సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

"ఉద్ధంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని వివిధ జాతీయ ప్రాజెక్టులతో సహా జమ్ము& కశ్మీర్‌లోని ప్రధాన రహదారి ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఆమోదం తెలుపుతూ, సమీక్ష నిర్వహణ" జరిగిందని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 17 JUN 2024 6:53PM by PIB Hyderabad

సుమారు రూ.4000 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక చత్తర్‌గాలా సొరంగ పనులను భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) చేపడుతుందనికథువా ఎక్స్‌ప్రెస్ నడవా సెక్షన్‌లోని అండర్‌పాస్‌లను ప్రజలు కోరిన చోట త్వరితగతిన చేపడతామని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

జమ్ము కశ్మీర్ లోని పలు ప్రధాన రోడ్డుసొరంగ ప్రాజెక్టులపై నేడు శ్రీనగర్‌లో కేంద్ర రోడ్డు రవాణారహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అధ్యక్షతన దాదాపు నాలుగు గంటలపాటు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సంతృప్తి వ్యక్తం చేస్తూతాను చేసిన సలహాలుప్రతిపాదనలను కేంద్రమంత్రి శ్రీ గడ్కరీ అంగీకరించినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

 

చత్తర్‌గాలా సొరంగ ప్రతిపాదన ఆరేళ్ల క్రితం ప్రారంభించినదనిడీపీఆర్ ను కూడా బీఆర్ఓ ఏజెన్సీ 'బేకన్స్తయారు చేసిందనికానీ నిధుల కొరత కారణంగా అది సాధ్యం కాలేదని కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)పీఎంవోఅణుశక్తి విభాగంఅంతరిక్ష శాఖఎంఓఎస్ పర్సనల్ప్రజా ఫిర్యాదులుపింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. లఖన్‌పూర్ నుంచి బసోహ్లీ-బానీభదేర్వా-దోడా మధ్య కొత్త జాతీయ రహదారి నిర్మాణాన్ని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.  ఒకవైపు నుంచి నిర్మాణ పనులు సొరంగ ప్రదేశానికి చేరుకోగానే చారిత్రాత్మక చత్తర్‌గాలా సొరంగ నిర్మాణం కూడా చేపడతామని తెలిపారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, "ఈ రహదారి పూర్తయిన తర్వాతఇది అద్భుతమైన మార్పుకు నాంది పలుకుతుందనిఇది పర్యాటక ప్రదేశాలైన బసోహ్లిబానీ ద్వారా లఖన్‌పూర్దోడా జిల్లా మధ్య అన్ని కాలాల వాతావరణ అనుసంధానతను కలిగి ఉంటుదనన్నారు. అంతేకాకుండా ఈ నిర్మాణాలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా వ్యాపారఉపాధి ఆదాయ ఉత్పత్తికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఢిల్లీ-కత్రా ఎక్స్‌ప్రెస్ నడవా గురించి మంత్రి ప్రస్తావిస్తూ, 2015 లో ప్రారంభమైన ఎన్నో ప్రయత్నాల తరువాత ఎక్స్‌ప్రెస్ నడవాకు ఆమోదం లభించిందని తెలిపారు. ఎందుకంటే పంజాబ్ సైతం దిల్లీ-అమృత్ సర్ మధ్య ఇలాంటి ఎక్స్‌ప్రెస్ నడవాను డిమాండ్ చేసినందున ప్రారంభ జాప్యం జరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. చివరకు అమృత్ సర్- కథువా వద్ద ఆగే స్థలాలను ఏర్పాటు చేస్తూ ఢిల్లీ-కత్రా మధ్య ఎక్స్‌ప్రెస్ నడవా ఏర్పాటుకు రాజీ కుదిరిన తర్వాత ఈ ప్రాజెక్టు ఖరారైందని తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్ నడవా చివరి దశలో ఉందనిస్థానిక ప్రజల సౌలభ్యం కోసం హత్లీరాజ్‌బాగ్చన్ అరోరియన్చాపర్కూటా వంటి ప్రాంతాల్లో అండర్ పాస్‌ల నిర్మాణానికి ప్రజల డిమాండ్ ను అంగీకరించడం జరిగిందని తెలిపారు.

అదే నియోజకవర్గంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, "కిష్త్వార్ ఛత్రు లో నిర్మిస్తున్న జాతీయ రహదారి విభాగానికి చెందిన పనులను కూడా వేగవంతం చేస్తామనిఇది ప్రయాణ సౌలభ్యం కోసం ప్రత్యామ్నాయ రహదారి అనుసంధానాన్ని అందిస్తుంది" అని అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తన లోక్‌సభ నియోజకవర్గానికి ప్రధాన హైవే ప్రాజెక్టులను కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చెనాని-సుధామ దేవ్ జాతీయ రహదారి యొక్క మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేస్తామని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. ఖిలేని మీదుగా గోహాకు వెళ్లే కొత్త జాతీయ రహదారి బెర్గానాహంబల్ గ్రామాలతో పాటు తన సొంత గ్రామమైన కలోటాతో జాతీయ రహదారి అనుసంధానం ఉంటుందని తెలిపారు.

కేంద్రమంత్రివర్గంలో జమ్ము కశ్మీర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రిగాశ్రీనగర్-సోనామార్గ్ విభాగంజోజిలా టన్నెల్జమ్ము రాజౌరి రహదారి,  శ్రీనగర్జమ్మూ రెండు రింగ్ రోడ్ల యొక్క కొనసాగుతున్న ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించినందుకు డాక్టర్ జితేంద్ర సింగ్ కేంద్ర రోడ్డు రవాణారహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ని అభినందించారు.

 

***



(Release ID: 2026057) Visitor Counter : 26