor Counter : 202